ఖుర్ఆన్ ను తమ ఇష్టానికి వ్యాఖ్యానించడం ఇస్లాం ధర్మానికి విరుద్ధం. కేవలం సున్నత్ ప్రకారమే దానిని వ్యాఖ్యానించాలి.
స్వయ వ్యాఖ్యానం, దీనిని ఖుర్ఆన్ జ్ఞానం యొక్క భాషలో “తఫ్సీర్ బిర్రాయి” అంటారు. అనగ తన ఇష్టప్రకారంగా ఖుర్అన్ ను వ్యాఖ్యానించడం. చాలా రివాయత్ ల నిదర్శనంగా “స్వయ వ్యాఖ్యానం” ఖడించబడినది మరియు ఎవరైతే “స్వయ వ్యాఖ్యానం” చేస్తారో నరకాగ్నికి అర్హుడని చెప్పబడింది.
“స్వయ వ్యాఖ్యానం” అనగ మనిషి ఖుర్ఆన్ ను తన సొంత అభిప్రాయాల ప్రకారం తన మనసుకు నచ్చిన విధంగా, ఇష్టానుసారం వ్యాఖ్యానించి భావాన్ని చెప్పడం అది విశ్వపరమైనవి కానివ్వండి లేదా అహ్కాములు కానివ్వండి లేదా మరేదైనా కానివ్వండి.
దైవప్రవక్త ఖుర్ఆన్ యొక్క స్వయవ్యాఖ్యానం గురించి ఇలా ప్రవచించారు: «مَنْ فَسَّرَ الْقُرْآنَ بِرَاْیِهِ فَلْیَتَبَوَّا مقْعَدَهُ مِنَ النّار» ఎవరైతే ఖుర్ఆన్ ను తమ అభిప్రాయానికి అనుకూలంగా వ్యాఖ్యానిస్తారో వారి స్థానము నరకం నుండి.[అవాలియుల్లిఆలీ, భాగం4, పేజీ104]
రిఫ్రెన్స్
అవాలియుల్లిఆలీ, ఇబ్నె అబీ జమ్హూర్, దారు సయ్యదుష్షుహదా, ఖుమ్, 1405హిజ్రీ.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... iltemase Dua.
వ్యాఖ్యానించండి