ఇబ్నె ఖుతైబహ్ ఉల్లేఖనం సత్యం

బుధ, 02/14/2018 - 19:44

.“ఇబ్నె ఖుతైబహ్” తన గ్రంథంలో ఉల్లేఖించిన అబూబక్ర్ ఆదేశం ప్రకారం ఉమర్, ఫాతెమా జహ్రా[స.అ] ఇంటికి వెళ్ళి బైఅత్ చేయకపోతే ఇంటిని తగలబెడతానని బెదిరించిన సంఘటన సరైనది.

ఇబ్నె ఖుతైబహ్ ఉల్లేఖనం సత్యం

అబూబక్ర్ ఆదేశం ప్రకారం ఉమర్, ఫాతెమా జహ్రా[స.అ] ఇంటికి వెళ్ళి బైఅత్ చేయకపోతే ఇంటిని తగలబెడతానని బెదిరించిన సంఘటనను “ఇబ్నె ఖుతైబహ్” తన గ్రంథంలో ఉల్లేఖించారు[అల్ ఇమామతు వస్సియాసహ్, పేజీ12]. మరియు ఆ తరువాత అలీ[అ.స] “ఒకవేళ నేను బైఅత్ చేయకుంటే?” అని చెప్పినప్పుడు వారి తలను నరుకుతాం అని కూడా అన్నారు, ఉల్లేఖించారు.
నిస్సందేహంగా చరిత్ర యొక్క ఈ అధ్యాయం షైఖైన్(అబూబక్ర్ మరియు ఉమర్)లను ఇష్టపడే వారి కోసం జీర్ణం కాదు మరియు వారు అంగీకరించలేరు. అందుకని కొందరు “ఇబ్నె ఖుతైబహ్” యొక్క గ్రంథం పట్ల సందేహాన్ని వ్యక్తం చేశారు, నిజానికి చరిత్రలో యోగ్యత గల “ఇబ్నె అబిల్ హదీద్” ఈ గ్రంథాన్ని “ఇబ్నె ఖుతైబహ్” వ్రాసిన గ్రంథాల నుండి ఒకటిగా భావిస్తారు. మరియు దాని నుండి ఎన్నో విషయాలను ఉల్లేఖిస్తారు. కాని ఖేదించదగ్గ విషయమేమిటంటే ఈ గ్రంథం ప్రక్షిప్తం మరియు లేఖదోషమునకు గురి అయ్యింది మరియు దాని నుండి కొన్ని అంశాలను తొలగించి ప్రింటు చేయబడింది, అయినప్పటికీ ఆ అంశాలన్నీ ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనలను సంగ్రహించి వ్రాయబడిన “నెహ్జుల్ బలగహ్” గ్రంథాన్ని వ్యాఖిస్తూ రచించిన “ఇబ్నె అబిల్ హదీద్” గ్రంథంలో ఉన్నాయి. “ఇబ్నె అబిల్ హదీద్” అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ రచయిత.
అలాగే “జర్కలీ” తన గ్రంథం “అఅలామ్”లో ఈ గ్రంథాన్ని “ఇబ్నె ఖుతైబహ్” గ్రంథంగా భావిచారు.[మొజమ్, అల్ మత్బూఆతుల్ అరబియ్యాహ్, భాగం1, పేజీ212]

రిఫ్రెన్స్

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
17 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21