అబద్ధం ఇస్లాం దృష్టిలో

శని, 02/03/2024 - 03:56

అబద్ధం యొక్క యదార్థం మరియు అందులో ఉన్న లోపాల పై సంక్షిప్త వివరణ... 

అబద్ధం ఇస్లాం దృష్టిలో

అబద్ధం అనగ అసత్యం, యదార్ధానికి వ్యతిరేకమైన విషయం మరియు తప్పుడు మాటలు. అబద్ధం మహా పాపం, అబద్ధాన్ని ఇస్లాం నిషేదిస్తుంది. అబద్ధం చెప్పడం సరికాదు అని ప్రతీ వివేకి సమ్మతిస్తాడు, అంతేకాదు అబద్ధం చెబుతున్నవాడికి కూడా తను చేస్తుంది సరికాదు అని తెలుస్తుంది అయినా తన స్వార్ధం కోసం అబద్ధం చెబుతూ ఉంటాడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనిషి తన స్వార్ధం కోసం ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటాడు కాని దాంతో ఎదుటివారికి ఎంత నష్టం కలుగుతుందో మరి ఆ అబద్ధం వలన తన ఆత్మపై ఎంత చెడు ప్రభావం పడుతుందో అర్ధం చేసుకోవడం లేడు. నిజానికి అబద్ధం మధ్యపానం కన్నా నీఛమైనది.
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) ప్రవచనం: “అల్లాహ్ దౌష్ట్యానికి తాళాలు నిశ్చయించి ఉంచాడు, ఆ తాళానికి మధ్యం తాళం చెవి(లాంటిది), మరి అబద్ధం ఆ మధ్యం కన్నా నీఛమైనది”.[1]

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను: జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్ కు చెందుతుంది. ఎవరైతే అల్లాహ్ ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్ సానిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్ళను ఆరాధిస్తున్నామని” అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోను సన్మార్గం చూపడు.[సూరయె నూర్, ఆయత్7]
అల్లాహ్ ఖుర్ఆన్ లో అబద్ధం చెప్పినవారు సాఫల్యం పొందలేరని, వారికి వ్యధాభరితమైన శిక్ష ఉందని మరియు వారికి సన్మార్గం చూపడని వివరించాడు.
అల్లాహ్ నహ్ల్ సూరహ్ లో ఇలా ప్రవచించెను: “ఏ వస్తువునైనా తమ నోటితో ‘ఇది ధర్మసమ్మతం’ అని, ‘ఇది నిషిద్ధమనీ’ ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి, అల్లాహ్ కు అబద్దాలు ఆపాదించకండి. అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు”[సూరయె నహ్ల్, ఆయత్116]
దాని తరువాతి ఆయత్ లో ఇలా ప్రవచించెను: “వారికి లభించే ప్రయోజనం బహుస్వల్పం. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది”[సూరయె నహ్ల్, ఆయత్117]
అల్లాహ్ జుమర్ సూరహ్ లో ఇలా ప్రవచించెను: అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోను సన్మార్గం చూపడు”[సూరయె జుమర్, ఆయత్3]
అబద్ధం చెప్పే వారిపై అల్లాహ్ శాపం ఉంటుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: ‘ఒకవేళ తాను చెప్పేది అబద్ధమైతే తనపై అల్లహ్ శాపం పడుగాక!’ అని చెప్పాలి[సూరయె నూర్, ఆయత్7]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “అబద్ధానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అబద్ధం దురాచారం, దుర్మార్గాల వైపుకు పిలుస్తుంది, మరి దుర్మార్గం నరకం వైపుకు”[2]
మరో చోట దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించెను: “మనిషి అబద్ధం చెప్పినప్పుడు అతడి నుండి వచ్చే దుర్వాసన వల్ల దైవదూత అతడి నుండి ఒక మైలు దూరం వెళ్ళిపోతాడు”[3]
దైవప్రవక్త ఉల్లేఖనం: “కపటం యొక్క ద్వారముల నుండి ఒక ద్వారం అబద్ధం”[4]
ఈ హదీసుల ద్వార మనకు తెలిసే విషయమేమిటంటే., అబద్ధం మనిషికి నరకానికి పంపుతుంది, ఇంకా వివరంగా చెప్పాలంటే అబద్ధం ముందు మనకు మర్గభ్రష్టతకు గురి చేసి మన నుండి దైవదూతలు దూరమయ్యేలా చేస్తుంది. అబద్ధం చెప్పేవారు కూడా కపటవర్తనులతో సమానం అల్లాహ్ కపటవర్తనులను నరకవాసులుగా ఖుర్ఆన్ లో సూచించాడు.  
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “అల్లాహ్ దృష్టిలో అతి నీఛమైన పాపం అబద్ధం”[5]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “అబద్ధం చెప్పేవ్యక్తి పై ప్రజల నమ్మకం తగ్గుతుంది”[6] దీనికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పనివారి మాటను ప్రజలు నమ్ముతారు”[7]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: “అబద్ధమాడువారితో స్నేహం చేయకండి (వాళ్ళతో స్నేహం) ఎండమావిలాంటిది, దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా మరియు దగ్గరగా ఉన్నదాన్ని దూరంగా చేసి చూపిస్తారు(మార్గభ్రష్టులు చేస్తారు)[8]
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఉల్లేఖనం: “మనసు కోరినా సరే వివేకవంతుడు అబద్ధమాడడు”[9]

