రజబ్ మాసం పొడుగునా చేయవలసిన కొన్ని ప్రార్ధనలు మరియు కొన్ని స్మరణలు...

రజబ్ మాసం పొడుగునా చేయవలసిన కొన్ని ప్రార్ధనలు మరియు కొన్ని స్మరణలు
1. "అస్తగ్ఫిరుల్లాహ రబ్బీ వ అతూబు ఇలైహ్" రాత్రింబళ్ళు ఎక్కువగా చెబుతూ ఉండాలి.
2. "అస్తగ్ఫిరుల్లాహల్లజీ లా ఇలాహ ఇల్లాహూ, వహ్దహు లా షరీకలహు వఅతూబు ఇలైహ్" ఒకవేళ ఎవరైనా దీనిని 100 సార్లు చదివి సద్ఖా ఇస్తే అల్లాహ్ అతనికి క్షమించి అతని పై తన కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు 400 సార్లు చదివిన వారికి ఒక షహీద్(అల్లాహ్ మార్గంలో తన ప్రాణాలు త్యాగం చేసినవాడు)కు ఇవ్వబడే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు.
3. "లా ఇలాహ ఇల్లల్లాహ్" ఒకవేళ ఎవరైనా దీనిని 1000 సార్లు చెబితే 100000 పూణ్యములు మరియు స్వర్గంలో 100 పట్టణాలు తయారు చేసుకున్నట్లే.
4. ఉదయం పూట 70 సార్లు మరియు జొహ్‌ర్ పూట 70 సార్లు "అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్" అని చదివి తన రెండు చేతులు ఎత్తి ఒకసారి ఇలా "అల్లాహుమ్మగ్ఫిర్లీ వ తుబ్ అలయ్య" చెబితే అల్లాహ్ అతనికి ఇష్టపడతాడు మరియు నరకాగ్ని అతనికి తాకదు.
5. పూర్తి మాసంలో 1000 సార్లు "అస్తగ్ఫిరుల్లాహ జుల్ జలాలి వల్ ఇక్రామ్ మిన్ జమీఇజ్జూనూబి వల్ ఆసామ్" అని చెబితే అల్లాహ్ అతనికి క్షమిస్తాడు.
6. దైవప్రవక్త[అ.స] రివాయత్ ప్రకారం, సూరయే "ఖుల్ హు వల్లాహు అహద్" 10000 సార్లు లేదా 1000 సార్లు లేదా 100 సార్లు చదవాలి.
7. రివాయత్ లో ఇలా కూడా ఉంద్ "రజబ్" మాసంలో శుక్రవారం నాడు 100 సార్లు సూరయే "ఖుల్ హు వల్లాహు అహద్" పఠించాలి దాంతో అతని కోసం ప్రళయంనాడు ఒక కాంతి నిశ్చయించబడుతుంది అది అతనిని స్వర్గం వైపుకు తీసుకొని వెళ్తుంది.[1]
రిఫ్రెన్స్
1. షెఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రజబ్ మాసం యొక్క ఆమాల్ అధ్యాయంలో
వ్యాఖ్యానించండి