.దైవప్రవక్త[స.అ] మనవడు ఇమామ్ హుసైన్(అ.స) రుజుమార్గం పై ఉన్నారా లేక యజీద్ ఇబ్నె ముఆవియా!

ఆషూరారోజున దైవప్రవక్త[స.అ] మనవడు ఇమామ్ హుసైన్[అ.స], అతని కుటుంబీకులు మరియు సజ్జనులు చంపబడ్డారు. వారు చేసిన ప్రాణ త్యాగంతో ఇస్లాం మరలా ప్రాణం పోసుకుంది. అలాంటి వారి మరణదినాన అమవీయులు పండగ జరుపుకునే వారు, మరి ఈనాడు కూడా వారి ఆచారాన్నే కొందరు అవలంభిస్తూనే ఉన్నారు.
ఇమామ హుసైన్[అ.స] మరియు వారి అనుచరులు హతమార్చబడడం పై చాలా మంది సమ్మతిస్తారు, మద్దత్తుదారులుగా కనిపిస్తారు. పైకి ముస్లిములగా కనిపించే దుర్మార్గులే ఇమామ్ హుసైన్[అ.స]ను మరియు వారి అనుచరులను చంపేశారు అన్న విషయం అసంభవం కూడా కాదు.
చరిత్ర తెలుసుకుంటే చాలు, ఇమామ్ హుసైన్[అ.స]
ను చంపడానికి “ఇబ్నె జియాద్”, “ఉమర్ ఇబ్నె సఅద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్”ను సైన్యాధిపతిగా నియమించి పంపాడు. మరి ముస్లిములలో కొందరు సహాబీయులందరినీ “రజీయల్లాహు అన్హుమ్” అంటారు మరి ఇమామ్ హుసైన్[అ.స]ను చంపిన వారు కూడా ఆ సహాబీయులలోనే ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ హదీసులను సమ్మతింబడినవిగా, నమ్మదగినవిగా భావించి అంగీకరిస్తారు. అంతేకాదు ఆ సహాబీయులలో ముస్లిముల ఖలీఫా అయిన “యజీద్ ఇబ్నె ముఆవియా”ను వ్యతిరేకించి తిరగబడినందుకు ఇమామ్ హుసైన్[అ.స]ను ఖారీజీ(తిరుగుబాటుదారుడు) అని చెప్పేవారు కూడా ఉన్నారు.
యదార్ధం తెలుకోండి. ఆలోచించండి!
వ్యాఖ్యానించండి