జైనబ్ బింతె జహ్షె అసదీ

శని, 11/03/2018 - 16:38

దైవప్రవక్త[స.అ] యొక్క భార్య అయిన జైనబ్ బింతె జహ్షె అసదీ గురించి సంక్షిప్త వివరణ.

జైనబ్ బింతె జహ్షె అసదీ

జైనబ్ బింతె జహ్షె అసదీ, ఈమె దైవప్రవక్త[స.అ] యొక్క మేనత్త గారి కుమార్తె, దైవప్రవక్త[స.అ] ఆదేశానుసారం “జైద్ ఇబ్నె హారిసహ్”తో వివాహం జరిగింది. జైద్ ఇబ్నె హారిసహ్ దైవప్రవక్త[స.అ] చేత విడుదల చేయబడిన బానిస. విడుదల చేసిన తరువాత అతడిని దత్తత తీసుకున్నారు. జైద్ మరియు జైనబ్ కొన్ని వ్యక్తిగత మరియు వర్గాల కారణాల వల్ల తమ దాంపత్య జీవితాన్ని కొనసాగించలేకపోయారు, అందుకని 13 సంవత్సరాలు కలిసి జీవించిన తరువాత జైనబ్ ను విడాకులిచ్చారు. జైనబ్ యొక్క విడాకు దీక్ష పూర్తి అయిన తరువాత దైవప్రవక్త[స.అ] అల్లాహ్ ఆజ్ఞతో ఆమెతో వివాహం చేసుకున్నారు. అల్లాహ్ ఇలా ప్రవచించెను.. మేము ఆమె వివాహం నీతో జరిపించాము. దత్తపుత్రులు తమ భార్యల లాంఛనాలన్నీ పూర్తిచేసిన తరువాత (వారికి విడాకులిచ్చిన పిమ్మట) వారి భార్యల(ను వివాహమాడే) విషయంలో విశ్వాసుల ఎలాంటి సంకోచానికీ లోనుకాకుండా ఉండేటందుకు మేమిలా చేశాము.[అహ్జాబ్:37]. దాంతో అజ్ఞానపు కాలం యొక్క ఆచారం పోయి దత్తపుత్రుని భార్యతో వివాహాన్ని సమ్మతించబడినదిగా నిర్ధారించబడింది.
మరో విషయమేమిటంటే దైవప్రవక్త[స.అ] మరణానంతరం వారి భార్యలలో ముందుగా మరణించిన భార్య ఈమె.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ85].

రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15