సమూద్ జాతి ఖుర్ఆన్ దృష్టిలో

మంగళ, 01/01/2019 - 17:30

ప్రవక్త హజ్రత్ సాలెహ్[అ.స] యొక్క జాతి, సమూద్ జాతి. వారి గురించి ఖుర్ఆన్ మాటల్లో....

సమూద్ జాతి ఖుర్ఆన్ దృష్టిలో

సమూద్ జాతి గురించి ఖుర్ఆన్ ఇలా ప్రస్తావిస్తుంది: “మరి సమూద్ జాతి వైపుకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాము”[హూద్:61] “సమూద్ (జాతి) వారు కూడా దైవసందేహరులను ధిక్కరించారు. అప్పుడు వారి సోదరుడైన సాలెహ్ వారినుద్దేశించి ఇలా అన్నారు: “ఏమిటీ! మీరు (అల్లాహ్ కు) భయపడరా? నేను మీ వైపునకు పంపబడిన విశ్వసనీయుడనైన ప్రవక్తను. అందుకే మీరు అల్లాహ్ కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి. ఈ పనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది. ఏమిటీ, ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మీరు ప్రశాంతంగా (అండగలిగేలా) వదలివేయబడతారా? అంటే ఈ తోటలలో, ఈ చెలమలలో, ఈ పొలాల్లో, సుతిమెత్తని, కోమలమైన పండ్ల గెలలు గల ఈ ఖర్జూర తోటలలో (కలకాలం ఉంటామని అనుకుంటున్నారా?) మీరు పర్వాతాలను చెక్కి ఆడంబరమైన ఇండ్లను తయారు చేస్తూన్నారు. మీరు అల్లాహ్ కు భయపడండి. నాకు విధేయత చూపండి. హద్దుమీరి పోయేవారికి విధేయత చూపటం మానండి వారు భువిలో కల్లోలాన్ని రేకెత్తిస్తున్నారు. ఎలాంటి సంస్కరణా కార్యాలు చేయరు”.[షుఅరా:141-152].
దానికి వారు ఇలా జవాబిచ్చారు: “నువ్వు చేతబడికి గురైనవానిలా ఉన్నావు. నువ్వూ మాలాంటి ఒక మామూలు మనిషివే. ఒకవేళ నువ్వు నిజంగా సత్యవంతుడవే అయితే ఏదైనా నిదర్శనాన్ని తీసుకురా”[షుఅరా:153,154].
సమూద్ జాతి కోరిక ప్రకారం అల్లాహ్ పర్వతం గర్భం నుండి ఆడ ఒంటెను పంపాడు. అప్పుడు హజ్రత్ సాలెహ్[అ.స] వారితో ఇలా అన్నారు: “ఇదిగో ఆడ ఒంటె![షుఅరా:156] అల్లాహ్ మీ కోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లాహ్ భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలి పెట్టండి. దానికి ఎలాంటి కీడూ తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది”[హూద్:64] నీరు త్రాగటానికి ఒక వంతు దీనిది. ఒక నిర్ధారిత దినం మీది. (జాగ్రత్త!) దీన్ని దురుద్దేశంతో తాకకండి. (ఒకవేళ మీరు అలా చేశారంటే) పర్యవసానంగా ఒక మహాదినపు విపత్తు మిమ్మల్ని చుట్టుముట్టుతుంది.[షుఅరా:156] అయినాసరే వాళ్లు దాని కాలి గిట్టెలను నరికేశారు. ఆ తరువాత వారు బాధపడసాగారు. అంతే! శిక్ష వారిని కబళించింది.[షుఅరా:157,158].  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36