తల్లి పాత్ర

గురు, 01/19/2023 - 06:07

మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర తల్లిదండ్రులది అందులో కూడా తల్లి పాత్ర ఇంకా ముఖ్యమైనది... 

తల్లి పాత్ర

మనిషి జీవితంలో అతడి చుట్టు ప్రక్కలు ఉన్న వారి ప్రభావం అతడి పై పడుతుంది. వారు తన కుటుంబం నుండి కానివ్వండి, మిత్రుల నుండి కానివ్వండి, బంధువుల నుండి కానివ్వండి, తోటి ఉద్యోగస్థులు కానివ్వండి చివరికి మనకు తెలియని వ్యక్తి అయినా కానివ్వండి మన పై ప్రభావం పడుతుంది అది కొన్ని క్షణాలే కానివ్వండి. వీళ్ళందరీలో తల్లి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది మరియు సున్నితమైనది. తల్లి సంతోషం జీవితాలను మార్చేస్తుంది అలాగే ఆమె నిరాశ జీవితాలను నాశనం చేస్తుంది. అలాగే తండ్రి కూడా.
చరిత్ర నుండి కొన్ని నమూలను మీ కోసం ఇక్కడ చెప్పడం జరిగింది.
ఒక వ్యక్తి మంచాన్నపడి చివరి గడియాలు లెక్కపెడుతున్నాడు, మృత్యువును ఎదురు చూస్తున్నాడు. దైవప్రవక్త(స.అ) అతడి వద్దకు వచ్చారు, మరణ గడియాలు దగ్గర పడినా అతడి ప్రాణాలు పోవడం లేదు. దైవప్రవక్త(స.అ) అతడిని పిలిచారు, అతడు సమాధానమిచ్చాడు, అప్పుడు దైవప్రవక్త(స.అ) “ఇప్పుడు నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు. అతడు “యా రసూలల్లాహ్! ఇప్పుడు నా ముందు భయంకరమైన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు” అన్నాడు. దైవప్రవక్త(స.అ) “ఈ యువకుడి తల్లి బ్రతికే ఉందా?” అని అడిగారు. అక్కడున్నవారు “ఔను బ్రతికే ఉంది” అని అన్నారు. “ఆమెను తీసుకొని రండి” అని ఆజ్ఞాపించారు. ఆమె వచ్చిన తరువాత దైవప్రవక్త(స.అ) ఆమెతో “అమ్మా! నువ్వు నీ కొడుకు పై కొపంగా ఉన్నావా? ఒకవేళ నిరాశగా ఉండి ఉంటే అతడిని క్షమించు” అని అన్నారు. ఆ వృద్ధ తల్లి “యా రసూలల్లాహ్! నిజంగానే నేను ఇతడి పట్ల నిరాశ చెంది ఉన్నాను, మీరు చెబుతున్నారు కాబట్టి నేను వీడ్ని క్షమిస్తున్నాను” అని అంది.
అప్పుడు ఆ యువకుడు స్పృహ తప్పిపోయాడు, అతడికి మెలుకువ రాగానే వారు(స.అ) అతడికి మరలా పిలిచి ఇప్పుడు “నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు.
ఆ యువకుడు “యా రసూలల్లాహ్! ఇప్పుడు ఆ నలుపు ముఖాలు వెళ్ళిపోయాయి దయ మరియు కారుణ్యంతో కూడి ఉన్న ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. వారిని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నాడు.
ఆ తరువాత అతడి ఆత్మ గాలిలో కలిసిపోయింది.[1]  

