దైవప్రవక్త[స.అ] చేసుకున్న వివాహములలో ప్రతీ దానికి ఏదో ఒక ముఖ్యకారణం ఉంది. ఇక్కడ కేవలం వారి భార్యల పేర్లు మాత్రమే చెప్పబతున్నాయి. ఇన్షాల్లాహ్ త్వరలోనే వాటి కారణాలు కూడా చెప్పబడతాయి.
1. ఖదీజా బింతె ఖువైలద్, ఈమె బ్రతికున్నంత వరకు మరో వివాహం చేసుకోలేదు. మరి ఈమె తరువాత చేసున్న ప్రతీ వివాహం వెనుక ఒక లక్ష్యం ఉంది. (ఇన్షాఅల్లాహ్ త్వరలోనే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం).
2. సౌదహ్, జనాబె ఖదీజా తరువాత ఈమెతోనే వివాహం చేసుకున్నారు.
3. ఆయిషహ్ బింతె అబీబక్ర్, సౌదహ్ తో వివాహం చేసుకున్న సంవత్సరంలోనే ఆయిషహ్ ను వారితో వివాహం చేయడం జరిగింది.
4. హఫ్సహ్, ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ యొక్క కుమార్తె, హిజ్రీ యొక్క మూడవ సంవత్సరంలో వివాహం జరిగింది.
5. జైనబ్ బింతె ఖుజైమహ్, హిజ్రీ యొక్క 4వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కాని ఈమె రెండు మూడు నెలల తరువాత మరణించారు.
6. రమ్లహ్(ఉమ్మె హబీబహ్) బింతె అబూసుఫ్యాన్, ముఆవియహ్ యొక్క చెల్లెలు. హిజ్రీ యొక్క 7వ సంవత్సరంలో వివాహం జరిగింది.
7. ఉమ్మె సలమహ్ బింతె హుజైఫహ్, ఈమె జనాబె ఖదీజా, ఫాతెమా మరియు అలీలను చాలా ఇష్టపడేవారు, ఈమె హిజ్రీ యొక్క 62వ సంవత్సరం వరకు బ్రతికే ఉన్నారు.
8. జైనబ్ బింతె జహ్షె అసదీ, అజ్ఞానపు ఆచారాలను రద్దుచేసే క్రమంలో అల్లాహ్ ఆదేశం ప్రకారంగా ఈమెతో వివాహం చేసుకున్నారు.
9. జువైరియ్యహ్, ఈమె బనీ ముస్తలిఖ్ కు చెందినవారు.
10. సఫియ్యహ్, చాలా గుణవంతురాలు, తెలివిగలవారు.
11. మారియహ్ ఖిబ్తియహ్.
12. మైమూనహ్.
రిఫ్రెన్స్
మజల్లాహ్, హదీసె జిందగీ, ఆజర్ వ దెయ్1385, షుమారహ్32.
వ్యాఖ్యానించండి