హజ్రత్ అబూతాలిబ్(అ.స) చరిత్ర-2

బుధ, 02/15/2023 - 16:07

హజ్రత్ అబూతాలిబ్(అ.స) జీవిత చరిత్ర చరిత్ర గ్రంథాల ఆధారంగా మరియు అహ్లె బైత్(అ.స) రివాయతులనుసారంగా...

హజ్రత్ అబూతాలిబ్(అ.స) చరిత్ర-2

జనాబె అబూతాలిబ్(అ.స) విశ్వాసం
విశ్వాసుల నాయకుడు, అల్లాహ్ తరపు నుంచి దైవప్రవక్త(స.అ) తరువాత వారి ఉత్తరాధికారిగా నియమించబడ్డ నిజమైన ఖలీఫా, సాటి లేని ఉనికి గల పవిత్ర నాయకుడు అయిన ఇమామ్ అలీ(అ.స) లాంటి వ్యక్తి ఒకరి విశ్వాసం గురించి చెబుతున్నారు అంటే ఆ వ్యక్తి యొక్క ఈమాన్ యొక్క స్థాయి ఏమిటో మనం తెలుసుకోవచ్చు. హజ్రత్ అలీ(స.అ) హజ్రత్ అమీరుల్ మొమినీన్(స.అ) జనాబె అబూతాలిబ్ విశ్వాసం గురించి వివరిస్తూ ఇలా ప్రవచించారు: అల్లాహ్ సాక్షిగా నా తండ్రి మరియు నా పితామహులైన అబ్దుల్ ముతల్లిబ్ మరియు హాషిమ్ మరియు అబ్దె మునాఫ్ లు ఎప్పుడు కూడా విగ్రాహారాధన చేయలేదు.
అయితే దేన్ని ఆరాధించేవారు అని ప్రశ్నించగా ఇమామ్ ఇలా సమాధానం ఇచ్చారు:
“కాబా వైపున నమాజ్ చేసేవారు(ప్రార్థన చేసేవారు) మరియు హజ్రత్ ఇబ్రాహీమ్ మార్గాన్ని అనుచరించే వారు మరియు వారినే ఆశ్రయించేవారు”[1]

జనాబె అబూతాలిబ్ ప్రతష్టత పై కవిత్వం
జనాబె అబూతాలిబ్ గురించి ఆయతుల్లాహ్ ముహమ్మద్ హుసైన్ ఇస్ఫెహానీ అరబీ భాషలో కవితను రచించారు, వాటి నుండి కొన్నింటి అనువాదం తెలుగులో
1. హిదాయత్ కాంతి ముస్తఫా పినతండ్రి హృదయంలో దాగి ఉన్నా స్పష్టంగా కనిపించేది
2. వారి లోపల నిజమైన విశ్వాసం దాగి ఉంది, అది(దాగి ఉన్న ఈమాన్) మనకు అంతుచిక్కని రహస్యం
3. వారిలోని విశ్వాసం ద్వార వారున్న స్థానాన్ని పవిత్రులు తప్ప మరొకరు పొందలేరు
4. వారి విశ్వస గుర్తులు వివేకులకు మిట్ట మధ్యహ్న సమయంలో సూర్యుడు కాంతికి మించి వెలుతురైనవి(స్పష్టమైనవి)
5. వారు అంతిమ దైవప్రవక్త(స.అ) యొక్క సంరక్షకులు, అన్ని విధాలుగా వారిని కాపాడుకుంటూ వచ్చారు
6. శత్రువుల చేతుల్లో అపజయానికి పాలవ్వకుండా అడ్డుగా నిలిచారు, కష్టసమయాలలో శరణుగా నిలిచారు
7. స్థానం మరియు ప్రత్యేకత పరంగా వారిని చూసుకుంటే వారు యాసీన్ రక్షకులు మరియు తాహా శరణులు
8. మహానీయ ప్రవక్త(స.అ) యొక్క సహాయానికి నడుము బిగించారు దాంతో ఇస్లాం తన పాదాల పై నిలబడింది
9. వారికున్న గొప్పతనం ఎత్తైన పెద్ద పెద్ద కోటలకు మరియు ఆకాశానికి మించినది
10. ఎందుకని ఉండదు, వారు ముస్తఫా పోషకులు, పవిత్రులు మరియు మార్గదర్శకులు మరియు దైవప్రవక్త(స.అ) ఉత్తారాధికారుల తండ్రి
11. వసీ(ఇమామ్ అలీ) మరియు జాఫరె తయ్యార్ తండ్రి, నా ప్రాణం సాక్షిగా ఇది వారి ఉత్తమ ప్రతిష్టత[2]