ఒకరోజు దైవప్రవక్త[అ.స] తన ఇంట్లో కూర్చోని ఉండగా, వారి రిజాయి (ఒకే స్ర్తీ ఇద్దరికీ పాలుపట్టించడం ద్వార ఏర్పడే బంధం) చెల్లెలు వారి ఇంటికి వచ్చారు. ఆమె రాక దైవప్రవక్త[స.అ]ను సంతోషపరిచింది, చెల్లెలు కూర్చోవడం కోసం తాను కూర్చోని ఉన్న దుప్పటిని పరిచారు, ఆ తరువాత తన చెల్లెలితో చాలా మంచిగా మాట్లాడటంలో లీనమయ్యారు....
మరో రోజు, ఆమె సోదరుడు అంటే దైవప్రవక్త(స.అ) యొక్క రిజాయీ సోదరుడు దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చాడు, కాని వారు ఆమెతో ప్రవర్తించినట్లు ఇతడితో ప్రవర్తించలేదు.
ఈ సంఘటలను గ్రహించిన సహాబీయులు దైవప్రవక్త(స.అ)తో ఇలా అన్నారు: ఓ దైవప్రవక్తా! ఎందుకని చెల్లెలు మరియు సోదరుడి పట్ల వేరు వేరుగా ప్రవర్తించారు?!
దైవప్రవక్త(స.అ) ఇలా సమాధానమిచ్చారు: ఎందుకంటే నా చెల్లెలు తన తండ్రి పట్ల చాలా ప్రేమగా గౌరవంగా ఉండేది, అందుకని నేను అలా గౌరవించాను, కాని అతడు తన తండ్రి పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు.[2]

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఉల్లేఖనం: యాఖూబ్(అ.స) తన కుమారుడు యూసుఫ్(అ.స) తో కలిసేందుకు మిస్ర్(ఈజిప్ట్) లో ప్రవేశించినప్పుడు యూసుఫ్(అ.స) తన తండ్రిని ఆహ్వానించడాని వచ్చారు. యాఖూబ్(అ.స) యూసుఫ్(అ.స) ను చూడగానే తన గుర్రం నుండి క్రిందకు దిగారు కాని యూసుఫ్(అ.స) తన అధికార స్థాన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని తండ్రి మర్యాదించడానికి గుర్రం నుండి క్రిందికి దగలేదు, అలాగే గుర్రం పై కూర్చోని తండ్రి మెడ పై చేయి వేశారు. హజ్రత్ యూసుఫ్(అ.స) ఇంకా యూఖూబ్(అ.స) తో సుస్వాగత చర్యలు పూర్తి కాకుండానే జిబ్రయీల్ అవతరించి యూసుఫ్(అ.స)తో ఇలా అన్నారు: నీ చేయిని విప్పు.
యూసుఫ్(స.అ) తన చేయిని విప్పారు, అతని చేయి నుండి ఒక కాంతి నింగి వైపుకు వెళ్లి పోయింది. యూసుఫ్(అ.స), నా అరచేతి నుండి వెళ్లిపోయిన కాంతి ఏమిటి? అని ప్రశ్నించారు. జిబ్రయీల్ ఇలా అన్నారు: దౌత్య కాంతి నీ వంశం నుండి బయటకు పోయింది ఇక నీ వంశం లో ప్రవక్త జన్మించడు. ఎందుకంటే నీ తండ్రి పట్ల నువ్వు సంపూర్ణ మర్యాదను చూపించలేదు కాబట్టి ఇక నీ సంతానంలో ఎవ్వరూ ప్రవక్త కాలేరు[4]

తల్లిదండ్రుల పట్ల గౌరవమర్యాదలు తగ్గితే ప్రవక్త అయినా సరే దాని ప్రభావం పడుతుంది. అల్లాహ్ తన ప్రవక్తల నుండి కూడా అనుగ్రహాలను తొలగిస్తున్నాడు. అలాంటిది ఇక సాధారణ మనుషులు తమ తల్లిదండ్రులను గౌరవించకపోతే అతడి జీవితం ఏమౌతుందో మీరే ఆలోచించాలి...

రిఫ్రెన్స్
1. అమాలీయె షేఖ్ తూసీ, భాగం1, పేజీ63 అజ్ సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, ఇతాఅతే వాలిదైన్ అధ్యాయం.
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం16, పేజీ 281.
3. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం2, పేజీ309.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25