దైవప్రవక్త[స.అ] యొక్క భార్య అయిన జువైరియ్యహ్ గురించి సంక్షిప్త వివరణ.
జువైరియ్యహ్, ఈమె దైవప్రవక్త యొక్క భార్య. ఈమె “బనిల్ ముస్తలిఖ్” సమూహానికి చెందినవారు. దైవప్రవక్త[స.అ] “బనీల్ ముస్తలిఖ్” సమూహంతో యుద్ధం చేసినప్పుడు ఆమె మొదటి భర్త చనిపోయాడు మిగిలినవారిని బంధీలు చేశారు. యుద్ధంలో లభించిన సొమ్ము పంపకంలో “సాబిత్ ఇబ్నె ఖైస్” అనే వ్యక్తికి వచ్చిన భాగంలో ఆమెను అతనికి బానిసగా ఇచ్చారు. అతడు ఆమెను విడుదల చేయాలంటే తగిన సొమ్మును చెల్లించాలి అని నిర్ధారించాడు. ఆమె డబ్బు కోసం దైవప్రవక్త[అ.స] వద్దకు వచ్చారు. వారు నిర్ధారించబడిన సొమ్మును చెల్లించి ఆమెను విడుదల చేశారు. ఆ తరువాత ఆమె వివాహం దైవప్రవక్త(స.అ)తో జరిగింది.
ఈ విషయం ముస్లిములకు తెలిసిన వెంటనే వారు “బనీ ముస్తలిఖ్” సమూహానికి చెందిన ఇంచుమించు 100 బంధీలను విడుదల చేశారు, ఎందుకంటే వారు ఇక దైవప్రవక్త యొక్క బంధువులు కాబట్టి.[షీవయే హంసర్దారీయె పయంబర్, పేజీ85].
రిఫ్రెన్స్
అహ్మద్ ఆబెదీనీ, షీవయే హంసర్దారీయె పయంబర్, తహ్రాన్, హస్తీ నుమా, చాపె దువ్వుమ్, 1382.
వ్యాఖ్యానించండి