హజ్రత్ హూద్[అ.స] మరియు వారి జాతి మధ్య జరిగిన సంభాషణను ఖుర్ఆన్ మాటల్లో...
అల్లాహ్ హజ్రత్ హూద్[అ.స]ను “ఆద్” జాతి వద్దకు “తౌహీద్” వైపుకు ఆహ్వానించేందు పంపెను. మరి హజ్రత్ హూద్[అ.స] వారి జాతి వారితో ఇలా అన్నారు: “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యదైవం లేడు. మరి అలాంటప్పుడు మీరు భయపడరా?”
అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు. అప్పుడు హజ్రత్ హూద్[అ.స] “ఓ నా జాతివారలారా! నాలో ఏమాత్రం తెలివితక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని” అని అన్నారు. ఆ తరువాత “ఏమిటీ, మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీనుండే ఒక వ్యక్తి ద్వారా, మీ ప్రభువు తరపు నుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్యర్యం కలిగించిందా? అల్లాహ్ మిమ్మల్ని నూహ్ జాతి అనంతరం వారసులుగా చేసి, మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు” అని వారికి బోధ పరిచారు.
అప్పుడు వారి జాతి వారు ఇలా అన్నారు: “మేము అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదిలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు”.
హూద్[అ.స] ఇలా అన్నారు: “ఇక మీ ప్రభవు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను”.[ఆరాఫ్:65-71].
వ్యాఖ్యలు
MashaAllah
Thanks for brief history of our prophets.
Shukriya.. Mohtaje Dua.
వ్యాఖ్యానించండి