ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క వీలునామ

సోమ, 11/26/2018 - 13:56

ఇబ్నె ముల్జిమ్[ల.అ] ఇమామ్ అలీ[అ.స] తల పై దాడి చేసిన తరువాత ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స]లకు చేసిన వీలు.

ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క వీలునామ

మిమ్మల్ని నిరంతరం అల్లాహ్ పట్ల ధర్మనిష్ఠ కలిగి ఉండమని కోరుతున్నాను. ప్రపంచాన్ని ఆశించకండి, అది మిమ్మల్ని ఆశించినా సరే. పోగొట్టుకున్న వాటి గురించి నిరాశ పడకండి. నిరంతరం సత్యమే పలకండి, పరలోక పుణ్యం కోసమే పని చేయండి, ఘాతకులకు విరోధిగా మరియు బాధితులకు మిత్రులుగా ఉండండి.
మీకు, నా సంతానానికి, కుటుంబ సభ్యులకు మరియు నా ఈ వీలునామ అందిన ప్రతీ ఒక్కరితో “అల్లాహ్ పట్ల భయభీతి మరియు మీ పనులలో క్రమం మరియు ముస్లిముల మధ్య సంధి చేయమని” కోరుతున్నాను. నేను మీ పితామహులైన దైవప్రవక్త[స.అ]ను ఇలా చెబుతుండగా విన్నాను: “ఇద్దరి మధ్య సంధి చేయడం సాధారణ నమాజ్ మరియు ఉపవాసానికి మించినది”
అల్లాహ్ ను దృష్టిలో ఉంచండి! అనాధుల విషయంలో; వారికి చెందే వసతి మరియు సౌకర్యములలో తక్కువ చేయకండి, మీ కళ్ళ ముందు నాశనం అవ్వకుండా.
అల్లాహ్ ను దృష్టిలో ఉంచండి! ఇరుగుపొరుగు వారి విషయంలో; ఎందుకంటే ఇరుగుపొరుగు వారి గురించి దైవప్రవక్త[స.అ] సిఫారసు చేశారు. వారు(దైవప్రవక్త) నిరంతరం వారి(ఇరుగుపొరుగు) గురించి ఎంత సిఫారసు చేసేవారంటే ఇరుగుపొరుగు వారిని కూడా వారసులుగా నిర్ధారిస్తారేమో అనిపించేది.
అల్లాహ్ ను దృష్టిలో ఉంచండి! ఖుర్ఆన్ విషయంలో, దాని పై అమలు చేసే విషయంలో ఇతరులు మిమ్మల్ని మించకుండా ఉండాలి.
అల్లాహ్ ను దృష్టిలో ఉంచండి! నమాజ్ విషయంలో; ఎందుకంటే నమాజ్ మీ ధర్మానికి మూలం.
అల్లాహ్ ను దృష్టిలో ఉంచండి! మీ ప్రభువు గృహం(కాబా) విషయంలో, మీరు ఉన్నంత కాలం దానిని ఖాలీగా ఉంచొద్దు; ఎందుకంటే ఒకవేళ అల్లాహ్ గృహాన్ని వదిలేయడం జరిగితే, శిక్ష అవతరణకు గడువు కూడా ఇవ్వబడదు.
అల్లాహ్ ను దృష్టిలో ఉంచండి! అల్లాహ్ మార్గంలో జిహాద్ విషయంలో, మీ ఆస్తి, ప్రాణాలు మరియు మీ నోళ్ళు(మాటలు) ద్వార.
మీకు శుభం కలుగుగాక! కలిసిఉండడం మరియు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవడం ద్వార. దూరంగా ఉండండి ఒకరినొకరు నష్టపరిచే మరియు దూరం చేసేవిషయాల నుండి. మంచిని చేయమని మరియు చెడును నిషేధించమని కోరడం ఎన్నటికీ విడవకండి. ఈ రెండు కర్తవ్యాలను నిర్వర్తించకపోతే మీ పై దుష్టులు అధికారం చేలాయిస్తారు, ఆ తరువాత మీరు ఎంత దుఆ చేసినా మీ దుఆ అంగీకరించబడదు.
ఆ తరువాత ఇలా అన్నారు: ఓ అబ్దుల్ ముతల్లిబ్ సంతతి! ఏ మాత్రం నేను మిమ్మల్ని “అమీరుల్ మొమినీన్ చంపబడ్డారు” అన్న సాకుతో ముస్లిముల రక్తం చిందిస్తూ చూడకూడదు. తెలుసుకోండి! నా రక్తమూల్యం విషయంలో నన్ను చంపినవాడు తప్ప మరొకడు చావకూడదు.
చూడండి, ఒకవేళ (ఇబ్నె ముల్జిమ్) చేసిన గాయం ఫలితంగా ఈ లోకాన్ని విడిస్తే, అతడు చేసిన ఒక గాయానికి బదులుగా ఒకే గాయం (శిక్ష) విధించండి. ఏమాత్రం అతడిని ముస్లహ్ చేయకండి(అతడి శరీరంలోని ముఖ్య భాగాలను ఉదా కళ్ళూ, చెవులు మరియు ముక్కూ లను కోయకండి) ఎందుకంటే నేను దైవప్రవక్త[స.అ]ను ఇలా చెబుతుండగా విన్నాను: “ముస్లహ్ చేయకండి, అది కరిచేకుక్క అయినా సరే”.  

రిఫ్రెన్స్
నెహ్జుల్ బలాగహ్, ఖుత్బహ్ నెం47.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16