హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉపదేశాలు

శని, 12/10/2022 - 17:28

దైవప్రవక్త(స.అ) కుమార్తె అయిన హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) బోధించిన కొన్ని సద్బోధనలు... 

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉపదేశాలు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

మనిషి యొక్క వ్యక్తిత్వం, గొప్పతనం మరియు వివేకం వారి మాటలు మరియు ఉపదేశాలను బట్టి తెలిస్తాయి. అలా పవిత్ర స్త్రీ హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉపదేశాలను బట్టి వారి యొక్క గొప్పతనం మరియు వారికి ఇస్లాం పట్ల ఉన్న అవగాహన మనకు తెలుస్తుంది. ఇక్కడ వారు ఉపదేశించిన కొన్ని హదీసుల తెలుగు అనువాదం మీ కోసం...

1. దైవప్రవక్త(స.అ) ఉత్తమ ఉత్తరాధికారు
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ సాక్షిగా, దైవప్రవక్త(స.అ) ఇలా చెబుతుండగా విన్నాను: “మీలో నా ఉత్తరాధికారిగా నియమించేందుకు అలీ, ఉత్తమడు. అతడే ఇమామ్ మరియు నా తరువాత ఖలీఫహ్”[1]

2. హజ్రత్ ఫాతెమా(స.అ) పై దురూద్
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) నాతో ఇలా అన్నారు: ఓ ఫాతెమా, నీపై దురూద్ పంపేవారికి అల్లాహ్ క్షమిస్తాడు మరియు నేను స్వర్గంలో ఎక్కుడున్న అతడ్ని నాతో కలుపుతాడు.[2]

3. విశ్వాసి చూపు
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: విశ్వసి అల్లాహ్ కాంతితో చూస్తాడు.[3]

4. పవిత్ర స్ర్తీల పై నింద నుండి దూరం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ లఅనత్ నుండి దూరంగా ఉండడం కోసం ఆయన (పవిత్ర స్ర్తీల ను) నిందించడం నుండి దూరంగా ఉండడాన్ని వాజిబ్ గా నిర్థారించెను.[4]

5. విశ్వాసం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ విశ్వాసాన్ని, షిర్క్ యొక్క మురికి నుండి పవిత్రంగా మారడానికి వాజిబ్ గా నిర్ధారించెను.[5]

6. అనాధుల సొమ్ము నుండి దూరంగా ఉండడం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ అన్యాయం (మరియ ఇతరుల హక్కులను నాశనం) కు గురి కాకుడదని అనాధుల సొమ్ము నుండి దూరంగా ఉండాన్ని వాజిబ్ గా నిర్ధారించెను.[6]

7. తూకం మరియు పరిమాణం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్, తూకం మరియు పరిమాణం సరిగ్గా ఉండాలి అని చెప్పి సరిగా తూకకుండా అమ్మడం చెడ్డ పని అని చూపించాడు.[7]

8. ఇమామత్ మరియు అధికారం అల్లాహ్ తరపు నుండి అవతరించబడిన నాయకులది
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ (తన నాయకుల) నాయకత్వాన్ని ఉమ్మత్ యొక్క క్రమశిక్షణ మరియు చీలిక నుండి కాపాడేందుకు ఇమామత్ ను వాజిబ్ గా నిర్ధారించెను.[8]

9. సహనం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ సహనాన్ని దుఆ స్వీకరణగా నిర్ధారించెను.[9]

10. ఉపవాసం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ ఉపవాస దీక్షను స్వచ్ఛతను పఠిస్టించడానికి వాజిబ్ గా నిర్ధారించెను.[10]

11. పిసినారితనం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) నాతో ఇలా అన్నారు: పిసినారితనం వద్దు; ఎందుకంటే పీనాసితనం, నరకంలో ఉన్న ఒక చెట్టు, దాని కొమ్మలు ప్రపంచంలో ఉన్నాయి, ఎవరైతే ఆ కొమ్మల నుండి ఒక కొమ్మను వేలాడుతో అతడు నరకాగ్నిలో ప్రవేశిస్తాడు.[11]

