ఖుర్ఆన్ యొక్క 13వ పారహ్

శుక్ర, 06/22/2018 - 16:07

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 13వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 13వ పారహ్ లో మూడు భాగాలు ఉన్నాయి. 1. యూసుఫ్ సూరహ్ మిగిలిన భాగం, 2. పూర్తి రఅద్ సూరహ్, 3. పూర్తి ఇబ్రాహీమ్ సూరహ్.
మొదటి భాగంలో మిగిలిన ఒక ముఖ్యాంశం: 97, 98 ఆయత్లలో ప్రస్తావించబడి ఉంది. అల్లాహ్ సన్నిధిలో దైవప్రవక్త[స.అ]ను మధ్యవర్తని చేయవచ్చు అనగా వసీలా గా ఆశ్రయించవచ్చు అని, దీనిని ప్రవక్త హజ్రత్ యాఖూబ్[అ.స] తన ఉల్లేఖనతో సమర్థించారు.
రెండవ భాగంలో ఐదు అంశాలున్నాయి: 1. ఖుర్ఆన్ యొక్క యదార్థం 2. తౌహీద్ 3. ఖియామత్ 4. రిసాలత్ 5. ధర్మనిష్ఠ గల వారి యొక్క ఎనిమిది లక్షణాలు(విశ్వసనీయం, బంధుమిత్రులతో కలిసి ఉండడం, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండడం, అంతిమ దినం పట్ల భయం కలిగి ఉండడం, సహనం, నమాజ్ కట్టుబాటు, సద్ఖా, చెడుకు బదులు మంచి ప్రవర్తనం) మరియు దుర్మార్గుల మూడు గుర్తులు(వాగ్దానం పై కట్టుబడి ఉండకపోవడం, బంధుమిత్రులతో కలిసి ఉండకపోవడం మరియు భూమిపై కల్లోలం సృష్టించడం).
మూడవ భాగంలో ఐదు అంశాలున్నాయి: 1. తౌహీద్, 2. రిసాలత్, 3. ఖియామత్, 4. కొన్ని మఖ్యవిషయాలు, 5. ఆరు దుఆలు.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27