దుఆయే రౙీతు బిల్లాహ్

శుక్ర, 08/03/2018 - 15:42

ప్రతీ వాజిబ్ నమాజ్ తరువాత ఈమాన్ ను పెంచెందుకు చదవమని పవిత్ర ఇమామ్[అ.స] బోధించిన దుఆ యొక్క ఉచ్చారణ మరియు దాని అనువాదం.

దుఆయే రజీతు బిల్లాహ్

సులైమాన్ ఇబ్నె దైలమీ రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: నేను హజ్రత్ ఇమామ్ సాదిఖ్[అ.స]తో నాకు ఏదైనా దుఆను నేర్పండి అది చదివితే నా విశ్వాసం(ఈమాన్) పెరగాలి, అంతం అవ్వకూడదు అని అన్నాను. అప్పుడ ఇమామ్ ప్రతీ వాజిబ్ నమాజ్ తరువాత ఇలా పఠించు అని అన్నారు. ఆ దుఆ: ౙీతు బిల్లాహి రబ్బన్, వ బిముహమ్మదిన్ సొల్లల్లాహు అలైహి వ ఆలిహి నబియ్యా, వ బిల్ ఇస్లామి దీనా, వబిల్ ఖుర్ఆని కితాబా, వబిల్ కఅబతి ఖిబ్లహ్, వ బి అలియ్యి వలియ్యన్ వ ఇమామా, వ బిల్ హసని వల్ హుసైన్, వ అలీయిబ్నిల్ హుసైన్, వ ముహమ్మదిబ్ని అలీ, వ జాఫరిబ్ని ముహమ్మద్, వ మూసబ్ని జాఫర్, వ అలీయ్యిబ్ని మూసా, వ ముహమ్మదిబ్ని అలీ, వ అలీయ్యిబ్ని ముహమ్మద్, వల్ హసనిబ్ని అలీ, వల్ హుజ్జతిబ్నిల్ హసన్, సలవాతుల్లాహి అలైహిమ్ అయిమ్మతన్, అల్లాహుమ్మ ఇన్నీ రౙీతు బిహిమ్ అయిమ్మతన్, ఫర్ ౙనీ లహుమ్, ఇన్నక అలా కుల్లి షైయిన్ ఖదీర్.
అనువాదం: నేను అంగీకరించి ఆనందిస్తున్నాను; అల్లాహ్ నా ప్రభువనీ, ముహమ్మద్ సొల్లల్లాహు అలైహి వ ఆలెహి నా ప్రవక్తనీ, ఇస్లాం నా ధర్మమనీ, నా గ్రంథం ఖుర్ఆన్ అనీ, కఅబహ్ యే నా ఖిబ్లహ్ అనీ, అలీయే నా వలీ మరియ ఇమామ్ అనీ, (అలాగే) హసన్, హుసైన్, అలీ ఇబ్నె హుసైన్, ముహమ్మద్ ఇబ్నె అలీ, జాఫర్ ఇబ్నె ముహమ్మద్, ముసా ఇబ్నె జాఫర్, అలీ ఇబ్నె మూసా, ముహమ్మద్ ఇబ్నె అలీ, అలీ ఇబ్నె ముహమ్మద్, హసన్ ఇబ్నె అలీ మరియు హుజ్జత్ ఇబ్నె హసన్ -అల్లాహ్ వారి పై దురూద్ పంపు- వారందరూ నా ఇమాములు, నాయకులు. ఓ అల్లాహ్! నేను వారి నాయకత్వాన్ని ఇష్టపడతాను(అంగీకరిస్తాను), నన్ను కూడా వారు ఇష్టపడేలా(రాజీపడేలా) చేయి! నీవు సర్వశక్తులూగలవాడివి.[మఫాతీహుల్ జినాన్, పేజీ52]

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36