12. మస్జిదులో ప్రవేశించే మరియు బయటకు వచ్చేటప్పుడు చదవవలసిన దుఆ
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) మస్జిదులో ప్రవేశించేటప్పుడు ఇలా చెప్పేవారు: “బిస్మిల్లాహి, వస్సలాము అలా రసూలిల్లాహి, అల్లాహుమ్మగ్ ఫిర్ లీ జునూబీ, వఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్” మస్జిదు నుండి బయటకు వచ్చే టప్పుడు ఇలా చెప్పేవారు: “బిస్మిల్లాహి, వస్సలాము అలా రసూలిల్లాహి, అల్లాహుమ్మగ్ ఫిర్ లీ జునూబీ, వఫ్తహ్ లీ అబ్వాబ ఫజ్లిక్”[12]

13. నిజమైన ఉపవాసం
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: ఒకవేళ ఉపవాసి తన నోరు, చెవులు, కళ్లు మరియు ఇతర అవయవాలను కాపాడుకోని వాడు, ఇక ఉపవాసం ఎందుకు2.[13]

14. దైవప్రవక్త(స.అ) మరణం తరువాత
హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఉల్లేఖనం: ప్రజలు మరణించిన తరువాత అల్లాహ్ సాక్షిగా వారిని మరిచిపోతారు కాని నా తండ్రి ఆలోచన వారు మరణించిన తరువాత ఎక్కువయ్యింది.[14]

మనం ప్రతీ రోజు చదివే దుఆలు కూడా హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) నుండి ఉల్లేఖించబడినవే. ఆ దుఆల కోసం మీరు క్రింద ఇవ్వబడిన లింకులను చూడవచ్చు...

శనివారం దుఆ: https://te.btid.org/node/530
ఆదివారం దుఆ: https://te.btid.org/node/531
సోమవారం దుఆ: https://te.btid.org/node/532
మంగళవారం దుఆ: https://te.btid.org/node/533
బుధవారం దుఆ: https://te.btid.org/node/534
గురువారం దుఆ: https://te.btid.org/node/535
శుక్రవారం దుఆ: https://te.btid.org/node/536

చివరిమాట.. మనిషి ఒక వేళ పై చెప్పబడిన హదీసులను అమలు చేస్తే ఆత్మ పవిత్రంగా మారి సన్మార్గం పొందడానికి కారణమౌతుంది. 

రిఫరెన్స్
1. కిఫాతుల్ అసర్, పేజీ199.
2. కష్ఫుల్ గుమ్మహ్, భాగం2, భాగం98
3. ఉయూనుల్ మోజిజాత్, పేజీ54.
4. అల్ ఎహ్తెజాజ్, భాగం1, పేజీ258, హదీస్49.
5. మన్ లా యహ్జుర్, భాగం3, పేజీ568, హదీస్4940.
6. మన్ లా యహ్జుర్, భాగం3, పేజీ568, హదీస్4940.
7. మన్ లా యహ్జుర్, భాగం3, పేజీ568, హదీస్4940.
8. మన్ లా యహ్జుర్, భాగం3, పేజీ568, హదీస్4940.
9. మన్ లా యహ్జుర్, భాగం3, పేజీ568, హదీస్4940.
10. మన్ లా యహ్జుర్, భాగం3, పేజీ568, హదీస్4940.
11. దలాయిలుల్ ఇమామహ్, పేజీ71, హదీస్9.
12. సుననె ఇబ్నె మాజా, భాగం1, పేజీ253, హదీస్771.
13. దఆయిముల్ ఇస్లాం, భాగం1, పేజీ268.
14. అల్ మనాఖిబ్, షహ్రె ఆషూబ్, భాగం1, పేజీ238.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17