నీళ్లతో ఏ వస్తువును ఎలా శుభ్రపరచాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
ప్రశ్న: నజిస్ వస్తువులను ఖలీల్ లేదా కసీర్ నీళ్లతో ఎలా శుభ్రం చేయాలి?
సమాధానం: ప్రతీ నజిస్ వస్తువును శుభ్రం చేయడానికి మేము దానిని నీళ్లతో ఒక సారి కడుగుతాము అది ఖలీల్ నీళు కానివ్వండి లేదా కసీర్ నీళ్లు కానివ్వండి, కాని ఖలీల్ నీళ్ల ద్వార కడగేటప్పుడు మలినాన్ని దూరం చేసే శుభ్రమైన నీళ్లు వేరు అవ్వాలి అనగా దాన్ని పిండాలి.
ప్రశ్న: ఇలా చేయడం ద్వార నజిస్ వస్తువులన్నీ శుభ్రమౌతాయా?
సమాధానం: ఔను, కొన్ని వస్తువులు తప్ప. అవి..
1. మద్యం ద్వార నజిస్ అయిన పాత్ర ఉదాహారణకు గ్లాసు మరియు గిన్నెలు మొ వాటిని మూడు సార్లు కడగాలి.
2. ఎలుక పడి చనిపోయిన పాత్రలు మరియు పంది నాకిన పాత్రలను ఏడు సార్లు కడగాలి.
3. ఇంకా ఆహారం మొదలు పెట్టని, పాలు త్రాగే బాబు మూత్రం ద్వార నజిస్ అయిన వస్తువులు మరియు అలాగే పాలు త్రాగే పాప మూత్రం ద్వార నజిస్ అయిన వస్తువుల పై అవి తడిసిపోయేంతగా నీళ్లు వేయాలి, అంతకు మించి అవసరం లేదు. ఒకవేళ బట్టలు నజిస్ అయితే వాటిని పిండాల్సినవసరం లేదు.
4. కుక్క తన నాలుకతో నాకిన పాత్రలు. పాత్రల నుండి ఏదైనా తిన్నా లేదా త్రాగినా ముందుగా వాటిని మట్టితో తోమాలి ఆ తరువాత రెండు సార్లు నీళ్లతో కడగాలి. ఒకవేళ ఆ పాత్రలో కుక్క ఉమ్ము పడిన లేదా దానిని తాకినా ముందుగా ఆ పాత్రను మట్టితో తోమి ఆ తరువాత నీళ్లతో మూడు సార్లు కడగాలి.
ప్రశ్న: కుక్క యొక్క ఉలూగ్ అనగానేమి?
సమాధానం: కుక్క తన నాలుకతో పాత్రను నాకడం.
5. మూత్రం ద్వార నజిస్ అయిన బట్టలను జారీ నీళ్ల(పారే నీరు) లో ఒక సారి ఉతకాలి, లేదా వాటిని కుర్ నీళ్లలో లేదా ఖలీల్ నీళ్లలో రెండు సార్లు ఉతకాలి మధ్యలో ఒకసారి పిండాలి. ఒకవేళ బట్టలు మూత్రంతో కాకుండా వేరే ఏదో వాటి ద్వార నజిస్ అయితే వాటిని ఖలీల్ నీళ్లలో ఉతికి పిండాలి లేదా కసీర్ నీళ్లతో పిండ కుండా ఒకసారి కడగాలి.
6. మూత్రం ద్వార దేహం నజిస్ అయితే దీన్ని కూడా పై చెప్పబడిన నజిస్ బట్టలను శుభ్రపరచే విధంగా శుభ్రం చేయాలి. ఒకవేళ దేహాన్ని ఖలీల్ నీళ్లతో కడుగుతున్నట్లైతే దేహం నుండి వేరు అయ్యే నీరు పూర్తిగా దూరం అవ్వాలి.
7. ఒకవేళ పాత్ర యొక్క లోపలి భాగం మద్యం కాకుండా వేరే వాటి ద్వార నజిస్ అయితే లేదా కుక్క ఆ పాత్ర నుండి ఏదైనా తిన్నా లేదా దాన్ని నాకినా, లేదా ఉమ్ము దానిలో వేసినా, లేదా తన దేహం యొక్క ఏదో ఒక భాగంతో తాకినా, లేదా ఎలుక అందులో పడి చచ్చినా, లేదా పంది అందులో నుండి ఏదైనా తిన్నా త్రాగినా దాన్ని ఖలీల్ నీళ్ల ద్వార మూడు సార్లు శుభ్ర పరచాలి, లేదా కసీర్ నీళ్లు లేదా పారే నీళ్లు(జారీ పానీ) లేదా వర్షం నీళ్ల తో అయినా సరే మూడు సార్లు శభ్ర పరచాలి.
ప్రశ్న: ఒకవేళ పాత్ర యొక్క ఉపరిభాగం నజిస్ అయితే ఏమి చేయాలి?
సమాధానం: అయితే దాన్ని ఖలీల్ నీళ్లతో ఒకసారి కడగాలి.
ప్రశ్న: ఒకవేళ నా చేయ్యి నజిస్ అయి నా వద్ద ఖలీల్ నీళ్ల ఉంటే నా చేయిని ఎలా శుభ్రపరచుకోవాలి?
సమాధానం: ఒకవేళ నీ చెయ్యి మూత్రం ద్వార నజిస్ కాకుండా వేరే వాటి ద్వార నజిస్ అయితే, దాని పై ఎలా నీళ్లు వేయాలంటే వేసిన తరువాత ఆ నీళ్లు చేయి పై ఉండకూడదు. అలా నీ చేయి శుభ్రమౌతుంది.
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి