ఏతెకాఫ్ యొక్క అర్థం, దాని ప్రతిష్టత మరియు ప్రాముఖ్యతతో పాటు దాని చరిత్ర సంక్షిప్తంగా....
ఈ బిజీ లైఫ్ లో విశ్వాసి తన మనోవాంఛలకు గురి అయి తన జీవిత లక్ష్యాన్ని మరిచి పెడదారిన పడ్డాడు, తనను మరలా తిరిగి రుజుమార్గం మరియు లక్ష్యానికి చేర్చే దారి పై రావడానికి ఇస్లాం చాలా మార్గాలను ఉపదేశించింది వాటిలో ఒకటి ఏతెకాఫ్. ఏతెకాఫ్ లో విశ్వాసి హృదయం పవిత్ర స్థితికి చేరుతుంది, దాంతో హృదయం అల్లాహ్ నిలయంగా మారుతుంది. అల్లాహ్ నిలయంలో మనోవాంఛలకు మరియు పాపములకు ప్రవేసించే అనుమతి ఉండదు. అప్పుడు అల్లాహ్ తో తనకు ఉన్న బంధం బలపరచబడుతుంది. అంతర్ దృష్టి దైవకాంతితో ముడి పడుతుంది. విశ్వాసి అల్లాహ్ పట్ల తన కర్తవ్యాలు మరియు బాధ్యతలను ఇంకా బాగా తెలుసుకుంటాడు. ఏతెకాఫ్ లో మూడు రోజుల పాటు వేరే ఆలోచన ఉండదు కాబట్టి ఇది అల్లాహ్ కు దగ్గర అయ్యేందుకు మంచి అవకాశంగా నిలుస్తుంది.
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఆరాధనను ఇష్టపడే వారు, మనసారా ఆరాధనను తన ఓడిలో తీసుకునే వారు మరియు శారీరకంగా దానిని ఇష్టపడేవాడు మరియు దాని కోసం అవకాశాలు సృష్టించుకునేవాదు (ఆరాధన కోసం సమయాన్ని కేటాయించుకునే వాడు) ప్రజలందరిలో ఉత్తముడు.
ఇలాంటి అవకాశాలలో ఒకటి ఏతెకాఫ్ అని చెప్పుకోవచ్చు.
ఏతెకాఫ్ యొక్క ప్రతిష్టత మరియు ప్రాముఖ్యత
ఖుర్ఆన్
ఏతెకాఫ్ యొక్క అర్థం మూడు రోజులు లేదా దానికి మించి జామిఅ మస్జిదులో ఉండడం.
ఖుర్ఆన్ లో ఏతెకాఫ్ గురించి ఇలా ఉపదేశించెను: “...నా గృహాన్ని (సందర్శించి) ప్రదక్షిణ చేసేవారి కోసం, అక్కడ ఏతెకాఫ్ పాటించేవారి కోసం, రుకూ సజ్దాలు చేసేవారి కోసం మీరు దానిని పరిశుభ్రంగా, పరి శుద్ధంగా ఉంచాలి” అని ఇబ్రాహీమ్, ఇస్మాయీలు నుంచి మేము వాగ్దానం తీసుకున్నాము.(సూరయె బఖరహ్, ఆయత్125)
ఈ ఆయత్ ఏతెకాఫ్ పాటించడం పై నిదర్శనం. మస్జిద్ అల్లాహ్ నిలయం కాబట్టి మస్జిదులోనే అది కూడా జామిఆ మస్జిదులో పాటించడం ఉత్తమం.
రివాయాత్
1. ఆరాధనల కూడిక
నిజానికి ఏతెకాఫ్ ఒక విధంగా వాజిబ్ మరియు ముస్తహబ్ ఆరాధనలతో కూడి ఉన్న ఒక గొప్ప ఆరాధన. అందులో పాపముల నుండి దూరం చేసేటువంటి నమాజ్ ప్రభావం ఉంది. దైవరహస్యాలు కలిగి ఉన్న ఉపవాస దీక్షలున్నాయి. వివిధ ప్రముఖ దుఆలు మరియు కొన్ని హజ్ నియమాలు ఉన్నాయి.
2. పాప క్షమాపణ
కొందరి కార్య పత్రాలు పాపములతో నిండి ఉంటాయి వాటిని తొలగించుకోవడానికి లేదా తరిగించుకోవడానికి ఈ ఏతెకాఫ్ మంచి అవకాశం. రివాయతులలో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “ఎవరైతే విశ్వాస పరంగా ఏతెకాఫ్ ను పాటిస్తాడో, అతడు మునుపటి పాపములు క్షమించబడతాయి” ఈ హదీస్ ద్వార ఏతెకాఫ్ మనిషి పాపములను తొలగించి తల్లి కడుపు నుండి అప్పుడే జన్మించిన బిడ్డలా పవిత్రంగా మారుతాడు అని తెలుస్తుంది.
