దైవప్రవక్త(స.అ) మరియు ఉత్తముల సమాధుల దర్శనం పై షియా మరియు అహ్లె సున్నత్ ధర్మేధుల ఫత్వాలు...

షియా మరియు అహ్లె సున్నత్ ఫుఖహా(ధర్మవేధులు)లు జియారత్ విషయంలో చాలా ఎక్కువగా తాకీద్ చేస్తూ, జియారత్ చేయడం ముస్తహబ్ చర్య అని ఫత్వా ఇచ్చారు. షియా వర్గానికి చెందిన ప్రముఖ ఫఖీహ్, మర్హూమ్ మొహఖ్ఖిఖె హిల్లీ ఇలా అన్నారు: “హజ్ చేసేవాడి పై దైవప్రవక్త(స.అ) జియారత్ చేయడం కోసం పరుగులు తీయడం మరియు త్వరపడడం చాలా తాకీదు చేయబడిన ముస్తహబ్ చర్య”[1]
చివరికి ఇలా కూడా చెప్పబడి ఉంది: ఒకవేళ ప్రజలు దైవప్రవక్త(స.అ) దర్శనం చేసుకోవడం వదిలేస్తే, ఇస్లామీయ నాయకుడు జియారత్ చేయమని బలవంతం చేస్తాడు, ఎందకుంటే వారి జియారత్ ను వదిలేయడం వారికి అన్యాయం చేసినట్లు”[2] మర్హూమ్ షైఖ్ తూసీ కూడా ఇదే చెప్పారు[3]. గౌరవనీయులైన వీళ్లు ఈ హదీస్ ను ఆశ్రయించి ఈ విధంగా చేప్పారు; దైవప్రవక్త(స.అ) నుండి ఇలా ఉల్లేఖించబడి ఉంది: “ఎవరైతే హజ్ కోసం మక్కాకు వచ్చి నన్ను దర్శించుకోకుండా వెళతారో, నాకు కష్టం కలిపించినవారు”[4] అయితే ఫుఖహాలలో కొందరు తప్పని సరి అన్న విషయం పై విమర్శలు వ్యక్తం చేశారు;[5] కాని షహీదె సానీ(ర.అ) ఇలా అన్నారు: ఒకవేళ వారి దర్శనాన్ని వదిలేస్తే, అల్లాహ్ యొక్క ఉత్తమ సున్నత్ అగౌరానికి మరియు అల్పం గురి అవుతుంది. అందుకని, ఈ అగౌరవం మరియు అల్ప తనం దూరం అవ్వడానికి అలా చేయడం తప్పని సరి అవుతుంది.[6]
అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ ఆలిమ్, ఇబ్నె ఖుద్దామహ్ ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ) జియారత్ ముస్తహబ్ చర్య, ఎందుకంటే స్వయంగా వారి నుండే రివాయత్ ఉల్లేఖించబడి ఉంది కాబట్టి; “ఎవరైతే హజ్ నిర్వహిస్తారో మరియు నా మరణాంతరం నా సమాధిని దర్శించుకుంటారో, వారు నన్ను నా జీవితంలో దర్శించుకున్నట్లే”[7] మరో రివాయత్ లో దైవప్రవక్త(స.అ) నుండి ఇలా ఉల్లేఖించబడి ఉంది: “ఎవరైతే నా సమాధిని దర్శించుకుంటారో, నా షిఫాఅత్ వారి పై వాజిబ్ అవుతుంది”[8] ఇబ్నె హుబైరహ్ ఇలా అనెను: అహ్లె సున్నత్ యొక్క నాలుగు వర్గాల నాయకులు(మాలికి, షాఫెయీ, అబూహనీఫహ్ మరియు అహ్మదె హంబల్) దైవప్రవక్త(స.అ) జియారత్ ముస్తహబ్ చర్య అని ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు.[9]
షియా వర్గానికి చెందిన ఫుఖహాలలో కొందరు ఇలా అన్నారు: నాలుగు ఆధారాల ప్రకారం అనగా గ్రంథం(ఖుర్ఆన్), సున్నత్, అఖ్ల్ మరియు ఇజ్మా ద్వారా ఉత్తముల, సజ్జనుల, ధర్మనిష్టుల మరియు మంచోళ్ల సమాధుల జియారత్ ప్రతిష్టత మరియు మక్కువను నిదర్శించవచ్చు, అలాంటిది ప్రవక్తల, మాసూమీన్(అ.స) మరియు ఉలమాల జియారత్ విషయం గురించి చెప్పనవసరం లేదు; ఆ తరువాత వారు తమ వ్యాజ్యం పై ఆధారాలను వివరించెను.[10]
రిఫరెన్స్
1. షరాయివుల్ ఇస్లాం, భాగం1, పేజీ278., జవాహిరుల్ కలామ్, భాగం20, పేజీ79.
2. షరాయివుల్ ఇస్లాం, భాహం1, పేజీ277.
3. అన్ నిహాయహ్, పేజీ285; అల్ మబ్సూత్, భాగం1, పేజీ385.
4. జవాహిరుల్ కలామ్, భాగం20, పేజీ52.
5. జవాహిరుల్ కలామ్, భాగం20, పేజీ52; మసాలికుల్ అఫ్హామ్, భాగం2, పేజీ374.
6. మసాలికుల్ అఫ్హామ్, భాగం2, పేజీ374.
7. అల్ ముగ్నీ వష్ షర్‌హుల్ కబీర్, భాగం3, పేజీ588.
8. అల్ ముగ్నీ వష్ షర్‌హుల్ కబీర్, భాగం3, పేజీ588.
9. అల్ గదీర్, భాగం5, పేజీ110.
10. ముహజ్జబుల్ అహ్కామ్, భాగం15, పేజీ33., అదబ్ ఫనాయె ముఖర్రబాన్, భాగం1, పేజీ32.
జవాదె ఆములీ, అబ్దుల్లాహ్, తద్వీన్ వ పజోహిష్: ఆర్యాయి, జాఫర్, ఇస్రా, ఖుమ్, 1397.
వ్యాఖ్యానించండి