దుఆ యొక్క ప్రాముఖ్యత మరియు వాటి నిబంధనల గురించి సంక్షిప్త వివరణ...

దుఆ, ఉనికి యొక్క మూలం మరియు విశ్వం యొక్క ప్రభువు పై మనిషి శ్రద్ధ చూపడం. దుఆ అల్లాహ్ తన దాసులకు ప్రసాదించిన మంచి అవకాశం; దాంతో మనిషి తన ప్రభువు సన్నిధి నుంచి ఉత్తమత్వాన్ని పొందగలడు; అది సంపూర్ణత్వం, సజ్జనత్వం మరియు ఆత్మగౌరవం పొందడానికి సహాయపడుతుంది. దుఆ ఆత్మ మరియు శారీరక కష్టాలకు తొలగిస్తుంది.
మనిషి దుఆ ద్వారా అల్లాహ్ తో మాట్లాడి కష్టాలు మరియు ఆపదల నుంచి తమను తాము కాపాడుకుంటాడు. దుఆ మనిషి యొక్క మోక్షానికి మరియు ఉపశమనానికి దారి తీస్తుంది.
దైవప్రవక్త(స.అ) ఇలా దుఆ చేసేవారు: “ఓ అల్లాహ్! నేను నీ నుంచి నీ ప్రేమను కోరుతున్నాను. అలాగే నీవు ఇష్టపడేవారి ప్రేమను కూడా. నన్ను నీ ప్రేమతో జత చేసే కార్యముల వైపు వెళ్తున్నాను. ఓ అల్లాహ్! నీ పట్ల ప్రేమ నా స్వయం కన్నా, నా కుటుంబం కన్నా మరియు రుచికరమైన నీరు కన్నా ఎక్కువ ఇష్టపడేవాడిగా నిర్ధారించు”[1]
అల్లాహ్ తన దాసులకు వారి ప్రార్థనలకు సమాధానమిస్తానని హామీ ఇచ్చాడు. మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను”[సూరయె గాఫిర్, ఆయత్60]
“(ఓ ప్రవక్తా! నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని(నువ్వు వారికి చెప్పు) కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి (ఈ విషయం నీవు వారికి తెలియజేయి) తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు”[సూరయె బఖరహ్, ఆయత్186].
దుఆ యొక్క నిబంధనలు
దుఆకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిలో కొన్ని బాహ్య నిబంధనలు, మరికొన్ని అంతర నిబంధనలు. దుఆ ఆరాధన ఫలం. ముందుగా దుఆ యొక్క అంతర నిబంధనలను తెలుసుకుందాం:
దుఆ మనసు లోతు నుండి చేయాలి, దేని గురించి దుఆ చేస్తున్నాడు అన్న విషయం పై స్పష్టత ఉండాలి, నియ్యత్తు మంచిదై ఉండాలి, ఇప్పుడు దుఆ చేస్తే దాని స్వీకరణ తలుపు వెనకాలే ఉంది అని భావించాలి. దుఆను స్వచ్చతతో చేయాలి.
ఒకడు దుఆ చేస్తుండగా, హజ్రత్ అలీ(అ.స) దానిని వింటున్నారు. అతడు మేము దుఆ చేస్తూ ఉంటాము ఎందుకని అది స్వీకరించబడదు అని ప్రశ్నించాడు. ఇమామ్ దాని ద్వారం నుండి ప్రవేశించవు కాబట్టి అన్నారు. దాని మార్గం ఏమిటి? అని అతడు ప్రశ్నించాడు. ఇమామ్, చేస్తున్న దుఆపై దృష్టి పెట్టు, చేసే దుఆలో స్వచ్చత ఉందా లేదా గ్రహించు, దుఆ స్వీకరించబడడానికి దాని మార్గం ద్వార వెళ్లాలి, అని సమాధానమిచ్చారు.
