సమాధి గోప్యంగా ఉండడానికి కారణాలు-1

మంగళ, 12/27/2022 - 01:01

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) సమాధి గోప్యంగా ఉండడానికి కారణాలు మరియు వారి సమాధిని ఎలా దర్శించుకోగలము అన్న విషయాల పై సంక్షిప్త వివరణ...

సమాధి గోప్యంగా ఉండడానికి కారణాలు-1

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) పట్ల సహాబీయులలో కొందరు అన్యాయంగా ప్రవర్తించారు అన్న విషయం పై చరిత్రలో ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. ఈ టాపిక్ సరైనది అనే దాని పై కూడా ఇరువైపుల ఉలమాలు ఏకాభిప్రాయం కలిగివున్నారు. ఆధారాలు చూసిన తరువాత నీతిమంతులు మరియు న్యాయాన్ని గౌరవించేవారు సహాబీయులలో కొందరు దౌర్జన్యులు మరియు అన్యాయులు అని నిశ్చయించకపోయినా, వారిని అపరాధులు అని అంగీకరించకుండా ఉండలేడు. ఎందుకంటే ఈ సంఘటన యొక్క అన్ని కోణాలను పరిశీలించే వాడికి సహాబీయులలో కొందరు, అంతా తెలిసి కూడా జనాబె ఫాతెమా(స.అ)ను కష్టపెట్టి ఆమెను గదీర్ సాక్ష్యాలతో తన భర్త ఖిలాఫత్‌ను రుజువు చేయనివ్వకుండా నిరోధించారు, అని తెలుస్తుంది. దానికి దగ్గర సంబంధం గల విషయాలు ఎన్నో ఉన్నాయి.

వాటిలో ఒకటి: చరిత్రకారుల రచనలు; వాటి ప్రకారం జనాబె ఫాతెమా(స.అ) రాత్రుళ్ళు అన్సార్‌ల ఇళ్ళకు వెళ్ళి తన భర్త(హజ్రత్ అలీ(అ.స)) కోసం బైఅత్ మరియు సహాయాన్ని కోరేవారు. అందుకు మదీనహ్ వాసులు “ఓ దైవప్రవక్త కుమార్తే(స.అ)! మేము అబూబక్ర్‌తో బైఅత్ చేసేసుకున్నాము ఒకవేళ మీ భర్త, అబూబక్ర్ కన్న ముందు వచ్చి ఉంటే మేము అతనితో బైఅత్ చేసేవాళ్ళము” అని సమాధానమిచ్చేవారు. దానికి ఆమె “అలీ(అ.స), తనకు ఏదైతే చేయాలో అదే చేశారు. మరి మీరు చేసిన దానికి అల్లాహ్ సన్నిధిలో మీరే జవాబుదారులు” అని బదులిచ్చేవారు.[1]

నిస్సందేహంగా, అబూబక్ర్ తెలిసో తెలియకో తప్పుచేసి ఉంటే జనాబె ఫాతెమా(స.అ) అతనికి తెలియజెప్పి తృప్తి పరిచేందుకు ప్రయత్నించేవారు. కాని ఆమె అతని పట్ల కోపాన్ని వ్యక్తం చేసి అతనితో మాట్లాడడం మానేశారు. అతను ఆమె వ్యాజ్యమును రద్దు చేసి ఆమె సాక్ష్యాన్ని అంగీకరించలేదని జీవించి ఉన్నంతకాలం మాట్లాడలేదు. చివరికి ఆమె అతనికి తన అంతిమయాత్రలో పాలుగోవడానికి కూడా అనుమతివ్వలేదు. అందుకే తన భర్తను ఆమె తన అంతిమసంస్కారం రాత్రి చీకటిలో మౌనంగా ఎవరికి తెలియకుండా చేయమని కోరారు.[2]

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) రాత్రి సమయంలో మౌనంగా సమాధి చేయబడిన కొన్ని కారణాలు తెలుసుకుందాం:

1. ఫాతెమా జహ్రా(స.అ) సమాధి ఈనాటికీ అజ్ఞాతంలోనే ఉంది. కొందరు దైవప్రవక్త(స.అ) గదిలో ఉందని అంటారు. మరి కొందరు ఆ గది ఎదురుగా ఆమె ఇంట్లోనే ఉందని అంటారు. మరి కొందరు “బఖీ”లో అహ్లెబైత్(అ.స) సమాధుల మధ్యలో ఉందని అంటారు కాని ఆమె సమాధికి ఒక నిశ్చిత స్థానం లేదు.

ఈ మొదటి యధార్ధంతో తెలిసే విషయమేమిటంటే హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) తన అంతిమ కోరిక ద్వార తరువాత వచ్చే వాళ్ళకు “ఎందుకు ఆమె తన భర్తకు నన్ను రాత్రికి రాత్రే సమాధి చేయమని మరియు ఎవరిని తన అంతిమయాత్రలో పాలుగోకూడదని కోరారు మరియు దాని కారణాలేమిటి?” అని తెలుసుకోవాలనే ఆలోచన కలిగేటట్లు చేశారు. ఇలా సరైన ఆలోచన గల ముస్లిము నిజాన్ని తెలుసుకోగలడు. మరి అలా అతనికి చాలా రహస్యాలు తెలిసిరావచ్చు.

2. రెండవ విషయం ఏమిటంటే ఉస్మాన్ బిన్ ఔఫ్ సమాధి బఖీ స్మశానం యొక్క చివరి గోడ దగ్గరలో ఉంది. అందుకు దర్శకునికి చాలా దూరం నడిచి వెళ్ళ వలసి వస్తుంది. అయితే సహాబీయులందరి సమాధులు బఖీ ద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి చివరికి తాబెయీన్‌లకు తాబె అయిన హజ్రత్ మాలిక్ సమాధి కూడా దైవప్రవక్త(స.అ) భార్యల సమాధులకు దగ్గర్లో ఉంది. దీనితో చరిత్రకారులనుసారం అతని సమాధి “హిష్షు కౌకబ్” అను యూధుల స్మశానంలో ఉండేదని, ముస్లిములు అతనిని తమ స్మశానంలో సమాధి కానివ్వకుండా అడ్డుకున్నారని మరి ముఆవియహ్ అధికారంలో వచ్చిన తరువాత తమ వంశ కార్యకర్త సమాధి ముస్లిముల స్మశానంలో ఉండాలని అతను యూధుల నుండి ఆ భూమిని కొని బఖీలో కలిపేశాడు అని రుజువైయ్యింది. జన్నతుల్ బఖీని దర్శించుకునే వాడు నేటికి కూడా ఆ దృశ్యాన్ని తన కళ్ళతో చూడగలడు.

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ), దైవప్రవక్త(స.అ) మరణించిన తరువాత అందరికన్నా ముందు ఈ లోకం విడిచి వెళ్ళారు. వారిద్దరికి మరణం మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ తేడా లేదు. అయితే ఆమె సమాధి ఆమె తండ్రి ప్రక్కలో ఎందుకు లేదు?, అన్న విషయం గమనార్హకం.

రిఫరెన్స్
1. తారీఖుల్ ఖులఫా, ఇబ్నె ఖుతైబహ్, భాగం 1, పేజీ 19.
2. సహీ బుఖారీ, భాగం3, పేజీ 36. ముస్లిం, భాగం2, పేజీ 72 బాబొ లా నూరిసు మా తరక్నాహు సదఖహ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16