జైనబ్ బింతె ఖుజైమహ్

శని, 11/03/2018 - 16:27

దైవప్రవక్త(స.అ) యొక్క భార్య అయిన జైనబ్ బింతె ఖుజైమహ్ తో ఆయన వివాహానికి గల కారణం సంక్షిప్తంగా.

జైనబ్ బింతె ఖుజైమహ్

“జైనబ్ బింతె ఖుజైమహ్”, ఈమె ఒహద్ యుద్ధంలో హతమార్చబడ్డ “అబ్దుల్లాహ్ ఇబ్నె జహిష్” యొక్క భార్య. భర్త ఒహద్ యుద్ధంలో మరణించిన తరువాత దైవప్రవక్త[స.అ] ఈమెను వివాహం చేసుకున్నారు. ఈమె అజ్ఞానపు కాలం(అనగా ఇస్లాం ధర్మం రాక ముందు)లో బీదవారికి, లేనివారికి చాలా సహాయం చేసేవారు, అందుకే ఆమె ఆ కాలంలో ఒక ప్రతిష్టత గల స్త్రీగా గుర్తించబడేవారు. ఆమెను “నిస్సహాయుల తల్లి”గా సంభోదించేవారు. ఆమె గౌరవాన్నీ మరియు ప్రతిష్టతను కాపాడేందుకు దైవప్రవక్త[స.అ] వారితో వివాహం చేసుకున్నారు.
వారి వివాహం హఫ్సహ్ బింతె ఉమర్ తో వివాహం తరువాత హిజ్రీ యొక్క 4వ సంవత్సరంలో జరిగింది.
దైవప్రవక్త[స.అ] యొక్క మరో భార్య పేరు కూడా జైనబ్ అని చరిత్రలో ఉంది. ఆ జైనబ్ వేరు ఈ జైనబ్ వేరు. మరో జైనబ్ పేరు గల భార్య “జహ్షె అసదీ” కుమార్తె. ఆమెతో వివాహం చేసుకోమని స్వయంగా అల్లాహ్ యే ఆదేశించాడు. ఇన్షాఅల్లాహ్ ఆమె గురించి కూడా తరువాత వివరంగా తెలుసుకుందాం.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ88].

రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12