జనాబె ఖదీజా(స.అ)

శుక్ర, 03/31/2023 - 21:01

దైవప్రవక్త(స.అ) యొక్క అతి ప్రియమైన భార్య అయిన హజ్రత్ ఖదీజతుల్ కుబ్రా(అ.స) యొక్క ప్రతిష్టత హదీసులనుసారం...

జనాబె ఖదీజా(స.అ)

జనాబె ఖదీజా(స.అ) దైవప్రవక్త(స.అ) యొక్క మొదటి భార్య. ఆమె తండ్రి పేరు ఖువైలద్. హజ్రత్ ముహమ్మద్(స.అ)ను అల్లాహ్ తన ప్రవక్తగా ఎన్నుకున్న తరువాత మగవారిలో మొట్ట మొదట హజ్రత్ అలీ(అ.స) మరియు స్త్రీలలో జనాబె ఖదీజా(స.అ) హజ్రత్ ముహమ్మద్(స.అ) తీసుకొచ్చిన ఇస్లాంను స్వీకరించారు.
“బేసత్”(హజ్రత్ ముహమ్మద్(స.అ), ప్రవక్తగా ఎన్నుకోబడ్డ రోజుని “బేసత్” అంటారు) యొక్క 5 సంవత్సరాల తరువాత దైవప్రవక్తా, ఖదీజ(స.అ) దంపతులకు ఫాతెమా జహ్రా(స.అ) జన్మించారు.[1] దైవప్రవక్త(స.అ) 25 సంవత్సరముల వయసులో ఆమెతో వివాహం చేసుకున్నారు. ఆమె గురించి స్వయంగా దైవప్రవక్త(స.అ) మాటల్లో చెప్పాలంటే వారి యొక్క అతి మంచి భార్య, ఆమె తన పూర్తి ధనాన్ని మరియు సౌకర్యాలను ఇస్లాం ప్రచారం దైవప్రవక్త(స.అ)కు అప్పగించి వారితో ఇష్టంగా జీవితాన్ని గడిపారు, వారికి ఆమెతో ఎటువంటి కష్టం కలగలేదు. “బేసత్” యొక్క 10వ ఏట, పవిత్ర రమజాన్ మాసంలో జనాబె ఖదీజా(స.అ) మరణించారు. ఆమె మరణం, దైవప్రవక్త(స.అ)కు చాలా బాధ కలిగించింది. ఎంత బాధకలిగించిందంటే; ఆమె మరణాంతరం దైవప్రవక్త(స.అ) ఇంటి నుండి చాలా అరుదుగా బయటకు వెళ్ళేవారు. దైవప్రవక్త(స.అ) యొక్క ఈ క్షోభ వల్ల ఆ సంవత్సరం పేరు “ఆముల్ హుజ్న్” అనగా బాధాకర సంవత్సరం అని పిలవబడేది.[2]. ఆమె బ్రతికున్నంతకాలం దైవప్రవక్త(స.అ) మరో వివాహం చేసుకోలేదు. ఈమె మరియు మారియహ్ ఖిబ్తియహ్ ద్వారానే తండ్రి అయ్యారు. అజ్ఞానపు కాలంలో జనాబె ఖదీజా(స.అ)ను “తాహిరహ్” అని సంభోదించేవారు. మరి దైవప్రవక్త(స.అ) ఆమెకు “కుబ్రా” అని బిరుదునిచ్చారు.
ఆయిషహ్ ఉల్లేఖనం: “దైవప్రవక్త(స.అ) ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఖదీజాను గుర్తుచేసేవారు, వారి మంచిని చెప్పేవారు. ఒకరోజు నాకు కడుపుమంట భరించలేక “ఆమె ఒక ముసలావిడ తప్ప మరేది కాదు1. అల్లాహ్ ఆమెకు బదులుగా ఆమెకు మించిది ప్రసాదించాడు” దైవప్రవక్త(స.అ)కు కోపం వచ్చింది, ఆ కోపంతో వారి తల వెంట్రుకలు కదులుతున్నాయి, అప్పుడు దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: “కాదు, అల్లాహ్ సాక్షిగా! ఆమెకు మించిన దానిని నాకివ్వలేదు. ప్రజలు నన్ను విశ్వసించనప్పుడు ఆమె నా పై విశ్వాసం కలిగి ఉంది; ప్రజలు నన్ను నమ్మని సమయంలో నన్ను నమ్మింది; ప్రజలు నన్ను ఒంటరివాడిని చేసినప్పుడు తన సొంత సొమ్ముతో నన్ను సహకరించింది, నాకు తోడుగా నిలిచింది;....”
ఆయిషా ఇలా అన్నారు: ఆ తరువాత ఇక ఎన్నడూ ఖదీజా గురించి అగౌరవంగా చెప్పను అని ప్రమాణం చేసుకున్నాను.[3]

