అల్లాహ్ తన దాసుల పట్ల కలిగివున్న కారుణ్యాం గురించి ఖుర్ఆన్ ఆయతుల నిదర్శనం...
అల్లాహ్ ఖుర్ఆన్ లో తన దయ మరియు కారుణ్యం గురించి చాలా చోట్లు వివరించెను.
దయా దీనిని అరబీ భాషలో “ఫజ్ల్” అంటారు. ఫజ్ల్ అనగా ఎంత అవసరం ఉందో దానికి మించి ప్రసాదించడం.[1]
మొదటి ఆయత్: ఓ ప్రవక్తా! వారికి చెప్పు: “అల్లాహ్ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది”[సూరయె యూనుస్, ఆయత్58]
రెండవ ఆయత్: “దైవానుగ్రహం, ఆయన కారుణ్యమే గనక మీపై లేకుండినట్లయితే మీలో కొందరు తప్ప – అందరూ షైతాను అనుయాయులుగా మారిపోయేవారు”[సురయె నిసా, ఆయత్83]
మూడవ ఆయత్: “...అయినప్పటికీ దైవానుగ్రం, దైవకారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు (తీవ్రంగా) నష్టపోయేవారే”[సూరయె బఖరహ్, ఆయత్64]
నాలుగొవ ఆయత్: “అల్లాహ్ చలువ, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడూ, ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్ అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు”[సూరయె నూర్, ఆయత్21]
ఈ ఆయతులను బట్టి అల్లాహ్ కారుణ్యం నష్టాలు మరియు ఆపదల నుంచి విముక్తికి, మనోవాంఛల మరియు షైతాన్ వల నుంచి సురక్షితంగా ఉండడానికి, కారణమని తెలుస్తున్నాయి.
ఖుర్ఆన్ లో 90 సార్లు కన్నా ఎక్కువగా అల్లాహ్ యొక్క కారుణ్యం గురించి చెప్పబడి ఉంది. ఫజ్ల్ యొక్క పదానికి ఖుర్ఆన్ వ్యాఖ్యాతలు వివధ రకాలుగా నిర్వచించారు. ఈ విధంగా చూసుకున్నట్లైతే ప్రతీ ఆయత్ ను దాని ముందూ వెనక పదాలను చూసి దాని సరైన అర్ధాన్ని తెలుసుకోవడమే సరైనచర్య.
సృష్టికర్త కారుణ్యం పట్ల నిరాశ చెందకండి
అల్లాహ్ తన దాసులతో ఇలా అన్నాడు: “ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందకండి”(మార్గభ్రష్టు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు)[హిజ్ర్:56]
ప్రవక్త యాఖూబ్ తమ కుమారులతో ఇలా అన్నారు: “అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి”[యూసుఫ్:87]
ప్రవక్త యూసుఫ్[అ.స] తమ సోదరులతో ఇలా అన్నారు: “(నిరాశ చెందకండి) అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక1. ఆయన కరుణించేవారందరిలోకీ గొప్పగా కరుణించేవాడు”[యూసుఫ్:92]
ప్రవక్త మూసా[అ.స] మిస్ర్ నుండి దుర్మార్గుల నుండి తప్పించుకొని మదాయన్ కు వచ్చినప్పుడు ప్రవక్త షుఐబ్[అ.స] వారితో ఇలా అన్నారు: “భయపడకు నువ్వు దుర్మార్గ జనుల బారి నుంచి విముక్తి పొందావు”[ఖిసస్:25]
దైవప్రవక్త[స.అ] తమ సహచరునితో ఇలా అన్నారు: “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు”[తౌబహ్:40]
ఈ ఆయతుల ద్వార మనిషి దేని గురించో దిగులుగా ఉన్నప్పుడు, అతడి మనసు కలతగా ఉన్నప్పుడు అతడికి ధైర్యమివ్వాలని, తెలుస్తుంది.
రిఫరెన్స్
1. అల్ ముఫ్రదాత్, రాగిబె ఇస్ఫెహానీ, దమిష్ఖ్, పేజీ639.
వ్యాఖ్యలు
Jazakallah
వ్యాఖ్యానించండి