ఆద్ జాతి ఖుర్ఆన్ దృష్టిలో

బుధ, 01/02/2019 - 04:59

హజ్రత్ హూద్[అ.స] యొక్క జాతి అయిన ఆద్ జాతి ప్రస్తావనను సంక్షిప్తంగా చెప్పిన ఆయతుల సూచన.

ఆద్ జాతి ఖుర్ఆన్ దృష్టిలో

అల్లాహ్ ఆద్ జాతి గురించి ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మరి మేము ఆద్ జాతి వైపుకు వారి సోదరుడు హూద్ ను పంపాము”[హూద్:50]. ఆద్ జాతి వారు (కూడా) దైవప్రవక్తలను ధిక్కరించారు. అప్పుడు వారి సోదరుడైన హూద్, (వారినుద్దేశించి) ఇలా అన్నారు: “మీరు బొత్తిగా భయపడరా? నేను మీ వద్దకు పంపబడిన నమ్మతస్థుణ్ణి అయిన ప్రవక్తను. కనుక అల్లాహ్ కు భయపడండి. నా విధానాన్ని ఆనుసరించండి. ఈ పనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది. ఏమిటీ, మీరు ఎత్తైన ప్రతీ స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా? మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన) భవనాలను నిర్మిస్తున్నారే1. మీరు ఎప్పుడు, ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్యపూరితంగా పంజా విసురుతున్నారే!?. కనుక, మీరు అల్లాహ్ కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి. మీకు తెలిసివున్న సమస్త (మంచి) వస్తువులను మీకు వొసగి, మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి. ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు. తోటల ద్వారా, చెలమల ద్వారా (సహాయపడ్డాడు). నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను”[షుఅరా:123-135].
అప్పుడు వారిలా అన్నారు: “నువ్వు మాకు బోధించినా, బోధించేవారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే. ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు. ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము.[షుఅరా:136,137]
అల్లాహ్ ఆద్ జాతి గురించి చెప్పి దైవప్రవక్త(స.అ)తో ఇలా అనెను: “ఆద్ (జాతి) వారు హూద్ ను ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు”[షుఅరా:139].

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9