హజ్రత్ అలీఫాతెమా[అ.స] లకు దైవప్రవక్త[స.అ] ఉత్తరువులు

ఆది, 08/12/2018 - 16:33

హజ్రత్ అలీ[అ.స] మరియు హజ్రత్ ఫాతెమా[అ.స] వివాహం తరువాత దైవప్రవక్త[స.అ] వారింటికి వెళ్లి వారిద్దరితో మాట్లాడిన మాటల ఉల్లేఖనం.

హజ్రత్ అలీఫాతెమా[అ.స] లకు దైవప్రవక్త[స.అ] ఉత్తరువులు

హజ్రత్ అలీ[అ.స]తో హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స] వివాహం జరిగిన మూడు రోజుల తరువాత, దైవప్రవక్త(స.అ) ఫాతెమా జహ్రా[అ.స] ఇంటికి వచ్చారు. ఆమె వైవాహిక జీవత ఆరంభం ఎలా ఉందో తెలుసుకునే క్రమంలో అతను ఆమెను ఇలా ప్రశ్నించారు: “నీ భర్త పై నీ అభిప్రాయం ఏమిటి?”(వారు ఎలాంటి వారు?). హజ్రత్ ఫాతెమా[అ.స] ఇలా అన్నారు: “నా భర్త చాలా మంచివారు, కాని ఖురైషీయుల నుండి కొంతమంది స్త్రీలు వచ్చి నాతో ‘దైవప్రవక్త[స] నీ వివాహం ఒక పేదవాడితో చేశారు’ అని అన్నారు”. అపుడు దైవప్రవక్త[అ.స] ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీకు మేలు చేసే విషయంలో ఎటువంటి కొరత చేయలేదు, నీ భర్త ఇస్లాం స్వీకరణలో అందరి కన్నా ముందు, జ్ఞాన పరంగా అందరిని మించిన జ్ఞాని, అలాగే సహనఓర్పులలో కూడా అందరిని మించిన వాడు”
ఆ తరువాత హజ్రత్ ఫాతెమా[అ.స]ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “అమ్మా! నీ భర్త చాలా మంచివాడు, అన్ని విషయాలలో అతని పట్ల విధేయత కలిగి ఉండు” ఆ తరువాత అలీ[అ.స]ను ఉద్దేశించి ఇలా అన్నారు: “నీ భార్య పట్ల ప్రేమా, దయా కలిగి ఉండు”
హజ్రత్ అలీ[అ.స] ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా, ఆమె ఆత్మను అల్లాహ్ తన వైపుకు ఆహ్వనించనంత కాలం ఆమెను ఎప్పుడు కూడా కోపం తెప్పించలేదు, ఒక పని చేయమని బలవంతం చేయలేదు, అలాగే ఆమె ఎప్పుడు కూడా నన్ను నిరాశ పరచలేదు, నా పట్ల అవిధేయత చూపలేదు, నేను ఎప్పుడు ఆమెను చూసినా నా కష్టాలు, దుఖాలు నా నుండి దూరమయ్యేవి”.[బైతుల్ అహ్జాన్, పేజీ59].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, బైతుల్ అహ్జాన్, మాహిర్, ఖుమ్, ఇరాన్, 1389.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9