జియారత్ చేసేటప్పుడు పాటించ వలసిన 17 నియమాలు వివరణ హదీసులనుసారం...

జియారత్ మరియు దర్శనం యొక్క నియమాలు చాలా ఉన్నాయి. మర్హూమ్ షహీద్ తన అల్ దురూస్[1] గ్రంథంలో 14 నియమాలనూ, అల్లామా మజ్లిసీ తన గ్రంథం తొహ్ఫతుజ్ జాయిర్[2]లో 17 నియమాలు మరియు మొహద్దిసె నూరీ(ర.అ) తహయ్యజ్ జాయిర్ లో 40 నియమాలు ఉల్లేఖించారు. వాటి నుండి కొన్నింటిని మీ కోసం సూచిస్తున్నాము, అయితే జియారత్ ఒక విధంగా ఆరాధన మరియు అల్లాహ్ సామిప్యానికి కారణం కాబట్టి, తప్పకుండా జాయిర్ నియత్ చేయాలి, ఎందుకంటే ఆరాధన యొక్క ఆత్మ నియ్యత్ కాబట్టి మరియు నియ్యత్ లేని ఆరాధన ఆత్మ లేని దేహం లాంటిది, ఈ విధంగా, అల్లామా హిల్లీ(ర.అ) తన గ్రంథం తజ్కిరతుల్ ఫుఖహాలో మజార్ వ్యాజ్యంలో ఇలా రచించారు: “జియారతులన్నీంటిలో నియత్ తప్పని సరైన షరత్తు, ఎందుకంటే జియారత్ ఆరాధన కాబట్టి”[3]; ఉదాహారణకు, దైవప్రవక్త(స.అ) పవిత్ర సమాధి దర్శనంలో దర్శకుడు ఇలా నియత్ చేస్తాడు: “దైవప్రవక్త(స.అ) పవిత్ర సమాధి యొక్క దర్శనం చేస్తున్నాను అల్లాహ్ సామిప్యం కోసం”
జియారత్ యొక్క కొన్ని నియమాలు:
1. గుస్ల్
2. వినయవిధేయతలు, భక్తిశ్రద్ధలు
3. శుభ్రమైన దుస్తులు ధరించడం
4. ఇజ్నె దుఖూల్(ప్రవేశానికి అనుమతి కోరడం)
5. ఆస్థానాన్ని ముద్దు పెట్టడం, చుంబించడం
6. మెల్లగా మాట్లాడటం
7. తక్బీర్ చెప్పడం
8. సమాధి యొక్క ప్రాకారాన్ని ముద్దు పెట్టడం
9. మాసూరహ్(మాసూములు చదివిన) జియారత్ చదవడం
10. జియారత్ యొక్క నమాజ్ చదవడం
11. జియారత్ యొక్క నమాజ్ తరువాత దుఆ చదివవలసిన దుఆను చదవడం
12. ఖుర్ఆన్ పఠించడం
13. హృదయ సమక్షం మరియు తౌబహ్
14. హరమ్ మరియు దాని సేవకుల పట్ల గౌరవం
15. దుఆ మరియు బయలుదేరడానికై అనుమతి కోరడం
16. స్వభావం మరియు నడవడికలో మార్పు
17. పేదవారికి సహాయం చేయడం
ఈ నియమాలన్నీంటికి ధర్మ పరమైన మరియు వివేకపరమైన నిదర్శనలు ఉన్నాయి. తరువాత వ్యాసాలలో వాటిని కూడా వివరంచడం జరుగుతుంది. ఇన్ షా అల్లాహ్...
రిఫరెన్స్
1. అల్ దురూస్, భాగం2, పేజీ22.
2. తొహ్ఫతుజ్ జాయిర్, పేజీ31, చాపె సంగీ.
3. తజ్కిరతుల్ ఫుఖహా, భాగం8, పేజీ449.
వ్యాఖ్యానించండి