పిల్లాడు ఏదో వ్యాధికి గురి అవుతాడు, అనుకోకుండా ఒక మంచి వైధ్యుడి గురించి నీకు చెప్పబడుతుంది, పిల్లాడ్ని అతడి దగ్గర తీసుకెళ్తావు, నీ పిల్లాడి రోగం నయమౌతుంది, నువ్వు ఆ డాక్టర్ కు కృతజ్ఞత తెలుపుకుంటావు అల్లాహ్ ను మరచి పోతావు, నిజానికి అల్లాహ్ నీకు దారి చూపినవాడై ఉంటాడు. అది మనకు ఎందుకు అర్థం కాదంటే దుఆ చేసిన వెంటనే ఏదో అద్భుతం జరిగి అప్పటికప్పుడే ఆ దుఆ స్వీకరణ మనకు తెలిసిపోవాలని భావిస్తాము. ఈరోజు ఓ అల్లాహ్ నాకు ఒక ఇల్లు కావాలి అని దుఆ చేస్తే రేపు మన చేతిలో ఇంటి తాళాలు వచ్చి పడిపోవాలి అని అనుకుంటాం. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి దుఆ చేసి ఉంటావు, లోన్ దరఖాస్తు పెట్టి ఉంటావు, అది పాస్ అయి నువ్వు ఇల్లు కూడా కొనుక్కోని ఉండవచ్చు కాని అది నువ్వు ఇంటి కోసం చేసిన దుఆ స్వీకరించబడింది అని గ్రహించవు. ఇల్లు కట్టుకోవడానికి కావలసిన వాటిని అందించబడడం వల్ల నీ ఇల్లు కొనుక్కోవాలనే కోరిక పూర్తయ్యింది.
దైవప్రవక్త(స.అ) కాలంలో ఒక కోట ఉండేది, దాన్ని జయించడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. దుఆలు చేశారు, ప్రార్థనలు చేశారు. ఒకరోజు ఒక కుక్క ను ఆ కోట నుండి బయటకు వస్తుండగా చూశారు. సైన్యాధిపతి తప్పకుండా ఏదో ఒక సురంగం ఉంది కాబట్టి ఈ కుక్క బయటకు రాగలిగింది, కోట వెనక వైపు నిజంగానే ఒక సురంగం కనిపించింది. ఒకొక్కరూ కోటలోకి ప్రవేశించి ఆ కోటను జయించారు. అల్లాహ్ ఇలా ఒక దాని ద్వార కోరుకున్న వాటిని ప్రసాదిస్తాడు.
బాహ్య నిబంధనలు:
వీటిని పాటించడం వల్ల దుఆ యొక్క అంతర నిబంధనల బలం పెరుగుతుంది. అహ్లెబైత్(అ.స) యొక్క దుఆ చేయు పద్ధతులను, నిబంధనలను చూసుకున్నట్లైతే వారు వీటిని పాటించేవారు:
1. దుఆ చేయాడానికి ముందు ఉజూ చేయడం
2. ఖిబ్లా(కాబా-అల్లాహ్ గృహం)కు ఎదురుగా ఉండడం. వీలైతే రెండు రక్అత్ల నమాజ్ చదివి ఆ నమాజ్ ద్వార దుఆ చేయగలిగితే ఇంకా మంచిది. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉపదేశించారు: “ఎందుకని ప్రజలు నమాజ్ ద్వార సహాయం కోరరు, నాకు ఈ విషయంలో చాలా ఆశ్చర్యమేస్తుంది”
3. దుఆను అల్లాహ్ పేరుతో మొదలు పెట్టాలి. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: దుఆకు ముందు ఐదు సార్లు “యా రబ్బనా” చెప్పాలి. మరో హదీస్ లో ఇలా సూచించబడి ఉంది: ఏడు సార్లు “యా అర్హమర్రాహిమీన్” అని చెప్పాలి, పది సార్లు “యా అల్లాహ్” అని చెప్పాలి.
4. చేసిన పాపములను అల్లాహ్ ముందు ఒప్పుకోవడం. ఈ రకం దుఆ చేయడాన్ని “దుఆయె కుమైల్” లో చూడవచ్చు.[2]
రిఫరెన్స్
1. ముత్తఖీయె హిందీ, కన్జుల్ ఉమ్మాల్, హదీస్3648.
2. https://btid.org/fa/news/9628
سایت شبکه سه برنامه سمت خدا پاسخگوئی دکتر رفیعی
వ్యాఖ్యానించండి