ఇమామ్ హసన్[అ.స] ఎలా మరణించారు అన్న విషయం పై అహ్లెసున్నత్ గ్రంథాలలో ఉన్న రివాయత్ల అనువాదం తెలుగులో.
అహ్లెసున్నత్ ఉలమాలు తమ గ్రంథాలలో వివిధ రకాలలో ఇమామ్ హసన్[అ.స] యొక్క మరణ సంఘణనను ఉల్లేఖించారు.
1. “హాకిమె నైషాబూరీ” రావీయుల క్రమంతో “ఉమ్మె బక్ర్” బింతె మసూర్ నుండి రివాయత్ ను ఉల్లేఖించారు: “హసన్ ఇబ్నె అలీ[అ.స] పై ఎన్నో సార్లు విషప్రయోగం జరిగింది, కాని వాటితో పోరాడి వాటి నుండి బయటపడ్డారు, కాని చివరి సారి ఇచ్చిన విషం యొక్క ప్రభావం వారి హృదయం పై పడింది మరియు వారు మరణించారు”
2. “ఇబ్నె అసాకిర్” తన రావీయుల ప్రకారం యాఖూబ్ మరియు అతను ఉమ్మె మూసా నుండి రివాయత్ ను ఇలా ఉల్లేఖించారు: “జొఅ’దహ్ బింతె అష్అస్ ఇబ్నె ఖైస్ హసన్[అ.స] ను విషమిచ్చింది”.
3. “ఇబ్నె కసీర్” ఇలా ఉల్లేఖించెను: ఎప్పుడైతే వారి చావు దగ్గర పడిందో, వారి వద్దకు వచ్చిపోయే వైధ్యుడు ఇలా అన్నాడు: “విషం వీరి లోపల(భాగాన్ని) ముక్కలు ముక్కలుగా చేసింది”.[అహ్లె బైత్ అజ్ దీద్గాహె అహ్లె సున్నత్, పేజీ31].
రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, అహ్లెబైత్ అజ్ దీద్గాహె అహ్లె సున్నత్, మస్జిదె ముఖద్దసె జమ్కరాన్, ఖుమ్, 1385, పేజీ31.
వ్యాఖ్యానించండి