సమాధి గోప్యంగా ఉండడానికి కారణాలు-2

మంగళ, 12/27/2022 - 01:15

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) సమాధి గోప్యంగా ఉండడానికి కారణాలు మరియు వారి సమాధిని ఎలా దర్శించుకోగలము అన్న విషయాల పై సంక్షిప్త వివరణ...

సమాధి గోప్యంగా ఉండడానికి కారణాలు-2

సమాధి గోప్యంగా ఉండడానికి కారణాలు- మొదటి భాగం కోసం ఈ లింకును చూడండి https://te.btid.org/node/2264

ఒకవేళ ఇది కేవలం నా అంతిమ యాత్ర మౌనంగా జరగాలనే ఆమె కోరిక వలన అయ్యి ఉంటే, మరి ఆమె కుమారుడు ఇమామ్ హసన్(అ.స) గారిని దైవప్రవక్త(స.అ) ప్రక్కలో ఎందుకు సమాధి చేయలేదు?. అయినప్పటికీ ఇమామ్ హుసైన్(అ.స) ఇమామ్ హసన్(అ.స) దేహాన్ని సమాధి చేయడానికి అక్కడికి తీసుకొని వస్తే ఉమ్ముల్ మొమినీన్ ఆయేషా కచ్చరగాడిదపై ఎక్కి వచ్చి “నాకు ఇష్టంలేని వారిని నా ఇంట్లో సమాధి చేయకండి” అని అరవడం మొదలు పెట్టారు. బనీ హాషిం మరియు బనీ ఉమయ్యాహ్‌ల మధ్య యుధ్ధ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇమామ్ హుసైన్, “నేను దేహాన్ని దైవప్రవక్త(స.అ) సమాధి ప్రదక్షణ కోసం తీసుకొచ్చాను” అని అన్నారు. ఇలా అని “జన్నతుల్ బఖీ”కు తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. ఎందుకంటే “నా అంతిమసంస్కార సమయంలో రక్తం చిందకూడదు” అని ముందే ఇమామ్ హసన్(అ.స) కోరారు కాబట్టి. ఇబ్నె అబ్బాస్ ఆ సమయంలో ఉమ్ముల్ మొమినీన్‌ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “మీరు ఒంటెపై ఎక్కారు, కచ్చరగాడిదపై ఎక్కారు, ఇంకా కొన్ని రోజులు బ్రతికుంటే ఏనుగు మీద కూడా ఎక్కుతారు. దైవప్రవక్త(స.అ) ఆస్తిలో మీ భాగంలో 1/8 నుండి తొమ్మిదవ వంతు మాత్రమే కాని మీరు పూర్తి ఆస్తిని ఆక్రమించేశారు”

ఇది ఇబ్నె అబ్బాస్, ఆమెకు ఆస్తిలో ఎనిమిదో భాగంలో తొమ్మిదవ వంతు కాని ఆమె పూర్తి ఆస్తిని ఆక్రమించేశారని తెలుసుకున్న భయంకరమైన నిజం. ఒకవేళ దైవప్రవక్త(స.అ)కు ఎటువంటి ఆస్తే ఉండదని ఆమె తండ్రిగారి రివాయత్‌ను అంగీకరించినట్లైతే ఆమెకు కూడా ఎటువంటి భాగం ఉండదు. ఇక పూర్తిగా లేదా కొంచెం అనే ప్రశ్నలే ఉండవు. లేదా భార్యకు భాగం ఉంది కూతురికి భాగం లేదు అని ఏదైనా ఆయత్‌లో ఉందా!? లేదా ఇది కేవలం తారుమారు చేసి కూతురిని ఆస్తి నుండి దూరం చేసి భార్యను ఆస్తి మొత్తానికి యజమానురాలు చేసే రాజకీయమా?. ఆలోచించాల్సిన విషయం ఇది...

ఈ సందర్భంలో కొంత మంది చరిత్ర కారులు వ్రాసిన మరియు ఈ సంఘటనకు దగ్గర పోలికలున్న ఒక సంఘటనను చెప్పడం అవసరమనిపిస్తుంది.

