అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ఖుర్ఆన్ యొక్క 10వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.
ఖుర్ఆన్ యొక్క 10వ పారహ్ లో రెండు భాగాలు ఉన్నాయి. 1. అన్ఫాల్ సూరహ్ మిగిలిన భాగం, 2. తౌబహ్ సూరహ్ యొక్క మొదలు.
మొదటి భాగంలో ఆరు అంశాలున్నాయి: 1. ఖుమ్స్ ఆదేశం, 2. బద్ర్ యుద్ధం యొక్క పరిస్థితులు, 3. అల్లాహ్ యొక్క మద్దత్తుకు నాలుగు కారణాలు, 5. హిజ్రత్ మరియు సహాయం యొక్క ప్రతిష్టత, 6. ఈలోకంలో మనిషికి స్వాతంత్ర్యం ఉంది.
రెండవ భాగంలో రెండు అంశాలున్నాయి: ముష్రికులతో మరియు అహ్లెకితాబ్ తో జిహాద్ చేసే ప్రస్తావనం. 2. ముస్లిముల మరియు కపటవర్తనుల మధ్య తేడా.
ఇవే కాకుండా ఇందులో కొన్ని అంశాలు మరియు అహ్లెబైత్[అ.స] ప్రతిష్టత ఈ పారహ్ లో ఉన్నాయి: 1. రుజుమార్గం వైపుకు తీసుకెళ్ళే నాయకుల వలే మార్గభ్రష్టతకు గురి చేసే నాయకులు కూడా ఉన్నారు అన్న ప్రస్తావనం. 2. నాకిసీన్ల ప్రస్తావనం. 3. ముష్రికులకు మస్జిదు ఏర్పాట్లు చేసే హక్కులేదు. 4. మస్జిదుకు అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చడం యొక్క ప్రాముఖ్యత ప్రస్తావనం. 5. విశ్వాసుల హృదయాలకు శాంతి ప్రసాదించే వాటి అవతరణ ప్రస్తావనం. 6. హజీయులను నీరు త్రాగించడం, మస్జిదులను అన్ని సౌకర్యాలు సమకూర్చడం కన్నా అల్లాహ్ మార్గంలో జిహద్ చేయడంలో ఎక్కవ ప్రతిష్ట ఉంది, మరి ఈ ప్రతిష్టత ఇమామ్ అలీ[అ.స]కి సొంతమయ్యింది. 7. ఇస్లాం ధర్మం ప్రపంచమంతటిని ఆక్రమిస్తుంది అన్న శుభవార్త ప్రస్తావనం ఉంది. 8. జకాత్ ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలనే ప్రస్తావనం ఉంది.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya. Jazakallah.
వ్యాఖ్యానించండి