దైవప్రవక్త[స.అ] యొక్క భార్య అయిన ఉమ్మె హబీబహ్ గురించి సంక్షిప్త వివరణ.
“ఉమ్మె హబీబహ్” యొక్క అసలు పేరు “రమ్లహ్”. ఈమె “అబూసుఫ్యాన్” యొక్క కుమార్తె మరియు “ముఆవియహ్” యొక్క చెల్లెలు. ఆమె తన భర్తతో పాటు ముస్లిములతో కలిసి “హబషహ్”కు హిజ్రత్ చేశారు. అక్కడ వారికి ఒక కూతురు పుట్టింది, ఆ పాప పేరు “హబీబహ్” అని పెట్టారు. ఆ తరువాత ఆమె పేరు “ఉమ్మె హబీబహ్”గా మారింది. హబషహ్ లో ఆమె భర్త క్రైస్తవుడిగా మారాడు మరి అక్కడే మరణించాడు. పరదేశం మరియు భర్త క్రైస్తవుడిగా మారడం ఆమెను దుఖంలో ముంచాయి. భర్త క్రైస్తవుడిగా మారినా సరే ఆమె ఇస్లాం ధర్మం నుండి మరలిపోలేదు. ఆమె ఇస్లాం ధర్మాన్నే ఆచరించడం మరియు దాని పట్ల స్థిరత్వం కలిగి ఉండడం స్తుతింపదగిన విషయం. మరో వైపు ఆమె తండ్రి అనగా అబూసుఫ్యాన్, ఇస్లాం యొక్క బద్దశత్రువు, అతడు ముస్లిములతో యుద్ధం కోసం సైన్యాన్ని సంగ్రహిస్తున్నటువంటి వ్యక్తి, అందుకని ఇస్లాం పట్ల ఆమెకున్న గౌరవానికి బదులుగా మరియు తండ్రి యొక్క ద్వేషం తగ్గాలని మరియు ఆమెకు రక్షణ కలిపేందుకు దైవప్రవక్త[స.అ] ఆమెతో హిజ్రత్ యొక్క 7వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
దైవప్రవక్త[స.అ] యొక్క బద్దశత్రువైన అబూసుఫ్యాన్, ఎప్పుడైతే దైవప్రవక్త[స.అ] అతడి కుమార్తెతో వివాహం చేసుకున్నారో అప్పుడు ఆనందంతో ఇలా అన్నాడు: “అపజయం మరియు అగౌరవం, ఈ వీరుడి భాగ్యం కాకూడదు”.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ86].
రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya.. jazakallah ..
Subhanallah
Shukriya...
వ్యాఖ్యానించండి