హజ్రత్ హూద్[అ.స] జాతి పరిణామం

మంగళ, 01/01/2019 - 16:33

అల్లాహ్ తరపు నుండి ఆద్ జాతి వారికి రుజమార్గం చూపించడానికి పంపబడ్డ ప్రవక్త హజ్రత్ హూద్[అ.స]ను తిరస్కరించిన జాతి పరిణామం.

హజ్రత్ హూద్[అ.స] జాతి పరిణామం

హజ్రత్ హూద్[అ.స] తన జాతివారితో ఇలా అన్నారు: “ఓ జాతివారలారా! మీ పోషకుని (అనగా అల్లాహ్) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి”[హూద్:52].
మూడు సంవత్సరాల వరకు హజ్రత్ హూద్[అ.స] జాతి వారిపై వర్షం కురవలేదు. వారు అల్లాహ్ తరపు నుండి పంపబడిన ప్రవక్త హూద్[అ.స] యొక్క దౌత్యాన్ని అంగీకరించలేదు మరియు వారి జాతి వారు ప్రవక్త పిలుపును ఆహ్వానించలేదు; చివరికి వారు అల్లాహ్ ఘోరమైన శిక్షకు గురి అయ్యారు. మరియు అల్లాహ్ హజ్రత్ హూద్[అ.స]ను విశ్వసించిన వారిని ఆ ఘోరమైన శిక్షకు గురి కాకుండా రక్షించాడు.  ఈ విషయాన్ని అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “ఆద్ జాతివారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి”.[హాఖ్ఖాహ్:6,7]. “మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్ నూ, అతనితోపాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము”.[హూద్:58].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 38