దైవప్రవక్త[స.అ] యొక్క భార్య అయిన జనాబె ఉమ్మె సలమహ్ గురించి సంక్షిప్త వివరణ.
“ఉమ్మె సలమహ్” యొక్క పేరు “హింద్”, తండ్రి పేరు “హుజైఫహ్”. ఈమె భర్త పేరు “అబ్దుల్లాహ్ ఇబ్నె అబీ సలమహ్”, అతడు దైవప్రవక్త[స.అ] యొక్క మేనత్త కుమారుడు. ఒక రకంగా సోదరుడు కూడాను. హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ], అబూసుఫ్యాన్ ఆధిపత్యంలో ఉన్న ఖురైష్ సమూహం కోసం మదీనా నుండి బయటకు వచ్చినప్పుడు అతడిని తన స్థానంలో నిశ్చయించారు. హబషహ్ కు హిజ్రత్ చేసినవారిలో ఒకరు. హబషహ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఒంటరిగా మదీనహ్ కు హిజ్రత్ చేశారు. అతని భార్య ఉమ్మె సలమహ్, ఒక సంవత్సరం తరువాత మదీనహ్ కు వచ్చారు. వారికి ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు. కుమారులు; 1.సలమహ్, 2.ఉమర్. కుమార్తెలు; 1.దుర్రహ్, 2. జైనబ్. జనాబె ఉమ్మె సలమహ్, తన భర్త మరణించిన తరువాత అబూబక్ర్ మరియు ఉమర్ తరపు నుండి వచ్చిన పెళ్ళి సంబంధాన్ని రద్దు చేశారు.
ఆమె భర్త మరణించిన తరువాత పిల్లల పోషణ బాధ్యతలు ఆమె పై కష్టమయ్యాయి, ఆ సమయంలో దైవప్రవక్త[అ.స] ఆమెతో వివాహం చేసుకున్నారు. ఆమె నిరంతరం దైవప్రవక్త[స.అ] పట్ల విధేయతగా ఉండేందుకే ప్రయత్నించేవారు. ఆమె, జనాబె ఖదీజా, అలీ మరియు ఫాతెమా[అ.స]లను చాలా గౌరవించేవారు మరియు వారి తరపు నుండి వాదించేవారు. ఆమె హిజ్రీ యొక్క 62వ హిజ్రీలో మరణించారు. ఈమె దైవప్రవక్త[స.అ] భార్యలలో చివరిగా మరణించిన భార్య.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ86].
రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya ... Iltemase dua.
MashaAllah.... thanks
Shukriya... Iltemase Dua.
వ్యాఖ్యానించండి