ఇబ్నె అబిల్ హదీదె మోతజిలీ, నెహ్జుల్ బలాగహ్ వ్యాఖ్యానంలో ఈ సంఘటన ఉంది; ఉస్మాన్ ఖిలాఫత్ కాలంలో హజ్రత్ ఆయిషా మరియు హఫ్సా అతని వద్దకు వచ్చి దైవప్రవక్త(స.అ) ఆస్తిలో భాగాన్ని ఇవ్వమని కోరారు. జారిబడి కూర్చున్న ఉస్మాన్ సరిగా కూర్చోని ఇలా అన్నారు: నిన్న మీరిద్దరు కలిసి మూత్రంతో పరిశుధ్ధించుకునే వాడిని తీసుకొచ్చి దైవప్రవక్త(స.అ)కు ఎటువంటి ఆస్తి ఉండదు అని సాక్ష్యం ఇప్పించారు. అయితే ఒకవేళ ఈ మాట నిజమైనదైతే ఇప్పుడు దేనికని వచ్చారు? ఒకవేళ అబధ్ధం అయితే మీరు ఫాతెమా(స.అ)ను ఆమె హక్కు నుండి ఎందుకు దూరం చేశారు? దానిపై ఆమెకు కోపం వచ్చి వెళ్ళిపోయారు. (ఆ తరువాత) ఆమె(ఆయిషా) నఅసల్(ఉస్మాన్)ను చంపేయండి అతను కాఫిర్ అయిపోయాడు అని ప్రకటించింది.[1]

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) సమాధి దర్శనం చేసుకోవాలనుకుంటున్నవారికి చూపించబడిన మార్గం:
ఇస్లాం ధర్మవేధి అయిన మర్హూమ్ ఆయతుల్లాహ్ మర్అషీ నజఫీ ఇలా ఉల్లేఖించారు: నా తండ్రి మర్హూమ్ “అల్లామా సయ్యద్ మహ్మూద్ మర్అషీ(ర.అ)” నజఫ్ లో ఉండేవారు, వారు ఎలాగైనా సరే దైవప్రవక్త(స.అ) కుమార్తె జనాబె ఫాతెమా జహ్రా(స.అ) యొక్క సమాధిని కనిపెట్టాలని, దాని దర్శించుకోవాలని అనుకునేవారు. అందుకోసమని 40 రోజుల పాటు ఒక అనుభవసిద్ధమైన కార్యమును అమలు పరిచారు. నలభయవ రోజు రాత్రి ఆ పనిని సంపూర్ణత్వాన్ని చేర్చి చాలా చాలా దుఆ చేశారు, ఆ తరువాత నిద్రపోయారు. వారు నిద్రలో స్వప్నంలో ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) వద్దకు హజరయ్యారు, ఇమామ్ అతనితో ఇలా అన్నారు: “కరీమయే అహ్లె బైత్(అ.స) సన్నిధికి చేరు”. అప్పడు అతను ఇమామ్ ఉద్దేశం హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) అని అనుకున్నారు. కాని ఇమామ్ ఇలా అన్నారు: “నా ఉద్దేశం ఖుమ్ లో ఉన్న హజ్రత్ మాసూమహ్(స.అ) యొక్క పవిత్ర సమాధి, అల్లాహ్ కొన్ని కారణాల వల్ల హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) సమాధిని రహస్యంగా ఉంచాలనుకున్నాడు, అందుకని హజ్రత్ మాసూమహ్[స.అ] సమాధిని అల్లాహ్ హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) సమాధి మాదిరిగా నిర్ధారించెను”.[2]
అనగ ఎవరైనా హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) సమాధిని దర్శించుకోవాలనుకుంటే హజ్రత్ మాసూమహ్[స.అ] సమాధిని ఖుమ్ పట్టణంలో దర్శించుకుంటే చాలు.

రిఫరెన్స్
1. షర్హే నెహ్జుల్ బలాగహ్, ఇబ్నె అబిల్ హదీద్, భాగం 16, పేజీ 220-223.
2. మహ్దీ పూర్, అలీ అక్బర్, కరీమయె అహ్లెబైత్(స.అ), పేజీ43,44.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11