అబద్ధం చెప్పడం మానేయండి
ఒకరోజు ఒకవ్యక్తి దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నేను నమాజ్ చదవను, పవిత్రతకు భిన్నమైన పని చేస్తాను మరియు అబద్ధం చెబుతాను, దేన్ని ముందుగా వదిలేయాలీ?” దైవప్రవక్త(స.అ) “అబద్ధం చెప్పడాన్ని” అని అన్నారు. అతడు దైవప్రవక్త(స.అ) ముందు ఇక ఎప్పూడూ అబద్ధం చెప్పను అని ప్రమాణం చేశాడు. అక్కడ నుండి బయటకు వచ్చిన తరువాత తప్పుడు పని చేయడానికై షైతాన్ మనసులో ఆశను రేపాడు, వెంటనే అతడినికి అనిపించింది ఒకవేళ మరుసటిరోజు గనక దైవప్రవక్త(స.అ) దీని గురించి నన్ను ప్రశ్నిస్తే!, చేయలేదు అని చెబితే అబద్ధమౌతుంది, ఒకవేళ చేశానని చెబితే నాపై హద్(శిక్ష) జారీ అవుతుంది. ఇదే విధంగా అతను మరెన్నో దుష్టకార్యముల నుండి దూరమయ్యి చివరికి పూర్తిగా పాపములకు దూరమయ్యాడు.[10]

రిఫ్రెన్స్
1. మర్హూమ్ కులైనీ, ఉసూలె కాఫీ, భాగం3, పేజీ339.
انَّ اللّهَ عَزَّ وَ جَلَّ جَعَلَ لِلشّرِّ اَقْفالا وَجَعَلَ مفاتیحَ تِلْکَ الاَْقْفالِ اَلشَّرابَ، وَ الْکِذْبُ شَرٌّ مِنَ الشَّرابِ
2. ముత్తఖియె హిందీ, కన్జుల్ ఉమ్మాల్, హదీస్8219.
3. షర్హె నెహ్జుల్ బలాగహ్, ఇబ్నెఅబిల్ హదీద్, భాగం6, పేజీ357.
4. ముత్తఖియె హిందీ, కన్జుల్ ఉమ్మాల్, హదీస్8212.
5. అల్ మహ్జతుల్ బైజా, భాగం5, పేజీ243.
6. షర్హె గురర్, భాగం5, పేజీ390.
7. షర్హె గురర్, భాగం5, పేజీ461.
8. నెహ్జుల్ బలాగ్, కలేమాతె ఖిసార్, కలమా38.
9. బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ305.
10. ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, భాగం11, పేజీ413.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 18 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 54