హజ్రత్ ఫాతెమా హజ్రా(స.అ) షహాదత్ రోజుల్లో ఇంత పెద్ద ఎత్తున ఫాతెమియా చేయ్యాల్సినవసరం ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ....
ఇంతకు ముందు చెప్పబడిన రెండు ముఖ్యమైన రివాయతులు మరియు అలాగే ఇలాంటి మరెన్నో రివాయతులలో ఇమామ్ పట్ల జ్ఞానం లేకుండా మరణించడం అజ్ఞానపు మరణం అని సూచించబడి ఉంది, మానవాళి లక్ష్యం అనగా అల్లాహ్ పట్ల జ్ఞానం నుండి దూరం అవ్వడానికి కారణం అవుతుంది అందుకని నిజమైన ఇమామ్ యొక్క ఎరుక మానవాళి విముక్తికి చాలా ముఖ్యమైన మూలం. దీని పట్ల నిర్లక్ష్యం చాలా పెద్ద నష్టానికి కారణం అవుతుంది అందుకని ఈ సమస్యలో మన బాధ్యతను నిర్వర్తించడం వివేకమైన మరియు షరాపరమైన కర్తవ్యం. నిజమైన ఇమామ్ పట్ల ఎరుక మరియు జ్ఞానం ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) మరియు పవిత్ర ఇమాముల హదీసులే కాకుండా హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క చరితము, ఆమె ప్రయత్నాలు మరియు ఆమె చరిత్ర ద్వార బాగా తెలుస్తాయి, అందుకని ఆమె జీవిత చరిత్రను తెలుసుకోవడం కూడా మనందరి బాధ్యత.
శత్రువుల కపట మాటలకు గురి అయిన వారు లేదా అమాయకులు మరియు యదార్థాన్ని అంగీకరించాలనుకోని వారు ఇది ఒక చారిత్ర్మిక సంఘటన, చరిత్రలో చరిగింది మరియు పూర్తయిపోయింది ఇప్పుడు వాటిని త్రవ్వి తీయడం వల్ల ఉపయోగమేమిలేదు, అవసరం కూడా లేదు ఉదాహారణకు మన పూర్వీకులు 14 వందల క్రితం ఒక సమస్య పై దెబ్బలాడుకున్నారు ఇప్పుడు కూడా దాని గురించి దెబ్బలాడుకోవడం మంచిది కాదు, అంటే చెప్పాలనుకున్న విషయమేమిటంటే ఈ ఫాతెమియా సమస్య కూడా అంతే ఇప్పుడు దీని గురించి మాట్లడుకోవడం కూడా ఉపయోగం లేని పని మరియు అవసరం లేని సమస్య.
వీళ్లకు మనం ఇచ్చే సమాధానం ముందుగా చెప్పేదేమిటంటే మేము ఎవరితో దెబ్బలాడం, మేము ఐక్యమత్య ద్వజాన్ని ఎత్తుకొని ఉన్నవాళ్లము, ఉమ్మత్ లో ఎక్కువగా ఐక్యమత్య ప్రచారం చేసేవాళ్లం మేమే. మీరు ఈ వంకతో మానవ చరిత్ర యొక్క అతి పెద్ద మార్గభ్రష్టత మరియు ఇప్పటికీ దాని ప్రభావాలు ఉన్నటువంటి మరియు దాని వల్ల ఇస్లాంకు ఎన్నో కష్టాలు వచ్చినటువంటి సమస్యను కప్పిపెట్టే ప్రయత్నం అది కూడా ఇది వాళ్ల సొంత విషయాల దెబ్బలాట అని లేదా కుటుంబ తగాదాలని, ప్రపంచానికి తెలియకుండా కప్పిపెట్టాలనుకోవడం, నిజాన్ని బయటకు రాకుండా ప్రయత్నించడం ఇది సరికాదు.
ఇబ్నె తైఫూర్, బలాగతున్ నిసా; హసన్ ఇబ్నె సులైమాన్ హిల్లీ, ముఖ్తసరు బసాయిరిద్ దరజాత్, పేజీ456; సయ్యద్ ముర్తజా, అల్ షాఫీ ఫిల్ ఇమామహ్, భాగం4, పేజీ71.
جَعَلَ اللهُ الاِیمانَ تَطْهیراً لَکُمْ مِنَ الشِّرْکِ، وَ الصَّلاةَ تَنْزیهاً لَکُمْ عَنِ الْکِبْرِ، وَ الزَّکاةَ تَزْکِیَةً لِلنَّفْسِ، وَ نَماءً فِی الرِّزْقِ، وَ الصِّیامَ تَثْبِیتاً لِلاِخْلاصِ، وَ الْحَجَّ تَشْیِیداً لِلدِّینِ، وَ الْعَدْلَ تَنْسِیقاً لِلْقُلُوبِ، وَ طاعَتَنا نِظاماً لِلْمِلَّةِ، وَ اِمامَتَنا اَماناً مِنَ الْفُرْقَةِ [لِلْفُرْقَةِ]، وَ الْجِهادَ عِزاً لِلاِسْلامِ، وَ الصَّبْرَ مَعُونَةً عَلَى اسْتِیجابِ الاَجْرِ وَ الاَمْرَ بِالْمَعْرُوفِ مَصْلَحَةً لِلْعامَّةِ وَ بِرَّ الْوالِدَیْنِ وِقایَةً مِنَ السُّخْطِ وَ صِلَةَ الاَرْحامِ مَنْماةً لِلْعَدَدِ وَ الْقِصاصَ حَقْناً لِلدِّماءِ وَ الْوَفاءَ بِالنَّذْرِ تَعْرِیضاً لِلْمَغْفِرَةِ وَ تَوْفِیَةَ الْمَکایِیلِ وَ الْمَوازِینِ تَغْیِیراً لِلْبَخْسِ وَ النَّهْیَ عَنْ شُرْبِ الْخَمْرِ تَنْزِیهاً عَنِ الرِّجْسِ وَ اجْتِنابَ الْقَذْفِ حِجاباً عَنِ اللَّعْنَةِ وَ تَرْکَ السَّرِقَةِ اِیجاباً لِلْعِفَّةِ وَ حَرَّمَ اللهُ الشِّرْکَ اِخْلاصاً لَهُ بِالرُّبُوبِیَّةِ۔
వ్యాఖ్యానించండి