ఇమామ్ హుసైన్(అ.స) మదీనహ్ నుండి మక్కాకు మరియు మక్కా నుండి కర్బలా కు వెళ్లేటప్పుడు చదివిన ఆయతులు...

చరిత్ర మరియు హదీసులను పరిశీలించిన తరువాత ఇమామ్ హుసైన్(అ.స) మదీనహ్ నుండి కర్బలా వరకు తన ప్రయాణం మధ్యలో పలు చోట్ల పలు సందర్భాలకు అనుకూలంగా కొన్ని ఆయతులు పఠించారు. ఇక్కడా వాటిని రెండు భాగాలలో వివరించబడుతుంది; మదీనహ్ నుండి మక్కా వరకు మరియు మక్కా నుండి కర్బలా వరకు.
అ. మదీనహ్ నుండి మక్కా ప్రణాయంలో చదివిన ఆయతులు:
1. రజబ్ మాసం 27వ రాత్రి, ఇమామ్ హుసైన్(అ.స) తన కుటుంబ సభ్యులతో మదీనహ్ నుండి మక్కా కు ప్రయాణం మొదలు పెట్టే సమయంలో ఈ ఆయత్ ను పఠించారు[1]: “అప్పుడు మూసా, భయపడుతూనే, అక్కణ్ణుంచి బయటపడ్డాడు. .ప్రభూ! నన్ను దుర్మార్గ జనుల చెర నుండి కాపాడు. అని వేడుకోసాగాడు”[ఖసస్, ఆయత్22][2]
2. షాబాన్ మాసంలో మక్కాలో ప్రవేశించేటప్పుడు ఈ ఆయత్ ను పఠించారు:[3] “అతను (మూసా) మద్యన దిక్కుకు ప్రయాణమైనప్పుడు, ‘నా ప్రభువు నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను’ అన్నాడు”[ఖసస్, ఆయత్22].
ఆ. ఇరాఖ్ మరియు కర్బలా వైపుకు వెళ్తుండగా కొన్ని సందర్భాలలో చదివిన ఆయతులు:
3. ఇమామ్ హుసైన్(అ.స) మక్కా నుండి బయటకు వచ్చారు, ఉమర్ ఇబ్నె సఅద్ ఇబ్నె ఆస్ తరపు నుండి వచ్చన యహ్యా ఇబ్నె సయీద్ ఇమామ్ హుసైన్(అ.స) కు అడ్డుపడి వారితో ఇలా అన్నాడు: “వెనక్కి తిరిగి వెళ్లు! ఎక్కడికి వెళ్తున్నావు?” కాని ఇమామ్ హుసైన్(అ.స) వాడి మాటలు పట్టించుకోకుండా తన ప్రయాణాన్ని సాగించారు, రెండు సమూహాల మధ్య జగడం మొదలయ్యింది, ఒకరికిఒకరు కొరడాలతో కొట్టుకున్నారు. ఇమామ్ హుసైన్(అ.స) మరియు వారి అనుచరులు బలంగా ప్రతిఘటించారు. ఆ తరువాత ఇమామ్ హుసైన్(అ.స) తన ప్రయాణం మొదలు పెట్టారు. అప్పుడు ఇలా అరుపులు మొదలయ్యాయి: “ఓ హుసైన్! అల్లాహ్ కు భయపడవా? జమాఅత్(సమూహం) నుండి బయతకు వెళ్తున్నావు మరియు ఉమ్మత్ మధ్య విభజనకు సృష్టిస్తున్నావు” ఇమామ్ హుసైన్(అ.స) ఈ ఆయత్ ను పఠించారు:[4] “నా పని నాది. మీ పని మీది. నా పనుల బాధ్యత మీపై లేదు. మీ పనుల బాధ్యత నాపై లేదు” అని (ఓ ప్రవక్త!) వారికి చెప్పెయ్యి”[సూరయె యూనుస్, ఆయత్41]
4. ఇరాఖ్ మార్గం మధ్యలో ఇమామ్ హుసైన్(అ.స)కు జనాబె ముస్లిం ఇబ్నె అఖీల్, హానీ ఇబ్నె ఉర్వా, ఖైస్ ఇబ్నె ముసహ్హరె సైదావీ మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె యఖ్తర్ మరణ వార్తలు అందాయి.[5] ఇమామ్ హుసైన్(అ.స)కు ఖైస్ ఇబ్నె ముసహ్హరె సైదావీ మరణవార్త అందినప్పుడు, వారి కళ్లు కన్నీళతో నిండాయి అప్పుడు వారు ఈ ఆయత్ ను పఠించారు:[6] “విశ్వాసులలో కొందరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారున్నారు. కొందరు తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోగా, మరి కొందరు (అవకాశం కోసం) ఎదురు చూస్తున్నారు. వారు (తమ పోరాట స్ఫూర్తిలో) ఎలాంటి మార్పు రానివ్వలేదు”[సూరయె అహ్జాబ్, ఆయత్23]
