ఐనుల్లాహ్ మరియు యదుల్లాహ్

బుధ, 10/03/2018 - 06:38

హజ్రత్ అలీ[అ.స]ను, ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ కూడా ఐనుల్లాహ్ మరియు యదుల్లాహ్ అని నమ్మేవారు.

ఐనుల్లాహ్ మరియు యదుల్లాహ్

గొప్ప ఆలిమ్, ప్రముఖ “అల్ గదీర్” గ్రంథ రచయిత అయిన అల్లామహ్ అమీనీ[ర.అ] తన ఒక ప్రయాణంలో ఒక సమావేసంలో పాలుగొన్నారు, అహ్లె సున్నత్ కు చెందిన ఒక పండితుడు అతనితో ఇలా అన్నాడు: “మీ షియాలు హజ్రత్ అలీ[అ.స] విషయంలో అతివృష్టికి గురి అవుతారు, ఉదాహారణకు అతనిని ‘యదుల్లాహ్’, ‘ఐనుల్లాహ్’ అనే మొదలగు బిరుదులతో గుర్తుచేస్తూ ఉంటారు, సహాబీయులను ఇలాంటి బిరుదులతో ప్రశంసించడం సరికాదు”
అల్లామహ్ అమీని నిస్సంకోచంగా ఇలా బదులిచ్చారు: “ఒకవేళ ఉమర్ బిన్ ఖత్తాబ్, అలీ[అ.స]ను ఇటువంటి బిరుదులతో సంబోధించి ఉంటే!, ఏమంటావు?” అతడు, “ఉమర్ మాటలు మాకు నిదర్శనం” అన్నాడు. అల్లామహ్ అమీనీ అదే సమావేసంలో, అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ గ్రంథాన్ని కోరారు, ఆ గ్రంథం అతనికి తెచ్చివ్వగా అతను వెతికి ఒకపేజీని తెరిచారు దాని పై ఈ హదీస్ ఉంది: “ఒక వ్యక్తి కాబా ప్రదక్షణాలు చేస్తుండగా ఒక నామహ్రమ్ స్ర్తీని తప్పుడు దృష్టితో చూశాడు, హజ్రత్ అలీ[అ.స] అతనిని ఆ పరిస్థితిలో చూసి తన చేతితో అతడి చెంపపై కొట్టారు, అలా అతడికి శిక్షించారు. అతడు తన చెంప పై చేయి పెట్టుకొని, అలీ[అ.స] పట్ల పిర్యాదు కోసం ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ వద్దకు వచ్చి జరిగింది చెప్పాడు. ఉమర్ బదులుగా ఇలా చెప్పారు: “నిస్సందేహంగా అల్లాహ్ కళ్ళు (ఐనుల్లాహ్) చూశాయి మరియు అల్లాహ్ చేతులు (యదుల్లాహ్) శిక్షించాయి” (దీనికి అర్ధమేమిటంటే హజ్రత్ అలీ[అ.స] చేసే ప్రతీ పని అల్లాహ్ కోసమే, వారు ఎప్పుడూ తప్పు చేయరు).
అల్లామహ్ అమీనీ[ర.అ]ని ప్రశ్నించిన వాడు ఈ హదీస్ చూసి తాను కూడా అంగీకరించాడు.[ఎక్ సద్ వ ఎక్ మునాజెరహ్, పేజీ197.]

రిఫ్రెన్స్
మొహమ్మద్ మొహమ్మదీ ఇష్తెహార్దీ, ఎక్ సద్ వ ఎక్ మునాజెరహ్.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Amir on

Mashallah, good information about marifat e Moula Ali as.
Shukriya.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14