జనాబె అబూతాలిబ్(అ.స) విశ్వాసం ఇమామ్ బాఖిర్[అ.స] దృష్టిలో
జనాబె అబూతాలిబ్(అ.స) యొక్క ఈమాన్ గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) స్పష్టంగా వివరించారు.
అబూతాలిబ్(అ.స) నరకాగ్ని యొక్క లోయలో ఉన్నారు అని ప్రజలు అంటున్నారు అన్న ప్రశ్నకు ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ఇలా సమాధానం ఇచ్చారు: “అబూతాలిబ్ ఈమాన్ ను తక్కెడ యొక్క ఒక వైపు మరియు ఈ ప్రజల ఈమాన్ మరో వైపు పెడితే, అబూతాలిబ్ యొక్క ఈమాన్ బరువే ఎక్కువగా ఉంటుంది”
ఆ తరువాత ఇలా అన్నారు: “ఇది మీకు తెలియదా! అమీరుల్ మొమినీన్ అలీ(అ.స) తన జీవితంలో అబ్దుల్లాహ్, వారి కుమారుడు మరియు అబూతాలిబ్ కోసం ప్రాతినిధ్యంగా హజ్ నిర్వర్తించాలని ఆదేశించారు, ఆ తరువాత తన వీలులో వారి తరపు నుండి హజ్ చేయాలని కోరారు”[3]

జనాబె అబూతాలిబ్[అ.స] విశ్వాసం ఇమామ్ సజ్జాద్[అ.స] దృష్టిలో
నెహ్జుల్ బలాగహ్ ను వ్యాఖ్యానించిన “ఇబ్నె అబిల్ హదీద్” ఇలా రచించారు: ఒక రివాయత్ లో ఇలా ఉంది: అలీ ఇబ్నె హుసైన్(ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స)ను అబూతాలిబ్ యొక్క విశ్వాసం గురించి ప్రశ్నించినప్పుడు ఇమామ్ ఈ విధంగా సమాధానమిచ్చారు: “చాలా ఆశ్చర్యం! అల్లాహ్ తన ప్రవక్త(అ.స)ను ఒక ముస్లిం స్ర్తీను ఒక అవిశ్వసునితో వైవాహిక బంధంలో ఉంచకూడదు అని ఆదేశించాడు, మరి ఫాతెమా బింతే అసద్(అబూతాలిబ్ భార్య) ఇస్లాం ను స్వీకరించటంలో ముందుగా ఉన్న స్రీలలో ఒకరు మరి ఆమె అబూతాలిబ్ చివరి నిమిషం వరకు అతనితోనే ఉన్నారు”[4]
అనగా ఒకవేళ అబూతాలిబ్ అవిశ్వాసి అయి ఉంటే దైవప్రవక్త ఫాతెమా బింతె అసద్ ను ఎందుకు అతని నుండి దూరం చేయలేదు? దూరం చేయలేదు అంటే అల్లాహ్ ఆదేశాన్ని అనుచరించనట్లే కదా... మరి అల్లాహ్ ఆజ్ఞలను పాటించని దైవప్రవక్త(స.అ) అల్లాహ్ ఇస్లాం ప్రాచారానికి ఎలా అర్హులవుతారు..! 

రిఫరెన్స్
1. కమాలుద్దీన్, సదూఖ్, పేజీ104, గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ698.
2. గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ709
3. ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం3, పేజీ312, గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ698.
4. షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం3, పేజీ312, గుజీదెయీ అజ్ జామె అల్ గదీర్, మొహమ్మద్ హసన్ షఫీయీ షాహ్రూదీ, ఖలమె మక్నూన్, ఖుమ్, 1428హి, పేజీ698.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 25