హజ్రత్ జహ్రా(స.అ) మరియు ఖుర్ఆన్

బుధ, 12/06/2023 - 08:41

ఖుర్ఆన్ పట్ల గౌరవం మరియు దాని ప్రాముఖ్యత హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) దృష్టిలో...

హజ్రత్ జహ్రా(స.అ) మరియు ఖుర్ఆన్

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఖుర్ఆన్ యొక్క యదార్థం నుండి ఎప్పటికీ వేరు కాలేదు ఎందుకంటే దైవప్రవక్త(స.అ) రివాయత్ అనుసారం ఇత్రత్ మరియు అహ్లె బైత్(అ.స) యొక్క భాగం మరియు సమానమైనది. “నేను మీ మధ్య అల్లాహ్ గ్రంథం మరియు నా అహ్లెబైత్ ను విడిచి వెళ్తున్నాను, ఇవి ప్రళయం వరకు వేరు కావు”[1]

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ), హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) తో వసీయత్ చేస్తూ ఇలా అన్నారు: “ఓ అలీ! నా మరణానంతరం నన్ను మీరే గుస్ల్ స్నానం చేయించండి, నా జనాజా నమాజ్ ను మీరే చదివించండి, నన్ను మీరే సమాధిలో దింపండి, మట్టి వేయండి, ఆ తరువాత నా తల భాగం వైపు నాకు అభిముఖంగా కూర్చొని ఎంత ఎక్కువగా ఖుర్ఆన్ పఠించగలరో పఠించండి, దుఆ చేయండి ఎందుకంటే మృతుడికి వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది, నేను మిమ్మల్ని అల్లాహ్ కు అప్పగిస్తున్నాను మరియు నా పిల్లల విషయంలో మీకు సిఫార్సు చేస్తున్నాను”[2]

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) మరో చోట ముస్లిములకు వాళ్లు ఖుర్ఆన్ పట్ల అశ్రద్ధతను చూసి, హెచ్చరించారు మరియు ఇలా అన్నారు: “మీరు ఖుర్ఆన్ ను తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు, చాలా తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నారు, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, అల్లాహ్ సాక్షిగా దీని బారాన్ని ఎత్తడం మీకు కష్టమౌతుంది మరియు దీని ఫలితం మీ ప్రాణాలకు వస్తుంది. మీ కళ్ల పై పడి ఉన్న ముసుగు తొలగించబడిన రోజు మీరు ఊహించనటువంటి నష్టం మీ ముందుకు వస్తుంది”[3]

రిఫరెన్స్
1. దైలమీ, హసన్ ఇబ్నె అబిల్ హసన్, ఇర్షాదుల్ ఖులూబ్, భాగం1, పేజీ131.
وَ قَالَ صَلَّى اَللَّهُ عَلَيْهِ وَ آلِهِ: إِنِّي تَارِكٌ فِيكُمُ اَلثَّقَلَيْنِ مَا إِنْ تَمَسَّكْتُمْ بِهِمَا لَنْ تَضِلُّوا بَعْدِي كِتَابَ اَللَّهِ وَ عِتْرَتِي أَهْلَ بَيْتِي وَ إِنَّهُمَا لَنْ يَفْتَرِقَا حَتَّى يَرِدَا عَلَيَّ اَلْحَوْضَ
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం79, పేజీ27.
إِذَا أَنَا مِتُّ فَتَوَلَّ أَنتَ غسْلِی وَ جَهِّزْنِی وَ صَلِّ عَلَیَّ وَ أَنْزِلْنِی قبْرِی وَ أَلْحدْنِی وَ سَوِّ الترَابَ علَیَّ وَ اجلِسْ عِنْدَ رَأْسِی قُبَالَةَ وَجْهِی فَأَکثِرْ منْ تلَاوَةِ الْقُرْآنِ وَ الدُّعَاءِ فَإِنَّهَا سَاعَةٌ یحْتَاجُ الْمَیتُ فِیهَا إِلَی أُنْسِ الْأَحْیاءِ وَ أَنَا أَسْتَوْدِعُک اللَّه تعَالَی وَ أُوصِیک فِی وُلْدِی خَیراً
3. దష్తీ, మొహమ్మద్, అహాదీసె ఫాతెమతుజ్ జహ్రా(స.అ), పేజీ137.
وَلَبِئسَ مَاتَأوَّلتُم وَ سَاءَ مَا بِهٖ أشَرتُم وَ شَرَّ مَا مِنہٗ اعتَضتُم، لَتَجِدَنَّ وَاللّٰهِ مَحمِلَهٗ ثَقِیلًا وَ غِبَّه وَبِیلًا إذَا کُشِفَ لَکُمُ الغِطَاءُ وَ بَانَ مَا وَرَائَهٗ الضَّرَّاءُ وَ بَدَا لَکُم مِن رَّبِّکُم مَا تَکُونُوا تَحسِبُونَ
4. దష్తీ, మొహమ్మద్, నెహ్జుల్ హయాత్, హదీస్164.
حُبِّبَ إلَىَّ من دُنياكُم ثَلاثٌ : تِلاوَةُ كِتابِ اللّه ِ و النَّظَرُ في وَجهِ رَسولِ اللّه ِ و الإنفاقُ في سَبيلِ اللّه ِ 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 32