సూరహ్ లను వాటి యొక్క ఆయతుల సంఖ్య, వాటి అర్ధానుసారం మరియు పలు ప్రత్యేకతల కారణంగా కొన్ని పేర్లును పెట్టడం జరిగింది వాటి వివరణ సంక్షిప్తంగా.

1. తివాల్: అనగా ఖుర్ఆన్ లో ఉన్న పెద్ద సూరహ్ లను అంటారు. “తివాల్” తూల్ అనగా పొడుగు యొక్క బహువచనం. ఆ సూరహ్ లు: “బఖరహ్”, “ఆలె ఇమ్రాన్”, “నిసా”, “మాయిదహ్”, “అన్ఆమ్”, “అఅరాఫ్”, కొందరు “యూనుస్” మరియు కొందరు “కహఫ్” ను కూడా లెక్కిస్తారు.
2. మవూన్: ఈ పదం “మెఅహ్” నుండి తీసుకోబడినది. మెఅహ్ అనగా అరబీ భాషలో 100 అని అర్ధం. ఇవి తివాల్ సూరహ్ ల కన్న చిన్నవి మరియు 100 కన్న ఎక్కువ ఆయత్లు ఉన్న సూరహ్ లు.
3. మసానీ: వంద కన్న తక్కువ ఆయత్లు ఉన్న సూరహ్ లను అంటారు.
4. ముఫ్సలాత్: ఖుర్ఆన్ యొక్క చివరిలో ఉన్న చిన్న చిన్న సూరహ్ లను అంటారు.
5. హవామీమ్: “హా,మీ” అక్షరాలతో మొదలయ్యే సూరహ్ లను అంటారు. అవి: “గాఫిర్”, “ఫుస్సిలత్”, “షూరా”, “జుఖ్రుఫ్”, “దుఖాన్”, “జాసియహ్”, “అహ్ఖాఫ్”.
6. ముసబ్బహాత్: “తస్బీహ్”(సుబ్హాన్) ను సూచించే పదాలతో మొదలైన సూరహ్ లను అంటారు. అవి: “ఇస్రా”, “హదీద్”, “హష్ర్”, “సఫ్ఫ్”, “జుముఅహ్”, “తగాబున్”, “అఅలా”.
7. హామిదాత్: “హంద్”తో మొదలయ్యే సూరహ్ లు. అవి: “ఫాతెహతుల్ కితాబ్”, “అన్ఆమ్”, “కహఫ్”, “సబా”, “ఫాతిర్”.
8. ముఖత్తఆత్: “ముఖత్తఆత్” అక్షరాలతో మొదలయ్యే సూరహ్ లను అంటారు.
9. అజాయిమ్: వాజిబ్ సజ్దాలు ఉన్న సూరహ్ లను అంటారు.
10. తవాసీన్: అనగా ఈ మూడు సూరహ్ లు: “షుఅరా”, “నమ్ల్” మరియు “ఖసస్”.
11. ౙహ్రవాన్: బఖరహ్ మరియు ఆలె ఇమ్రాన్ సూరహ్ లను అంటారు. “జహ్రవాన్” అనగా మొరుపుగల
12. ఇతాఖ్: “ఇస్రా”, “కహఫ్”, “తాహా” మరియు “అంబియా” సూరహ్ లను “ఇతాఖ్” అంటారు.
13. ఖరీనతైన్: “అన్ఫాల్” మరియు “తౌబహ్” సూరహ్ లను ఖరీనతైన్ అంటారు.
14. ముఅవ్వౙతైన్: “ఫలఖ్” మరియు “నాస్” సూరహ్ లను అంటారు.[దర్స్ హాయి అజ్ ఉలూమె ఖుర్ఆన్, భాగం1, పేజీ314].
రిఫ్రెన్స్
తాహిరీ, హబీబుల్లాహ్, దర్స్ హాయి అజ్ ఉలూమె ఖుర్ఆన్, భాగం1, పేజీ 313-314, ఖుమ్, 1377షమ్సీ.
వ్యాఖ్యలు
Jazakallah
Shukriya... Iltemase dua.
MashaAllah
Shukriya... Iltemase dua...
వ్యాఖ్యానించండి