మనిషి సృష్టి పై హజ్రత్ అలీ[అ.స] వివరణ

శని, 03/03/2018 - 12:32

అల్లాహ్ మనిషిని ఎలా సృష్టించాడు అన్న విషయాన్ని దైవప్రవక్త[స.అ] మొదటి ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం ద్వారా తెలుసుకుందాం.

మనిషి సృష్టి పై హజ్రత్ అలీ[అ.స] వివరణ

అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స], నెహ్జుల్ బలాగహ్ గ్రంథంలో ఉల్లేఖించబడ్డ మొదటి ఉపన్యాసంలో ముందుగా అల్లాహ్ అస్థిత్వాన్ని మరియు ఆయన గుణాలను వివరించి ఆ తరువాత అల్లాహ్ కార్యములను వివరించిన తరువాత మనిషి యొక్క సృష్టి గురించి చెబుతూ వారు మనిషి మట్టితో సృష్టించబడ్డాడు అని సూచించారు. ఇమామ్ అలీ[అ.స] ఉపన్యాసం నుండి కొంత బాగం:
ثُم جَمَعَ مِن حَزن الارضِ وَ سَهلِها ، وَ عَذبِها و سَبَحهَا ، تُربَـةً سَنَها بِالماءِ حتّی خَلَصَت ، وَ لَاطَها بِلبَلۀ حَتّی لَزَبَت ، فَجَبَلَ مِنها صُورَۀ ذاتَ أحناءٍ وَ وُصولٍ ، و اعضاءٍ و فُصولٍ ، أجمَدَها حتّی أستَمسَکَت ، و أصلَدَها حتّی صَلصَلَت ، لِوَقتٍ مَعدودٍ ، وَ أمَدٍ مَعلومٍ ثُمَ نَفَخَ فیها من روحِهِ فَمَثُلَت إنساناً ذا أَذهانٍ یُجیلُها ، وَ فِکرٍ یَتَصَرٍفُ بِها
అల్లాహ్ ఆదమ్ ను సృష్టించడానికై, ఎగుడు దిగుడు భూముల నుండి అనగా కొండల మట్టిని, చదునైన మరియు బల్లపరుపుగా ఉన్న భూముల మట్టిని, వ్యవసాయానికి పనికొచ్చే మంచి స్వచ్ఛమైన భూముల మట్టిని మరియు వ్యవసాయానికి పనికిరాని బంజరు భూముల మట్టిని సంగ్రహించాడు. ఆ తరువాత అల్లాహ్ ఆ మట్టిని స్వచ్ఛమైన నీటితో కలిపి మెత్తగా చేశాడు, అలా చేయడం ద్వార ఆ మట్టి జిగురుమట్టిలా మారింది. ఆ మట్టితో ఒక రూపాన్ని తయారు చేశాడు, దాని భాగాలు సృష్టించాడు. ఆ తరువాత ఆ మట్టి ఆరిపోయి “సల్సాల్” రూపంలోకి వచ్చింది. “సల్సాల్” అనగ దానిని చేతితో కొడితే మధ్యలో ఖాలిగా ఉన్నట్లుగా శబ్ధం వచ్చే విధంగా ఆరిన మట్టిని అంటారు. ఆ తరువాత కొంతకాలం వరకు ఆ రూపాన్ని అలాగే ఉంచడం జరిగింది. చివరికి అల్లాహ్ ఆ రూపానికి ఆత్మను ప్రసాదించాడు. అలా మనిషి సృష్టించబడ్డాడు.[నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్ నం:1]

రిఫ్రెన్స్
సయ్యద్ రజీ, నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్ నం:1.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20