సమూద్ జాతి రుజుమార్గం కోసం అవతరించబడ్డ హజ్రత్ సాలెహ్[అ.స] ఆ జాతిని రుజుమార్గం వైపు ఇచ్చిన పిలుపు గురించి ఖుర్ఆన్ ప్రస్తావనం.
హజ్రత్ సాలెహ్[అ.స] యొక్క జాతి పేరు “సమూద్”. అల్లాహ్ హజ్రత్ సాలెహ్[అ.స] మరియు వారి జాతి గురించి ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మరి సమూద్ జాతి వైపుకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాము. అతను (వారినుద్దేశించి), “ఓ నా జాతి వారలారా! మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి (పశ్చాత్తాపం చెందండి). నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు” అని చెప్పారు. దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు: “ఓ సాలెహ్! ఇంతకు మునుపు వరకూ మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఏమిటీ, మా తాతముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా?! నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దాని పై మాకు తీవ్రమైన సందేహం ఉంది”[హూద్:61,62]
అప్పుడు హజ్రత్ సాలెహ్[అ.స] ఇలా అన్నారు: “ఓ నా జాతి ప్రజలారా! మీరే చెప్పండి, నేను నా ప్రభువు తరపున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి, ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా, నేను ఆయన పట్ల అవిధేయతను కనబరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు? మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించటం తప్ప ఏమీ చెయ్యలేరు”[హూద్:63].
వ్యాఖ్యలు
Mashallah
Shukriya.. Mohtaje Dua.
جزاک اللہ
Shukriya.. iltemase dua.
వ్యాఖ్యానించండి