ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ), ఇరాన్ విప్లవం మరియు ఇన్ఖిలాబ్ యొక్క లక్ష్యం లాంటి అంశాల పై సంక్షిప్త వివరణ...

ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ), సెప్టెంబర్ నెల 24వ తారీఖు 1902 వ సంవత్సరం ఇరాన్ దేశానికి చెందిన “ఖుమైన్” అను పట్టణంలో జన్మించారు. అతని పేరు “రూహుల్లాహ్” . తండ్రి పేరు సయ్యద్ ముస్తఫా మరియు తల్లి పేరు బాను హాజిర్. అతని జన్మించిన ఐదు నెలలకే వారి తండ్రి చంపబడ్డారు. 15 సంవత్సరాల వయసులో తల్లి మరణించారు. వారు చిన్న వయసులోనే ఖుమైన్ మరియు అరాక్ లో ఇస్లాం ధర్మశాస్త్రాభ్యాసం మొదలు పెట్టారు. 19 సంవత్సరాల వయసులో అక్కడ చదువును పూర్తి చేసుకొని 1921 వ సంవత్సరంలో పెద్దచదుల కోసమని తమ కొంతమంది మిత్రులతో కలిసి “ఖుమ్” కు వెళ్ళారు, అక్కడ పెద్ద పెద్ద మరియు మంచి మంచి పండితులతో విద్యను పొందారు.
వారు విద్యనేర్చుకోవడంతో పాటు తన ఆత్మ పవిత్రత పట్ల కూడా చాలా శ్రద్ధ చూపించే వారు. వారు ఎల్లప్పడూ చక్రవర్తుల మరియు ఇస్లాంకు విరుద్ధ పాలనను వ్యతిరేకించేవారు, కాని వారి వ్యతిరేకత రహస్యంగా మరియు మౌనంగా, ఏదో ఒక పుస్తకానికి బదులుగా రచించి లేదా ఏదో విధంగా ఉండేది. వారు ఎప్పుడైతే స్వయంగా ధర్మవేధి స్థానాన్ని పొందారో అప్పడు ఇరాన్ చక్తవర్తి “షాహ్”కు వ్యతిరేకంగా యుద్ధానికి దిగారు.
1962 లో వారు “షాహ్”కు విరుద్ధంగా ప్రజలకు “నౌరోజ్” పండగను జరుపోకోకుండా ఆపారు. ఆ తరువాత ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) షహాదత్ రోజున ఉపన్యాసం ఇస్తుండగా షాహ్ మనుషులు దండెత్తి చాలా విద్యార్ధులను హతమార్చారు. అప్పటి నుండి విప్లవం మరియు ఇస్లామీయ అధికారం కోసం ప్రయత్నం మొదలయ్యింది. అందులో భాగంగా వారికి దేశబహిష్కరణ క్రమంలో స్వదేశాన్ని విడిచి టర్కీ, ఇరాఖ్ మరియు ఫ్రెంచ్ కు వెళ్ళవలసి వచ్చింది. వారికి 1962 నుండి 1978 వరకు స్వదేశం నుండి బయట ఉండవలసి వచ్చింది.
ఫిబ్రవరి 1978లో వారు ఫ్రెంచు నుండి ఇరాన్‌కు తిరిగి వచ్చారు. వారు ఇరాన్ తిరిగి రావడం వల్ల ప్రజల్లో అభిలాష పెరిగింది మరియు ప్రజలు చాలా సహనంతో ఓర్పుగా యుద్ధం చేశారు. చివరికి వారు ఇరాన్ వచ్చిన 10వ రోజున షాహ్ యొక్క ప్రభుత్వానికి అపజయం మరియు ఇస్లామీయ విప్లవానికి విజయం దక్కింది.
వారు 87 సంవత్సరాల వయసులో జూన్ నెల 3వ తారీఖు 1989 లో మరణించారు. వారి సమాధి తెహ్రాన్ లో ఉంది.
