ఖుర్ఆన్ యొక్క మొదటి పారహ్

మంగళ, 05/29/2018 - 09:20

పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో 30 పారాలు మరియు 114 సూరహ్ లు ఉన్నాయి. పారాను ఒక రకంగా అధ్యాయం, ఖండం, భాగం అని కూడా చెప్పవచ్చు.

ఖుర్ఆన్ యొక్క మొదటి పారహ్

పవిత్ర ఖుర్ఆన్ యొక్క మొదటి పారా లో 5 అంశాలు ఉన్నాయి.
1. మానవుల రకాలు: మూడు రకాలు విశ్వాసులు, కపటవర్తనులు మరియు అవిశ్వాసులు. వారి లక్షణాల ప్రస్తావనం. 
2. ఖుర్ఆన్ యొక్క అద్భుతకృత్యము: కొన్ని సూరహ్ లు “ముఖత్తఆత్”(వేర్వేరుగా పఠించబడే అక్షరాలని అర్ధం)తో మొదలయ్యాయి; అయితే ఖుర్ఆన్, మీరు మాట్లాడే అక్షరాలతోనే అల్లాహ్ కూడా సంభోదించాడు కాని మీరు ఈ గ్రంథం లాంటిదే తీసుకొని రావడంలో నిస్సహాయులు అని చెబుతుంది.
3. హజ్రత్ ఆదమ్[అ.స] సృష్టి సంఘటన: అల్లాహ్, హజ్రత్ ఆదమ్[అ.స] సృష్టించాలనుకున్నప్పటి నుండి భూమి పై అవతరించబడడం వరకు ప్రస్తావించబడి ఉంది.
4. బనీఇస్రాయీల్ యొక్క స్థితిగతులు: అల్లాహ్ అనుగ్రాల పట్ల వారి కృతఘ్నత. వారి పై అల్లాహ్ లఅనత్ ప్రస్తావనం.
5. హజ్రత్ ఇబ్రాహీమ్ కథనం: హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] తన కుమారునితో కలిసి చేసిన “కాబా” నిర్మాణం, అల్లాహ్ అంగీకరణ మరియు అస్తగ్ఫార్ చేయడం లాంటి ప్రస్తావనములు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14