5. అబ్దుల్లాహ్ ఇబ్నె మున్జరె అసదీ, సఅలబియహ్[7]లో ఇమామ్ హుసైన్(అ.స)కు ముస్లిం ఇబ్నె అఖీల్ మరియు హానీ ఇబ్నె ఉర్వా మరణవార్తలను అందించినప్పుడు, ఇమామ్ ఇలా అన్నారు: “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్; మేము ఖుద్దుగా అల్లాహ్ కు చెందిన వారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!”[సూరయె బఖరహ్, ఆయత్156]. ఇమామ్ ఎన్నో సార్లు ఈ వాక్యాన్ని చెబుతూనే ఉన్నారు.[8]
6. అబ్దుల్లాహ్ ఇబ్నె హుర్రె జొఅఫీ, ఇమామ్ హుసైన్(అ.స) ఆహ్వానాన్ని మన్నించకుండా నా గుర్రాన్ని మీకు బహుమతిగా ఇస్తాను అని అన్నాడు, అప్పుడు ఇమామ్ తన ముఖాన్ని అతడి నుండి త్రిప్పుకొని ఇలా అన్నారు: “అయితే నువ్వు మా మార్గం లో ప్రాణ త్యాగం పట్ల సంకోచిస్తున్నావు, మాకూ నీ సొమ్మ అవసరం లేదు” ఆ తరువాత ఈ ఆయత్ ను పఠించారు”[9] “అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను”[14. సూరయె కహఫ్, ఆయత్51].
రిఫరెన్స్
1. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, భాగం2, పేజీ35, కొంగొరెహ్ షేఖ్ ముఫీద్, ఖుమ్, చాపె అవ్వల్, 1413ఖ.
2. ఖుమ్మీ, అలీ ఇబ్నె ఇబ్రాహీమ్, తఫ్సీరె ఖుమ్మీ, మొహఖ్ఖిఖ్ వ ముసహ్హెహ్: మూసవీ జజాయిరీ, తయ్యబ్, భాగం2, పేజీ137, దారుల్ కితాబ్, ఖుమ్, చాప్3, 1404.
3. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, భాగం2, పేజీ35-36, కొంగొరెహ్ షేఖ్ ముఫీద్, ఖుమ్, చాపె అవ్వల్, 1413ఖ.
4. తబరీ, మొహమ్మద్ ఇబ్నె జురైర్, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్, భాగ5, పేజీ385, దారుత్తురాస్, బీరూత్, చాప్2, 1387ఖ.
5. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, భాగం2, పేజీ70-76, కొంగొరెహ్ షేఖ్ ముఫీద్, ఖుమ్, చాపె అవ్వల్, 1413ఖ.
6. జజరీ, ఇజ్జుద్దీన్ ఇబ్నె అసీర్, అల్ కామిల్ ఫిత్తారీఖ్, భాగం2, పేజీ50, దారుస్సాదిర్, బీరూత్, 1385ఖ.
7. మార్గం మధ్య విశ్రాంతి నిలయం పేరు.
8. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, భాగం2, పేజీ74, కొంగొరెహ్ షేఖ్ ముఫీద్, ఖుమ్, చాపె అవ్వల్, 1413ఖ.
9. ముఖర్రమ్, అబ్దుర్రజ్జాఖ్, మఖ్తలుల్ హుసైన్(అ.స), పేజీ194, మొఅస్ససతుల్ ఖురాసాన్, లిల్ మత్బూఆత్, బీరూత్, 1426ఖ.
వ్యాఖ్యానించండి