.
ప్రశ్న: ఒకవేళ స్థిరంగా ఉన్న ట్యాంకు నీళ్లలో కొన్ని రక్తం బొట్లు పడిపోయాయి మరియు ఆ ట్యాంకు నీళ్లు కూడా కుర్ అయి ఉంటే దాని పట్ల ఆదేశామేమిటి?
సమాధానం: ఆ నీళ్లు మలినం కాదు. అయితే ఒకవేళ ఆ కుర్ నీళ్ల రంగు రక్తం ద్వార మారిపోయి ఉంటే ఆ నీళ్లు మలినం(నజస్) అవుతాయి.
ప్రశ్న: ఒకవేళ చిన్న పాత్రలో పడిపోతే?
సమాధానం: ఆ పాత్ర నజిస్ అవుతుంది.
ప్రశ్న: ఒకవేళ పారే నీళ్లు(జారీ నీళ్లు) ఆ పాత్ర పై పోస్తే మరియు ఆ (పాత్రలో ఉన్న) నీళ్లు తన మొదటి స్థితికి తిరిగి వచ్చేస్తే, ఇటువంటి పరిస్థితిలో దాని గురించి ఏమని చెప్పబడి ఉంది?
సమాధానం: ఆ పాత్ర లో ఉన్న నీళ్లు శుభ్రమౌతాయి, కాని ఒకవేళ ఆ పారే(జారీ) నీళ్లు కట్టివేయబడితే ఆ నీళ్ల రంగు మరలా మారిపోతే అది మరలా నజిస్(మలినం) అవుతుంది.
ప్రశ్న: ఒకవేళ చెంబులో ఉన్న నీళ్లు మలినం(నజాసత్) పై పడితే ఆ చెంబులో ఉన్న నీళ్లు నజిస్ అవుతాయా?
సమాధానం: ఏమాత్రం కాదు, ఎందుకంటే మలినం పైనుంచి పడుతున్న చెంబు నీళ్ల పై తన ప్రభావం చూపించదు. అంటే పైనుంచి పడుతున్న నీళ్లు గానీ లేదా చెంబులో ఉన్న నీళ్లు గానీ నజిస్ కావు.
ప్రశ్న: నజిస్ అయిన వస్తువులను వర్షం నీళ్లు ఎలా శుభ్రపరుస్తాయి?
సమాధానం: వర్షం యొక్క నీరు పడినప్పుడు, అది నజిస్ నెల కానివ్వండి లేదా బట్టలు మరియు కార్పేట్(ఫర్ష్) కానివ్వండి, అవి వర్షం నీరు పీల్చుకున్న తరువాత (అవి శుభ్రమౌతాయి). అలాగే పాత్రలు కానివ్వండి లేదా అలాంటివి ఏమైనా కానివ్వండి వాటిపై వర్షం కురిసింది అని చెప్పబడాలి అంతే గాని వర్షపు కొన్ని చుక్కలు పడితే దీన్ని వర్షం కురిసింది అని అనరు.(అలాంటి సమయంలో నజిస్ అయిన వస్తువులు శుభ్రం కావు).
ప్రశ్న: వస్తువుల పై ఒక్క సారి వర్షం నీరు కురిస్తే ఆ వస్తువులు కూడా శుభ్రమైపోతాయా?
సమాధానం: ఔను అవి శుభ్రమైపోతాయి ఒక్క మూత్రం ద్వార నజిస్ అయిన దేహం మరియు బట్టలు తప్ప, వాటిని రెండు సార్లు ఉతకడం అవసరం.
ప్రశ్న: వర్షం నీటితో నజిస్ నీరు కూడా శుభ్రమైపోతాయా?
సమాధానం: ఔను, అవి వర్షం యొక్క శుభ్రమైన నీటితో కలిసిపోతే(శుభ్రమైపోతాయి)
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి