ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 8వ నెల అయిన షాబాన్ మాసంలో జరిగిన సంఘనల వివరణ...
ఇస్లామీయ క్యాలండరు ప్రకారం షాబాన్ మాసం 8వ మాసం. ఇది చాలా ప్రాముఖ్యతగల మాసం. ఈ మాసం గురించి దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “شَعْبانُ شَهری; షాబాన్ నా మాసము” దైవప్రవక్త ఈ హదీస్ ద్వారానే మీరు ఈ మాసం ప్రత్యేకతను తెలుసుకోగలరు.
2వ తేదీ:
1. ఉపవాసాలు వాజిబ్ అయిన రోజు: షాబాన్ యొక్క రెండవ తేదీ, 2వ హిజ్రీలో రమాజాన్ మాసం యొక్క ఉపవాసాలు వాజిబ్ అయ్యాయి.
2. మొఅతజె అబ్బాసీ మరణించిన రోజు: హిజ్రీ యొక్క 255వ ఏట ఇమామ్ అలీ నఖీ(అ.స) ను హతమార్చమని ఆదేశించిన మొఅతజ్ మరణించిన రోజు.
3వ తారీఖు:
హిజ్రీ యొక్క 4వ సంవత్సరంలో సయ్యదుష్ షుహదా హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స) జన్మించారు.
4వ తారీఖు:
హిజ్రీ యొక్క 26వ సంవత్సరంలో హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్[అ.స] జన్మించారు.
5వ తారీఖు:
హిజ్రీ యొక్క 37వ సంవత్సరంలో ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] జన్మించారు.
9వ తారీఖు:
ఈ రోజు ఇమామ్ హుసైన్(అ.స) జన్మించి 7 రోజులు అయ్యాయి, దైవప్రవక్త(స.అ) తన కుమారుడి కోసం గొర్రెను ఖుర్బానీ ఇచ్చి అఖీఖహ్ చేశారు. ఆ తరువాత వారి తల వెంట్రుకలు గీసి దానికి సమానంగా వెండిని సద్ఖా ఇచ్చారు.
10వ తారీఖు:
ఇమామె జమానహ్(అ.స) యొక్క ప్రతినిధి అయిన అబూ జాఫరె సమరీ ఈరోజు తన మరణానికి ఆరు రోజుల ముందు ఇమామ్ నుండి షియాల కోసం తౌఖీహ్(ఉత్తరం) తీసుకొని వచ్చారు.
11వ తారీఖు:
హజ్రత్ అలీ అక్బర్(అ.స) యొక్క జన్మదినం, హిజ్రీ యొక్క 33వ సంవత్సరంలో దైవప్రవక్త(స.అ) పోలికలతో ఇమామ్ హుసైన్(అ.స) ఇంట హజ్రత్ అలీ అక్బర్(అ.స) జన్మించారు.
15వ తారీఖు:
హిజ్రీ యొక్క 250వ సంవత్సరంలో ఇమామె జమానా హజ్రత్ హుజ్జత్ ఇబ్నిల్ హసన్(అ.స) జన్మించారు.
18వ తారీఖు:
ఇమామె జమానహ్(అ.స) యొక్క మూడవ ప్రతినిధి అయిన హుసైన్ ఇబ్నె నౌబఖ్తీ, హిజ్రీ యొక్క 366వ సంవత్సరం బగ్దాద్ లో మరణించారు వారిని అక్కడే సమాధి చేశారు.
19వ తేదీ:
బనీ ముస్తలహ్ యుద్ధం; హిజ్రీ యొక్క 6వ ఏట ముస్లిములు వెయ్యి మంది బనీ ముస్తలహ్ (మదీనహ్ మరియు మక్కా మార్గంలో ప్రదేశం) యుద్ధాని వెళ్లారు మరియు విజయం సాధించి తిరిగి వచ్చారు.
మిగత రోజుల్లో జరిగిన సంఘటనలు
1. షాబాన్ మాసంలో హిజ్రీ యొక్క 45వ ఏట హఫ్సహ్ మరణం సంభవించింది.
2. బనీ సఅద్ తో దైవప్రవక్త(స.అ) యుద్ధం: షాబాన్ యొక్క 6వ హిజ్రీ లో దైవప్రవక్త(స.అ) హజ్రత్ అలీ(అ.స)తో 100 మంది సైన్యంతో బనీ సఅద్ సమూహంతో యుద్ధానికి పంపించారు, శత్రు సైన్యానికి ఈ వార్త అందడంతో వారు పారిపోయారు మరియు ఇమామ్ అలీ(అ.స) సైన్యం గనాయత్ తో మదీనహ్ కు తిరిగి వచ్చారు.
3. సయీద్ బిన్ జబీర్ వీరమరణం: షాబాన్ మాసంలో హిజ్రీ యొక్క 95వ ఏట ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క సహాబీ అయిన సయీద్ ఇబ్నె జబీర్, హజ్జాజ్ ఇబ్నె యూసుఫె సఖఫీ ఉత్తర్వుల ద్వార చంపబడ్డారు. ఇదే హజ్జాజ్ యొక్క చివరి హత్య ఆ తరువాత 15 నుంటి 20 రోజుల లోపే మరణించాడు.
4. ముగైరహ్ ఇబ్నె షఅబహ్ మరణం: షాబాన్ మాసంలో 50వ ఏట ముగైరహ్ ఇబ్నె షఅబహ్(మలూన్) మరణించాడు.
ఇతడు చేసిన పనులు:
- దైవప్రవక్త(స.అ) ను చంపాలని ఆలోచనలు కలిగి ఉండేవాడు.
- సఖీఫహ్ లో ఉన్నవాడు.
- ఇమామ్ అలీ(అ.స) ఇంటి పై దాడి చేసినవాళ్ళలో ఉన్నాడు, నిప్పంటించినవాళ్ళలో ఒకడు, హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ)ను కష్టం కలిగించినవాళ్లలో ఒకడు, మొహ్సిన్ ను చనిపోవడానికి గల కారణం అయిన ఒక్కడు.
- మూఆవీయా అధికారంలో ఇమామ్ అలీ(అ.స) ను దూషించేవాడు.
- ప్రముఖ వ్యభిచారుల నుండి ఒకడు.
- తప్పుడు హదీసులను తయారు చేయువాడు.
- అహ్లెబైత్(అ.స) కు వ్యతిరేకంగా ఉండేవాళ్లలో అతి కొంతమందిలో ఒకడు. కుఫాకు అధికారిగా ఉండేవాడు.
రిఫరెన్స్
https://erfan.ir/farsi/95888.html
వ్యాఖ్యానించండి