షహీద్ సులైమానీ ఆయతుల్లాహ్ ఖామెనయి మాటల్లో

సోమ, 01/02/2023 - 18:23

ఆయతుల్లాహ్ ఖామెనయీ(హ.హ) సర్దార్ షహీద్ సులైమానీ గురించి పలు సందర్భాలలో ప్రశంసిస్తూ చెప్పిన మాటలు...

షహీద్ సులైమానీ ఆయతుల్లాహ్ ఖామెనయి మాటల్లో

యావత్ షియా వర్గానికి సూప్రీమ్ నేత అయిన ఆయతుల్లాహ్ ఖామెనయీ(హ.హ) సర్దార్ షహీద్ సులైమానీ గురించి పలు సందర్భాలలో ప్రశంసిస్తూ చెప్పిన మాటలు ఇక్కడ మీ కోసం తెలుగులో అనువదించబడం జరిగింది.  

సులైమానీ వ్యక్తిత్వం మరియు వారి ప్రయత్నాలు

ఇరానీయులు తమపై గర్వపడాలి (ఎందుకంటే) వారి మధ్య ఉండే మారుమూల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి లేచి, అలుపెరగని ప్రయత్నం మరియు స్వియ అభివృద్ధి కోసం పాటుపడి, కాంతిగా మరియు ఇస్లామీయ ఉమ్మత్ యొక్క ఛాంపియన్ గా మారాడు. (26/9/1399)

అతను ఇస్లాం శిక్షణ పొందిన వారికి మరియు ఇమామ్ ఖుమైనీ(ర.అ) పాఠశాల(ఆలోచన రీత్య) యొక్క అత్యుత్తమ నమూనా. (13/10/1398)

ఖాసిమ్ సులైమానీ లాంటి వారి పునాదులు పవిత్ర రక్షణ(దిఫాయె ముఖద్దస్) కాలంలో స్థాపించబడ్డాయి.(31/06/1399)

షహీద్ సులైమానీ ఇరాన్ ప్రజల ఛాంపియన్, ఎందుకంటే ఇరాన్ ప్రజలు తమ సంస్కృతి, ఆధ్యాత్మిక, విప్లవ మరియు తమ విలువలను అతనిలో స్పష్టంగా మరియు రూపాన్ని చూశారు.(26/09/1399)

అతను ధైర్యం మరియు ప్రతిఘటన స్పూర్తిని కలిగివున్న వారు., ధైర్యం మరియు ప్రతిఘటన ఇరానీయల గుణాల నుండి.(26/09/1399)

అతను త్యాగం మరియు పరోపకార స్పూర్తి కలిగివున్నవాడు, అనగా అతడి దృష్టిలో ఇక్కడి ప్రజలు అక్కడి ప్రజలు అనే బేధం ఉండేది కాజు., నిస్వార్ధపరుడు, నిజమైన త్యాగమూర్తి, ఎవరికి కోసం అయినా సరే త్యాగాన్ని ప్రదర్శించువాడు.(26/09/99)

షహీద్ సులైమానీ ఆధ్యాత్మికత, స్వచ్చత మరియు అంతిమదినం గురించి ఆలోచించేవాడు. అతడు నటించడం తెలియని వాడు. (26/09/1399)

అతడు శత్రువుల వద్దకు వెళ్తాడు కాని భయం ఎరగడు. అన్ని రంగాలలో అలసట ఎరగడు, చలి అర్ధం కాదు, వేడిని గ్రహించడు, ఇదంతా ఒకవేళ తనలో జిహాదె అక్బర్ లో జయించకపోయి ఉంటే, ఇలా శత్రువుల ముందు నిర్భయంగా వెళ్లేవాడు కాదు.(13/10/1398)

హాజ్ ఖాసిమ్ వంద సార్లు చావు వరకు వెళ్లి వచ్చనవారు., ఇది మొదటి సారి కాదు, అయితే అల్లాహ్ మార్గంలో, తన కర్తవ్య పాలన మరియు జిహాద్ ఫీ సబీలిల్లాహ్ కోసం దేన్నీ లెక్క చేసేవారు కాదు., శత్రువులను లెక్క చేసేవారు కాదు, వాళ్ల వీళ్ల మాటలను లెక్కచేసేవారు కాదు, కష్టాలను కూడా లెక్కచేసేవారు కాదు. (13/10/1398)

మా ఈ ప్రియమనై షహీద్ ప్రమాదాలు ఉన్న చోట భయం లేకుండా వెళ్ళే సత్తా ఉన్నవాడు., యుక్తి ఉన్నవాడు., చేసే పనుల్లో అర్థం ఉండేది. ఈ ధైర్యం మరియు యుక్తి కేవలం యుద్ధభూమిలోనే కాడు రాజకీయరంగంలో కూడా అదే విధంగా ఉండేవి. (18/10/1398)

షహీద్ సులైమానీ సైనిక రంగంలో పూర్తి అవగాహన కలిగి ఉన్న ఒక కమాండర్, అలాగే షరా అహ్కాములను పాటించే విషయంలో జాగ్రత్త వహించేవారు. (18/10/1398)

అతడు ఇతరుల పై అన్యాయం జరగకూడదు అని జాగ్రత్తగా ఉండేవాడు. ప్రమాదాలు ఉండే చోటు వెళ్లేవాడు కాని వీలైనంత వరకు ఇతరుల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసేవాడు. (18/10/1398)  

ఆ ప్రాంతంలోని దేశాల సహాయంతో లేదా ఆ ప్రాంతంలోని దేశాలకు అతను చేసిన సహాయంతో, అతను పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా యొక్క అన్ని చట్టవిరుద్ధమైన ప్రణాళికలను తిప్పికొట్టగలిగాడు.(18/10/1398)

విశ్వాశనీయమైన వ్యక్తిత్వాలు ఎప్పుడైతే తన విశ్వాసాన్ని ఉత్తమ చర్యలను జోడించినప్పుడు, జిహాదీ చర్యలు చేపట్టినప్పుడు, దీని ఫలితంగా శత్రువులు కూడా ప్రశంసించేటు వంటి షహీద్ సులైమానీ లాంటి వ్యక్తులు ముందుకొస్తారు. (16/11/1398)

సర్దార్ షహీద్ ఖాసిమ్ సులైమానీ ఒక్క రోజులో తయారు అవ్వలేదు. వారు తన చిన్నతనం నుండే తన ఆధ్యాత్మికత మరియు మానవత్వ విలువల పట్ల నిత్యం జాగ్రత్త వహిస్తూ వచ్చారు. వారి ప్రయత్నం వల్ల వారికి మంచి మంచి వారితో కలిసే భాగ్యం కలిగింది. అదే మెల్ల మెల్లగా ఇస్లామీయ విప్లవ చర్యలలో చేరడం మరియు గుండే బలంతో పాటు ఆత్మ బలం తోడవ్వడం ఇవన్నీ అతడి జీవన విధానం మరియు అతడి ఉపన్యాసాల ద్వార మనకు తెలుస్తుంది.

అల్లాహ్ మనందరికి కూడా ఇలాండి ధైర్యం మరియు యుక్తి ప్రసాదించాలని కోరుకుందాం... ఆమీన్.  

రిఫరెన్స్
https://farsi.khamenei.ir/speech-content?id=47021

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12