ఖదీజా[అ.స] శ్రేష్ఠత హదీసులలో
దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: ప్రపంచమంతటికీ చాలా మంచి స్త్రీలు:
خَیرُ نِسَاءِ الْعَالَمِینَ مَرْیمُ بِنْتُ عِمْرَانَ وَ آسِیةُ بِنْتُ مُزَاحِمٍ وَ خَدِیجَةُ بِنْتُ خُوَیلِدٍ وَ فَاطِمَةُ بِنْتُ مُحَمَّدٍ
అనువాదం: ఇమ్రాన్ కుమార్తె మర్యమ్, మజాహిమ్ కుమార్తె ఆసియా, ఖువైలద్ కుమార్తె ఖదీజా[అ.స] మరియు ముహమ్మద్(స.అ) కుమార్తె ఫాతెమా(స.అ)లు సకలలోకాల స్త్రీలలో ఉత్తములు.[4]మరి ఇలా కూడా ప్రవచించెను:
أَفْضَلُ نِسَاءِ أَهْلِ الْجَنَّةِ أَرْبَعٌ خَدِیجَةُ بِنْتُ خُوَیلِدٍ وَ فَاطِمَةُ بِنْتُ مُحَمَّدٍ وَ مَرْیمُ بِنْتُ عِمْرَانَ وَ آسِیةُ بِنْتُ مُزَاحِمٍ امْرَأَةُ فـِرْعَوْن
అనువాదం: స్వర్గమంతటికీ చాలా మంచి స్త్రీలు నలుగురు, వారు: ఖువైలద్ కుమార్తె ఖదీజా, ముహమ్మద్(స.అ) కుమార్తె ఫాతెమా(స.అ), ఇమ్రాన్ కుమార్తె మర్యమ్ మరియు ముజాహిమ్ కుమార్తె ఆసియా.[5]
దైవప్రవక్త(స.అ) ఆమె కోసం స్వర్గంలో మంచి భవనం ఉందని శుభవార్త ఇస్తూ ఇలా అన్నారు:
خـَدِیجَۀُ علیها السلام سَابِقَةُ نـِسَاءِ الْعَالَمِینَ إِلَی الْإِیمَانِ بِاللَّهِ وَ بِمُحَمَّدٍ
అనువాదం: ఖదీజా(స.అ), ప్రపంచమంతటి స్త్రీలలో, అల్లాహ్ మరియు ముహమ్మద్(స.అ) ను విశ్వసించడంలో ముందుంది.[6]  

రిఫ్రెన్స్
1. ఇబ్నె అసీర్, ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ434.
2. ఇబ్నె అసీర్, ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ434.
3. అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ84 తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.
4. ఇబ్నె అసీర్, ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ537.
5. ఇబ్నె అబ్దుల్ ఇజ్జ్, అల్ ఇస్తిఆబ్, భాగం2, పేజీ720.
6. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం14, పేజీ27; ఇబ్నె అసీర్, ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ438.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21