జనాబె అలీ అక్బర్[అ.స]

బుధ, 04/25/2018 - 04:51

ఇమామ్ హుసైన్[అ.స] కుమారుడు హజ్రత్ అలీ అక్బర్[అ.స] గురించి సంక్షిప్త వివరణ.

జనాబె అలీ అక్బర్[అ.స]

అలీ అక్బర్[అ.స], ఇమామ్ హుసైన్[అ.స] యొక్క కుమారుడు. ఇతను దైవప్రవక్త[స.అ] మాదిరి ఉండేవారు. ఇతను ఆషూరా రోజు కర్బలా యుద్ధంలో ఇస్లాం మరియు మానవత్వ విలువలను రక్షించడానికై తన ప్రాణాలను అర్పించారు. ఇతని వయసు కర్బలా యుద్ధం సమయంలో 25 సంవత్సరాలు. కొందరు 18 సంవత్సరాలని మరికొందరు 20 సంవత్సరాలని కూడా ఉల్లేఖించారు. ఇతను బనీహాషిం నుండి అందరి కన్న ముందు తన ప్రాణాలను అర్పించారు.
ఇతని వీరత్వం, ధైర్యం, వివేకం, దీన్ పట్ల అవగాహనా, విధేయత కర్బలా ప్రయణంలో ముఖ్యంగా ఆషూరా రోజున స్పష్టంగా తెలిసొచ్చింది. అతని మాటలే దీనికి నిదర్శనం. ఇమామ్ “ఖస్లు బనీ మకాతిల్” అన్న విశ్రాంతి నిలయం దాటిన తరువాత ఇమామ్ హుసైన్[అ.స] తమ గుర్రం పైనే నిద్రలో జారుకున్నారు, కొద్దిసమయంలోనే కళ్ళు తెరిచి మూడు సార్లు “ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్” మరియు “అల్ హందు లిల్లాహ్”  అన్నారు. అలీ అక్బర్[అ.స] తన తండ్రితో దానికి కారణం అడగగా ఇమామ్ ఇలా అన్నారు: “నేను స్వప్నంలో ఒక రౌతును ‘ఈ సమూహం మరణం వైపుకు ప్రయాణిస్తుంది’ అంటుండగా చూశాను. అలీ అక్బర్[అ.స] “మేము యదార్థం వైపు లేమా!” అని అడిగారు. దానికి ఇమామ్: “ఎదుకనీ లేమూ” అన్నారు. అప్పడు అలీ అక్బర్ “అయితే సన్మార్గంలో ప్రాణాలు అర్పించడానికి భయమేందుకు!” అని అన్నారు.
అలాగే ఆషూరా రోజున యుద్ధానికి వెళ్ళేందుకు అందరి కంటే ముందు అనుమతి కోరింది కూడా ఇతనే. ఇతనిని యుద్ధానికి పంపించడం అహ్లెబైత్ మరియు ఇమామ్ కు చాలా కష్టం అనిపించింది. ఇతను ఆషూరా రోజున తన వీరత్వంతో కూడిన దాడితో శత్రువుల హృదయాలను భయానికి గురిచేశారు. ఒకసారి తండ్రి వద్దకు వచ్చి తరిగి యుద్ధానికి వెళ్ళారు, చివరి శ్వాస వరకు శత్రువులతో పోరాడుతూనే ఉన్నారు. చివరికి “ముర్రహ్ ఇబ్నె మున్ఖజె అబ్దీ” అనేవాడు అతనిపై దాడి చేసి చంపాడు. శత్రువు అతని దేహన్ని కత్తులతో ఖండఖండాలు చేశారు.
ఇతని సమాధి కర్బలా పట్టణంలో తన తండ్రి సమాధి యొక్క పాదాల వద్ద ఉంది.[ఫర్హంగె ఆషూరా, పేజీ324]

రిఫ్రెన్స్
జవాదె ముహద్దిసీ, ఫర్హంగె ఆషూరా, నష్రె మారూఫ్, ఖుమ్, 1374.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Fida Hussain, Hyd on

అస్సలామున్ అలైకుం . దయచేసి తమరు కర్బలాలో ఇమామ్ హుస్సైన్ అ.స యొక్క కుటుంబం నుండి షహీద్ అయినా వారి వరుస క్రమం తెలుప గలరు .
విలాయత్ గ్రూపులో పెట్టగలరు

Submitted by zaheer on

వ అలైకుం అస్సలామ్. ఇన్షాఅల్లాహ్ తప్పకుండా. మీరు మా సైట్ పై వచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరిచినందుకు మీకు మా కృతజ్ఞత.
ఇల్తెమాసె దుఆ.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22