నజాసాత్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు సూత్రాల సంక్షిప్త వివరణ...
ఇస్లాం షరా ప్రకారం ఈ పది అంశాలు అపవిత్రమైనవి: 1. మూత్రము, 2. మలవిసర్జనము, 3. వీర్యం, 4. మృతదేహం, 5. రక్తం, 6. కుక్క, 7. పంది, 8. అవిశ్వాసి, 9. మద్యం, 10. అపవిత్రమైన వాటిని తిన్న జంతువుల చెమట.
పై చెప్పబడిన పది విషయాలే స్వభావపరంగా నజిస్ మరియు అశుద్ధమైనవి. ఇవి తడిగా ఉన్న వస్తువులు వాటికి తాకితే, తాకబడిన వస్తువులు నజిస్ అవుతాయి.
ప్రశ్న: ఒకవేళ రెండూ(ముట్టుకునేది మరియు ముట్టబోయేది) కూడా తడిగా లేకపోతే?
సమాధానం: తడి మరియు తేమ లేకపోతే అవి నజిస్ అవ్వవు, ఎందుకంటే తడి లేకపోతే లేదా కొద్దిగా తడిగా ఉన్నా నజాసత్ చేరదు.
ప్రశ్న: హలామ్ మాంసం కలిగి ఉన్న జంతువులు ఉదా: ఆవు, మేక, కోడి మరియు వివిధ పక్షులు మొ॥ ఇవి శుభ్రమైనవేనా(పాక్) లేదా అశుభ్రమైనవా(నజిస్)?
సమాధానం: ఇవి పాక్(శుద్ధమైనవి)
ప్రశ్న: బ్యాట్(ఖుఫ్ఫాష్-చింగాదడ్) యొక్క రెట్ట(మలమూత్రాలు)?
సమాధానం: పాక్
ప్రశ్న: మృతదేహం యొక్క వెంట్రుకలు, ఉన్ని, గోళ్లు, కొమ్ములు, ఎముకలు, పళ్లు, ముక్కు, పంజా మొ॥ పాకా లేదా నజిసా?
సమాధానం: అన్నీ పాక్ మరియు శుద్ధమైనవే.
ప్రశ్న: మేము తినడానికి మాంసం కొన్నాము అయితే దానిపై రక్తం ఉంది, దాన్నేంచేయాలి?
సమాధానం: ఈ రక్తం శుద్ధమైనదే(పాక్). షరా పరంగా జపా చేసిన తరువాత జపా చేయబడ్డ జంతువులో మిగిలి ఉండే రక్తం శుద్ధమైనది(పాక్), అది నజిస్ కాదు.
ప్రశ్న: అడవి మరియు ఇంటి ఎలుకల రెట్టల గురించి ఆదేశం ఏమిటి?
సమాధానం: అవి నజిస్. ఈ ఎలుకలలో (జహిందా సిర) ఉండే రక్తనాళాలు ఉంటాయి వాటిని కోసేటప్పుడు రక్తం వేగంగా బయటకు వస్తుంది.
తెలుసుకోవలసిన కొన్ని సూత్రాలు:
మొదటి సూత్రం:
“کل شئی کان طاهرا فیما مضی ثم تشک” ఒక వస్తువు ముందు పాక్ గా ఉంది కాని తరువాత నజిసా లేదా ఇంతకు ముందులానే పాక్ గానే ఉందా అని సందేహం ఏర్పడింది. అలాంటి సమయంలో అది పాక్ అవుతుంది. ఉదాహారణకు మీరు పడుకునే మంచం ముందు పాక్ గా ఉంది, ఇప్పుడు మీకు సందేహం ఏర్పడింది నజాసత్ ద్వార ఇది అశుద్ధమయ్యిందా లేక ముందు ఎలా శుద్దంగా ఉండిందో అలాగే ఉందా? అని. అలాంటప్పుడు నీవు పడుకునే మంచం పాక్ మరియు శుద్ధమైనదే అని భావించాలి.
రెండవ సూత్రం:
“”کل شئی کان نجسا فیما مضی ثم تشک ఒక వస్తువు ముందు నజిస్ గా ఉంది కాని తరువాత సందేహం ఏర్పడింది ఇది పాక్ అయ్యిందా లేక ఇంతకు ముందులానే నజిస్ గానే ఉందా అని. అలాంటి సమయంలో దానిని నజిస్ గానే భావించాలి. ఉదాహారణకు నీ చెయ్యి నజిస్ అయ్యింది. నీకు పూర్తి నమ్మకం కూడా ఉంది నా చెయ్యి నజిస్ అని. ఆ తరువాత నీకు సందేహం ఏర్పడింది మునుపటి నజాసత్ నుండి శుద్ధమయ్యిందా లేక అశుద్ధంగానే ఉందా అని. అలాంటప్పుడు నువ్వు నీ చెయ్యి నజిస్ అని భావించాలి.
మూడవ సూత్రం:
“کل شئی لا تعلم حالتها السابقه” ఒక వస్తువు ఇంతకు ముందు అది ఏ స్థితిలో ఉందో తెలియదు. అది నజిసా లేక పాకా అని తెలియదు అలాంటి సమయంలో దానిని పాక్ గానే భావించాలి. ఉదాహారణ: ఒక కప్పులో ఒక పారే ద్రవం ఉంది దాని గురించి నీకు తెలియదు ఇది ఇంతకు ముందు నజిసా లేదా శుద్ధమైనదా అని? అలాంటప్పుడు ఇది పాక్ మరియు శుద్ధమైనది గా భావించాలి.
నాలుగొవ సూత్రం:
“کل شیء تشکّ، هل أصابته نجاسة فتنجّس بها أو أخطأته فلم تُصِبه” ఏ వస్తువు గురించి అయితే దానికి నజాసత్ అంటుకుందా లేదా అన్న సందేహం కలిగినప్పుడు అది శుభ్రమైనదే(నజిస్ కాదు) అని భావించాలి. ఇక దాని శుభ్రత పై నమ్మకం కలగడానికి దాని గురించి పరిశోధనలు మరియు పరిశీలనలు చేయాల్సిన అవసరం లేదు. అది శుభ్రమైనది అని చెప్పబడుతుంది. మీకు పరిశీలన చేయడం శులభమైనా సరే పరిశీలనవసరం లేదు. ఉదాహారణకు నీ బట్టలు శుభ్రమైనవి అని నీకు ముందు నుంచి నమ్మకం ఉంది. ఇక ఇప్పుడు దాని పై మూత్రము చక్కలు పడ్డాయా లేక ఇంతకు ముందు శుభ్రంగా ఉన్నట్లే ఉన్నాయా? అని సందేహం కలిగింది. ఇలాంటి పరిస్థితిలో నీ బట్టల గురించి పరిశీలన చేయడం అవసరం లేదు, ఒక వేళ పరిశోధన చేయడానికి వీలు ఉన్నా సరే. ఇలాంటప్పుడు “నా బట్టలు శుభ్రమైనవి” అని భావించాలి.
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, నజాసాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి