నమాజ్ పట్ల అశ్రద్ధత

గురు, 07/05/2018 - 09:42

నమాజ్ పట్ల అశ్రద్ధత కలిగి ఉండడం అంటే ఏమిటి అన్న విషయం పై ఖుర్ఆన్ వివరణ.

నమాజ్ పట్ల అశ్రద్ధత

నమాజ్ పట్ల అశ్రద్ధ కలిగి ఉన్న వారి వివరణ ఖుర్ఆన్ దృష్టిలో.
1. నమాజ్ ను హేళన చేసేవారు: "మీరు నమాజ్ కోసం పిలిచినప్పుడు వారు దాన్ని నవ్వులాటగా, తమాషాగా చేసుకుంటారు. ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధిలేనివారు"[మాయిదహ్:58]
2. నమాజ్ ను బద్దకంతో చదివేవారు: "వారు నమాజ్ కోసం నిలబడినప్పుడు ఎంతో బద్దకంతో నిలబడతారు"[నిసా:142].
3. నమాజ్ ను జనులను చూపేందుకు చదివేవారు: "వారు కేవలం జనులను చూపే ఉద్దేశంతో నిలబడతారు. ఏదో నామ మాత్రంగా దైవాన్ని స్మరిస్తారు"[నిసా:142].
4. అప్పుడప్పుడూ నమాజ్ చదివేవారు: "ఆ నమాజీలకు వినాశం తప్పదు('వైల్' అనే నరక స్థానం వారి కొరకు ఉంది). (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.[మాఊన్:4,5].
నమాజ్ ను హేళన చేసేవారు, దానిని బద్దకంతో చదివేవారు, కేవలం జనులను చూపేందుకు చదివేవారు మరియు ఒకసారి చదివి ఒకసారి చదవకపోవడం, ఇవన్నీ ఖుర్ఆన్ దృష్టిలో నమాజ్ పట్ల అశ్రద్ధతకు నిదర్శనం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13