3. నరకం నుండి విముక్తి మరియు మంచి ముగింపు
మంచి ముగింపు లేదా నరకాగ్ని నుండి విముక్తి అనేది ఔలియాలు మరియు ప్రముఖులందరీ కోరిక. అల్లాహ్ యొక్క వెయ్యి పేర్లతో కూడి ఉన్న దుఆయె జౌషనె కబీర్ లో ప్రతీ పది పేర్ల తరువాత ఇలా అంటాము: “..... ఖల్లిస్నా మినన్ నారి యా రబ్బ్; ఓ ప్రభూ! మమ్మల్ని నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదించు”
దుఆయె ముజీర్ లో కూడా అల్లాహ్ యొక్క ప్రతీ రెండు పేర్ల తరువాత ఇలా అంటాము: “అజిర్నా మినన్ నారి యా ముజీర్; మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు ఓ రక్షణ కల్పించేవాడా”
మనిషి ఈ కొన్ని రోజులు మస్జిదులో ఉండి తనను నరకాగ్ని నుండి కాపాడు కోవచ్చు. దైవప్రవక్త(స.అ) నుండి ఇలా హదీస్ ఉల్లేఖించబడి ఉంది: “ఎవరైతే అల్లాహ్ కోసం ఏతెకాఫ్ చేస్తారో అల్లాహ్ అతడి మరియు నరకాగ్ని మధ్య మూడు గోతులను పెడతాడు.(అతడిని నరకాగ్ని నుండి కాపాడుతాడు).[1]
4. లెక్క లేనంత పుణ్యం
అల్లాహ్ కొన్ని చర్యలకు రెండింతల పుణ్యం నిర్ధారించెను, మరికొన్నింటికి పదొంతులు మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి 70 వంతులు మరియు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడం యొక్క పుణ్యం అయితే లెక్క లేనంత పుణ్యం ప్రసాదించబడుతుంది. ఇలాంటి పుణ్యాలు లభించే వాటిలో ఏతెకాఫ్ కూడా ఒకటి. హదీస్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “ఏతెకాఫ్ చేసే వాడు పాపములను నిలిపేస్తాడు(నాశనం చేస్తాడు) మరియు అన్నీ మంచి పనులను చేసిన వాడి పుణ్యాన్ని పొందుతాడు”
5. రెండు హజ్ మరియు రెండు ఉమ్రాలు
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “రమజాన్ మాసంలో ఏతెకాఫ్ (పుణ్యం) రెండు హజ్ మరియు రెండు ఉమ్రాకు సమానం”[2]
ఏతెకాఫ్ చరిత్ర
ఖుర్ఆన్ మజీద్ ఆధారంగా ఏతెకాఫ్ హజ్రత్ ఇబ్రాహీమ్(అ.స) షరీఅత్ లో అల్లాహ్ ఆరాధానలలో లెక్కించబడేది మరియు వారు దాని పై అమలు చేసేవారు.
హజ్రత్ సులైమాన్ ప్రవక్త కూడా బైతుల్ ముఖద్దస్ లో ఏతెకాఫ్ చేసేవారు. హజ్రత్ మూసా ప్రవక్త తూర్ కొండపై ఏతెకాఫ్ చేసేవారు. హజ్రత్ జకరియ్యాహ్ బైతుల్ ముఖద్దస్ లో ఏతెకాఫ్ చేసేవారి బాధ్యుడిగా ఉండేవారు వారిలో హజ్రత్ మర్యమ్(స.అ) ఒకరు.
దైవప్రవక్త(స.అ) కూడా వారి పూర్వీకుల మాదిరి ఏతెకాఫ్ చేసేవారు.[3]
రిఫరెన్స్
1. అల్ మఅజముల్ ఔసత్, భాగం7, పేజీ221, హదీస్7326; కన్జుల్ ఉమ్మాల్, భాగం8, పేజీ532, హదీస్24019.
2. https://hawzah.net/fa/Magazine/View/2689/3853/29723/اعتکاف-مکتب-خود-سازی
3. https://hawzah.net/fa/Magazine/View/5764/5765/57808/فصل-هفتم--اعتکاف-دهه-آخر-ماه-رمضان
వ్యాఖ్యలు
హజ్రత్ రసూల్ (స. అ ) ప్రతి రంజాన్ నెల లో 10రోజులు ఏతెకాఫ్ చేసేవారు.
వ్యాఖ్యానించండి