61వ హిజ్రీ యొక్క ముహర్రం మాసంలో జరిగిన సంఘటనలు

ఆది, 09/09/2018 - 11:27

61వ హిజ్రీ యొక్క ముహర్రం మాసంలో జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించడం జరిగింది. ఇవి కాకుండా వేరే సంఘటనలు కూడా సంభవించాయి అవి వేరే వ్యాసంలో చూడగలరు.

61వ హిజ్రీ యొక్క ముహర్రం మాసంలో జరిగిన సంఘటనలు

2వ తారీఖున ఇమామ్ హుసైన్[అ.స] కర్బలాలో ప్రవేశించారు.
3వ తారీఖున “ఉమర్ ఇబ్నె సఅద్” కర్బలాలో దిగాడు.
4వ తారీఖున ఇమామ్ హుసైన్[అ.స]కు వ్యతిరేకంగా “ఒబైదుల్లాహ్ ఇబ్నె జియాద్” కూఫా మస్జిదులో ఉపన్యాసమిచ్చాడు. కూఫాకు పంపబడిన ఇమామ్ హుసైన్ ప్రతినిధి అయిన “ఖైస్ ఇబ్నె ముసహ్హరె సైదావీ” చంపబడిన రోజు.
5వ తారీఖున “హసీన్ ఇబ్నె నుమైర్”, “షబస్ ఇబ్నె రబీయి” కర్బలాకు చేరారు.
6వ తారీఖున కర్బలాలో ఫురాత్ పై మొదటి ముట్టడి జిరిగింది. “ఉమర్ ఇబ్నె సఅద్”, ఇమామ్ హుసైన్[అ.స]తో సంభాషించాడు.
7వ తారీఖున కర్బలాలో అహ్లెబైత్[అ.స] పై నీరును నిలిపివేశారు. “ఒబైదుల్లాహ్ ఇబ్బె జియాద్” తరపు నుండి “ఉమర్ ఇబ్నె సఅద్”కు ఉత్తరం అందింది.
8వ తారీఖున ఇమామ్ హుసైన్[అ.స] ఉమర్ ఇబ్నె సఅద్ తో కలిశారు.
9వ తారీఖున “షిమ్ర్ ఇబ్నె జిల్ జౌషన్” కర్బలాకు తన సైన్యంతో చేరుకున్నాడు. శత్రుసైన్యం నుండి హజ్రత్ అబ్బాస్[అ.స] మరియు వారి సోదరులకు వచ్చిన శరణు పత్రాన్ని వారు నిరాకరించారు.
10వ తారీఖున మనసులను కలచివేసే కర్బలా సంఘటన సంభవించిన రోజు. ఆషూరా రోజు.
11వ తారీఖున కర్బలాలో ఇమామ్ హుసైన్[అ.స] కుటుంబీకులను మరియు వారి అనుచరులను బంధీలుగా చేసి కూఫా వైపుకు శత్రుసైన్యం తమ ప్రయాణాన్ని మొదలు పెట్టింది.
12వ తారీఖున బంధీలుగా ఉన్న ఇమామ్ హుసైన్[అ.స] అహ్లెబైత్ లు కూఫాకు చేరుకున్నారు.
13వ తారీఖున కర్బలా వీరుల అంతిమసంస్కారాలు జరిగాయి. బంధీలను “ఉబైదుల్లాహ్ ఇబ్నె జియాద్” యొక్క సభలో ప్రవేశపెట్టారు.
14వ తారీఖున ఉబైదుల్లాహ్ ఇబ్నె జియాద్, యజీద్ కు ఉత్తరం వ్రాశాడు.
19వ తారీఖున కర్బలా బంధీల ప్రయాణం షామ్(సిరియా) వైపుకు మొదలయ్యింది.
29వ తారీఖున: కర్బలా బందీయుల సమూహం షామ్(సిరియా)కు చేరింది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 37