ఆమె త్యాగమూర్తి

శని, 03/10/2018 - 13:28

.దైవప్రవక్త[స.అ] కుమార్తే అయిన హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క కుతురు, భార్య మరియు తల్లి స్థానాల గురించి సంక్షిప్తంగా.

ఆమె త్యాగమూర్తి

ఆమె త్యాగం మరియు ఉపకారానికి చిహ్నం. ఆమె నమాజ్ కోసం మహ్రాబ్ లో నిలబడి అల్లాహ్ ను ప్రార్ధించే సమయంలో మహ్రాబ్ కన్నిళ్ళతో తడిసిపోయేది. నిలబడే శక్తిలేకపోయిన సరే అల్లాహ్ పట్ల ప్రేమ వల్ల ప్రార్థిస్తూనే ఉండేవారు. ఆమె తమ కోసం మరియు తమ కుటుంబ సభ్యుల కోసమే దుఆ చేసేవారు కాదు. ఆమె ముందుగా ఇరుగుపొరుగు వారికి కోసం, కష్టాల్లో ఉన్నవారి కోసం దుఆ చేసేవారు ఆ తరువాత తమ కోసం మరియు తమ కుటుంబం కోసం చేసేవారు.
భూమ్యాకాశాలు ఆమెకు సాటి చూడనటువంటి కుతురూ, భార్యా మరియు తల్లి. ఆమె కుతురి స్థానంలో ఉండి తన తండ్రికి అందించిన సేవాలు చూసి స్వయంగా దైవప్రవక్తే[స.అ] ఆమెను “ఉమ్మె అబీహా” అనగా “తన తండ్రి యొక్క తల్లి” అని బిరుదనిచ్చారు. మరి భార్య స్థానంలో వచ్చిన తరువాత ఆమె భర్తకు “ఒక్కసారైనా నా భార్య నాతో ఏదైనా కోరితే బాగుంటుది” అన్న ఆశ కలిగే విధంగా నడుచుకున్నారు. ఇక తల్లి స్థానంలో వచ్చిన తరువాత పిల్లల  శిక్షణకే అర్ధాన్నిచ్చినట్లు పెంచి ఒక్కొక్కరిని ఒక స్థాయికి చేర్చారు. ఆమె పెంచిన విధానం మీకు తెలియాలి అంటే మీరు ఇస్లాం రక్షణ కోసం కర్బలా యుద్ధభూమిలో చివరి శ్వాస వరకు తమ రక్తం చిందించిన వీరులను చూడండి!. మీకే తెలుస్తుంది హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ఒడిలో పెరిగి ఎలాంటి ఆణిముత్యాలు అయ్యారో.
ఇస్లాం పై ఆమె చేసిన ఉపాకారాలు చాలా ఉన్నాయి. మేము ఆమె రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అల్లాహ్ మనకు కూడా ఆమె వలే మన పిల్లలను ఇస్లాం కోసం ఉపయోగపడే విధంగా పెంచే శక్తిని ప్రాదించుగాక!.
   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18