ఇరాన్ ఇన్ఖిలాబ్ యొక్క లక్ష్యం
ప్రతీ విప్లవం వెనుక కొన్ని లక్ష్యములు ఉంటాయి మరియు ఆ విప్లవానికి కొన్ని ప్రాముఖ్యతలు కూడా ఉంటాయి. అలాగే ఇరాన్ దేశ విప్లవం యొక్క కొన్ని లక్ష్యాలు మరియు కొన్ని విశిష్టతలు ఉన్నాయి. వాటిని సంక్షిప్తంగా ఇలా చెప్పవాచ్చు: 1. ఇస్లామీయ అధికార స్థాపన 2. ఆధ్యాత్మికము 3. మానవ జీవితంలో ఇస్లామీయ ప్రభావం 4. తౌహీదీ సమాజ స్ధాపన 5. న్యాయమైన అధికార స్థాపన 6. పరాయి వాళ్ళ అధికార నిరాకరణ 7. స్థిరత్వం మరియు ఇతరుల పై ఆధారపడకుండా ఉండడం 8. రాజకీయ మరియు సమాజ విద్రోహానికి అంతం 9. భేదభావం మరియు అధర్మ నిరాకరణ.[1]
ఇరాన్ చేసిన గొప్ప కార్యం ఇస్లామీయ విప్లవం
ఇస్లామీయ అధికారాలలో కేవలం ఇరాన్ దేశం ఒక్కటే తన మూల విశ్వాసాలలో దైవప్రవక్త(స.అ) 12వ ఉత్తారాధికారి యొక్క దైవికమైన అధికారాన్ని నమ్ముతారు. ప్రపంచ బాధితులే కాదు మానవులందరూ ఎదురు చూస్తున్న రక్షకుడు మరియు ఉద్ధారకుడు అయిన హజ్రత్ మహ్‌దీ(అ.స) అధికారం యొక్క చిన్న ఉదాహారణ ఇరాన్ దేశ అధికారం. నిజానికి ఇరాన్ విప్లవం యవత్ ప్రపంచానికి “ఆ రక్షకుడిని విశ్వాసించే వారే అన్యాయ అధికారాలకు భయపుట్టించేటువంటి అధికారాన్ని స్థాపించగలిగితే వారి నాయకుడి ప్రత్యేక్షం తరువాత ఆ ఇమామ్ అధికారంలో ఆ అన్యాయ అధికారముల పరిస్థితి ఏమౌతుందో” అన్న విషయాన్ని తెలియపరిచింది.
ఇరాన్ ఇస్లామీయ రాజ్యాంగవిధానంలో “గైబత్” కాలంలో అధికారం మరియు నాయకత్వ నిర్వాహకుల పద్ధతులను వారు చేయవలసిన పనులను చాలా స్పష్టంగా లిఖించబడి ఉంది, అంటే బాధితులు మరియు వ్యసనుల రక్షణ మరియు సహాయం మరియు వారిని అల్లాహ్ మరియు దైవప్రవక్త తరపు ఆహ్వానించడం.
ఇమామ్ ఖుమైనీ(ర.అ) తన ఆధ్యాత్మికమైన రాజకీయ వీలునామాలో ఇలా వ్రాశారు: “లక్షల మంది శ్రమ యొక్క ఫలితం ఈ గొప్ప ఇస్లామీయ విప్లవం, ఇది ప్రపంచం యొక్క కోట్ల మంది ముస్లిములు మరియు నిస్సాయులకు కోసం అభిలాష కేంద్రం. దీని విలువ వెల కట్టలేనిది”
“ఈనాడు, అల్లాహ్ తరపు నుండి ప్రసాదించబడిన దీనిని కాపాడుకోవడం మరియు దాని స్థిరత కోసం ఆలోచించడం ముస్లిములందరి కర్తవ్యం”[2]
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక అల్లాహ్ కు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు. మీ పాదాలకు నిలకడను ఇస్తాడు”[సూరయె ముహమ్మద్, ఆయత్7].
ఒక్కోసారి అల్లాహ్ సాయం సంభవిచడానికి ఆలస్యం అవచ్చుగాని సంభవించడం మాత్రం పక్కా. దీనికి నిదర్శనం ఇరాన్ దేశ విప్లవం. ఇరానీయుల నాయకుడు మరియు ఆ దేశ ప్రజలు అల్లాహ్ ఆదేశాలను స్థాపించడానికై మరియు ఇస్లాం సిద్ధాంతాలను ప్రచారించడానికై తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. ఆ పవిత్ర మార్గంలో తమ ప్రాణాలను, సంపదను మరియు భోగభాగ్యాలను త్యాగం చేస్తూ ఇస్లాం పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. చాలా కఠినమైన పరీక్షలను దాటుకుంటూ చివరికి ఇస్లామీయ అధికారాన్ని అల్లాహ్ తరపు నుండి ఒక గొప్ప అనుగ్రహం రూపంలో పొందారు.[3]
రిఫ్రెన్స్
1. https://www.ur.welayatnet.com/node/4507
2. https://www.ur.welayatnet.com/node/4505
3. ఇన్ఖిలాబె ఇస్లామీ వ రీషెహాయే ఆన్, ఆయతుల్లాహ్ మిస్బాహ్ యజ్దీ, ఇంతెషారాతె ముఅస్ససే ఆముజిషి వ ఫజూహిషీ ఇమామ్ ఖుమైనీ(ర.అ).
వ్యాఖ్యానించండి